నవ్వుతూ, సిగ్గులొలికిస్తూ మాట్లాడే లేడీ టివి యాంకర్స్ బుల్లితెరపై వివిధ కార్యక్రమాలను రక్తికట్టిస్తుంటారు. అంద మైన ముఖ సౌందర్యంతో అనర్గళంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఇటువంటి కొందరు పాపులర్ లేడీ టివి యాంకర్స్ పలు హిట్ టివి షోలేక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వీరిలో ఉదయభాను, ఝాన్సీ, సుమ, కలర్స్ స్వాతి తదితరులు నేడు బుల్లితెరపై యాంకర్లుగా ప్రేక్షకులను మైమరపిస్తున్నారు. సరదాగా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ టివి యాంకర్ల గురించి తెలుసుకుందామా...
ఒకప్పుడు టివి యాంకర్లంటే కార్యక్రమాలకు అనుగుణంగా సీరియస్‌గా మాట్లాడుకుంటూ పోయేవారు. కానీ నేడు పరిస్థితి ఎంతో మారింది. బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు టివి ఛానెల్స్‌లో విభిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా కార్యక్రమాలుండే విధంగా చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగా కార్యక్రమాల యాంకరింగ్ ఉండాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుల్లితెర ప్రేక్షకులను మైమరపించేవిధంగా యాంకరింగ్ చేస్తున్నారు కొందరు పాపులర్ యాంకర్లు.
ఉదయ భాను
చక్కటి అందం...మోముపై ఎల్లవేళలా చిరునవ్వు... సరదాగా అనిపించే యాంకరింగ్... ఇవన్నీ కలిస్తే ఆమే ఉదయభాను. నేడు బుల్లితెరపై యాంకరింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు ఆమె. ఇప్పటివరకు ఎన్నో తెలుగు టివి షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒకేసారి ఆరు ఛానెల్స్‌లో ఆరు టివి షోలను వివిధ గెటప్‌లలో యాంకరింగ్ చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. కేవలం యాంకర్‌గానే కాకుండా సినీతారగా, డ్యాన్సర్‌గా సైతం ఆమె పేరు,ప్రఖ్యాతులు సంపాదించారు.
వివిధ టివి కార్యక్రమాలకు ఆమె వ్యాఖ్యానం ఎంతో సహజసిద్దంగా ఉంటుంది. నేడు తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న యాంకర్ ఆమె కావడం విశేషం. ఇక 15 సంవత్సరాల వయసులో బుల్లితెరపై హార్లిక్స్ హృదయాంజలి కార్యక్రమంలో కనిపించారు ఉదయభాను. ఆ తర్వాత పాపులర్ టివి షో ‘వన్స్ మోర్ ప్లీజ్’లో హాస్య నటుడు వేణు మాధవ్‌తో కలిసి కో-యాంకరింగ్ చేసి బుల్లితెర ప్రేక్షకులను మైమరపించారు. సాహసం చేయరా డింభకా, జానవులే నెరజానవులే, నీ ఇల్లు బంగారం కాను, ఢీ, రెలా రె రెలా వంటి హిట్ టివి షోలకు ఆమె యాంకరింగ్ చేశారు.
ఆమె చేసిన టివి షోలకు ఎక్కువ రేటింగ్ కూడా లభిస్తుండడం విశేషం. ఇక యాంకర్‌గానే కాదు పలు టాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు ఉదయభాను. ఎర్ర సైన్యం, కొండవీటి సింహం, శ్రావణ మాసం తదితర చిత్రాల్లో నటించి సినీతారగా పేరుతెచ్చుకున్నారు. ఉదయభాను లీడర్(2010) చిత్రంలో చేసిన ఐటమ్‌సాంగ్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇక రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో జన్మించిన ఉదయభాను నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తండ్రి మృతిచెందారు. ఆ తర్వాత ఆమె ఎన్నో కష్టాలకు ఓర్చి జీవితంలో క్రమ,క్రమంగా పైకి ఎదిగారు. బుల్లితెర రంగంలోకి ప్రవేశించి నేడు ప్రముఖ యాంకర్‌గా పేరుతెచ్చుకున్నారు.
సాహసం చేయరా డింభకా, జానవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం కాను, ఢీ, రెలా రె రెలా వంటి హిట్ టీవీ షోలకు ఉదయభాను యాంకరింగ్ చేశారు. ఆమె చేసిన టీవీ షోలకు ఎక్కువ రేటింగ్ లభిస్తుండడం విశేషం.
ఝాన్సీ...
ముచ్చటైన వ్యాఖ్యానంతో బుల్లితెర ప్రేక్షకులను అలరించే అందమైన యాంకర్ ఝాన్సీ. పలు పాపులర్ టివి షోలలో విభిన్న గెటప్‌లతో దర్శనమిస్తూ ఆకట్టుకునేవిధంగా యాంకరింగ్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్యం. కేవలం యాంకర్‌గానే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించి చక్కటి నటీమణిగా పేరుతెచ్చుకున్నారు ఝాన్సీ. ఫ్యామిలీ సర్కస్ వంటి చిత్రాల్లో ఆమె నటన అందరినీ మైమరపించింది. కొన్ని సినిమాల్లోని పాత్రలు ఆమెకు ఎంతగానో పేరును తీసుకువచ్చి పెట్టాయి.
ఓ చిత్రంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన మహిళగా గోదావరి యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక టాక్ ఆఫ్ ది టౌన్ వంటి టివి షోలలో ఆమె బహుముఖ అవతారాలలో కనిపిస్తూ విభిన్నమైన యాసలో మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులను మురిపించారు. ఇతర యాంకర్ల కంటే విభిన్నంగా పలు టివి షోలలో గెస్ట్‌లను ఇంటర్వ్యూ చేస్తూ కార్యక్రమాలను రక్తికట్టిస్తున్నారు. బిగ్ ఎఫ్‌ఎం రేడియోలో కూడా ఝాన్సీ యాంకరింగ్ చేశారు. దీంతో పాటు ఆమెకు సొంతంగా ఓ రికార్డింగ్ స్టూడియో కూడా నిర్వహిస్తున్నారు.
బిగ్ ఎఫ్‌ఎం రేడియోలో కూడా ఝాన్సీ యాంకరింగ్ చేశారు. ఆమె సొంతంగా ఓ రికార్డింగ్ స్టూడియో కూడా నిర్వహిస్తుండడం విశేషం.
టివి యాంకర్‌గానే కాదు సినీ తారగా కూడా రాణిస్తున్న అమ్మాయి స్వాతి రెడ్డి. కలర్స్ స్వాతిగా బుల్లితెరపై పాపులారిటీ సంపాదించారు ఆమె. టెలివిజన్ షో కలర్స్ ద్వారా పేరుతెచ్చుకున్న ఆమెను కలర్స్ స్వాతిగా పిలవడం ప్రారంభించారు. కలర్స్ షో మా టివిలో ప్రసారమైంది. ఇక యాంకరింగ్‌లో రాణించిన అనంతరం ఆమె సినిమాల్లో సహాయ నటిగా చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత 2008లో తమిళ చిత్రం సుబ్రమణ్యపురమ్‌లో హీరోయిన్‌గా చేసి పేరుతెచ్చుకున్నారు. తెలుగులో అష్టాచమ్మా చిత్రం ఆమెకు ఎంతో పేరు తీసుకువచ్చిపెట్టింది.
ఈ చిత్రానికిగాను ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, నంది అవార్డును దక్కించుకోవడం విశేషం.
ఇక స్వాతి పుట్టింది ఒకప్పటి సోవియట్ యూనియన్ రష్యాలోని వ్లాదివొస్తొక్‌లో. ఆమె తండ్రి ఇండియన్ నేవీలో పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ఆయన సోవియట్ యూనియన్ రష్యాకు సబ్‌మెరైనర్‌గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత వారి కుటుంబం విశాఖపట్నంకు వచ్చింది. స్వాతి చిన్నతనమంతా వైజాగ్‌లోనే గడిచింది. వారి కుటుంబం హైదరాబాద్‌కు మకాం మార్చిన అనంతరం ఆమె యూసుఫ్‌గూడాలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నారు.
బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 17 సంవత్సరాల వయసులో టివి రంగంలోకి యాంకర్‌గా రంగప్రవేశం చేశారు. మా టివిలో కలర్స్ కార్యక్రమానికి హోస్ట్‌గా చేసి మంచి పేరుతెచ్చుకున్నారు. హుషారెత్తించే వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. దీంతో మంచిరేటింగ్ సంపాదించిన ఈ షో ప్రైమ్‌టైమ్ స్లాట్‌లో ప్రసారమైంది. 150 ఎపిసోడ్‌లకు స్వాతి యాంకరింగ్ చేయడం విశేషం. ఇక సినిమాల్లో నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ప్లే బ్యాక్ సింగర్‌గా కూడా చేశారు. 2008లో జల్సా చిత్రం హీరోయిన్ ఇలియానా డిక్రూజ్‌కు స్వాతి డబ్బింగ్ చెప్పారు. 2011లో ప్లేబ్యాక్ సింగర్‌గా పాడడం ప్రారంభించారు.
కలర్స్ స్వాతి పుట్టింది ఒకప్పటి సోవియట్ యూనియన్ రష్యాలోని వ్లాదివొస్తొక్‌లో. ఆమె తండ్రి ఇండియన్ నేవీలో పనిచేసేవారు. ఉద్యోగరీత్యా
ఆయన సోవియట్ యూనియన్ రష్యాకు సబ్‌మెరైనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన అక్కడ కొంతకాలం పనిచేశారు.
సుమ కనకాల...
పాపులర్ తెలుగు టివి యాంకర్లలో సుమ కనకాల ఒకరు. ఆమె సినీ, టివి నటుడు రాజీవ్ కనకాల భార్య. సినీ, టివి నటుడు దేవదాస్ కనకాలకు స్వయానా కోడలు సుమ. 1978 సంవత్సరం జూన్ 27న జన్మించిన ఆమె నేడు పలు హిట్ టివి షోలకు యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మైమరపించే చిరునవ్వు...చక్కటి వ్యాఖ్యానంతో బుల్లితెర ప్రేక్షకులను సుమ ఆకట్టుకుంటున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన మళయాళి అమ్మాయి ఆమె.
కానీ ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు ఏకంగా యాంకరింగ్ చేస్తూ ఈ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకోవడం విశేషం. మళయాళం, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలను చక్కగా మాట్లాడే సుమ యాంకరింగ్ పలు టివి షోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టివి యాంకర్ ఝాన్సీ, సుమలు ఇద్దరూ కలిసి ఒకేసారి యాంకరింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. ఇద్దరూ రాణించి యాంకర్లుగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సినీ నేపథ్య గాయని సునీత సుమకు మంచి ఫ్రెండ్.
కేరళ చెందిన మళయాళీఅమ్మారుు సుమ కనకాల. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు ఏకంగా యాంకరింగ్ చేస్తూ ఈ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకోవడం విశేషం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి