6, డిసెంబర్ 2011, మంగళవారం

కథనం


rangulakala1-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaసిల్వర్‌స్క్రీన్ మీద 24 ఫ్రేమ్స్ ఏం చెప్పాయి..కంటే ఎలా చెప్పాయి అన్నదే పాయింట్ అదే కథనం... సినిమా భాషలో నరేషన్ హిట్టూ, ఫట్టును నిర్థారించే ప్రెజెంటేషన్ దాని మీదే నేటి రంగులకల డిస్కషన్ సృజనాత్మక ప్రక్రియలన్నిట్లో వ్యక్తీకరణ ముఖ్యం. దీనికి మూలమైన అంశంగా నరేషన్ నిలుస్తుంది. కథను ఆవిష్కరిస్తూ సాగే సినిమాలకైతే ఈ నరేషన్ లైఫ్‌లైన్ లాంటిది. ప్రేక్షకుడు దృశ్యసమాహారమైన సినిమా పట్ల అనురక్తి పొందడానికి వస్తు విలక్షణతోపాటు కథనంలో కూడా వైవిధ్యాన్ని ఆశిస్తాడు. అలాంటి నరేషన్ సినిమాల్లో కథాపరమైన వివరాలు ఇవ్వడానికంటే కూడా కథకు దృశ్యరూపం కల్పిస్తూ మౌలికమైన కథాంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ప్రాధాన్యం ఇస్తుంది.

ఆడంబరాలు...అవాస్తవికత
సినిమా తొలినాళ్లలో నరేషన్ సాదాసీదాగా కథను ముందుకు నడిపిస్తూ సాగిపోయేది. ప్రపంచంలో మొట్టమొదటి ఫిక్షన్ ఫిలింగా వినుతికెక్కిన ‘ ఎ ట్రిప్ టు మూన్’లో, ఆ తర్వాత క్రైం అంశంతో నిర్మించిన ఫస్ట్ మూవీ ‘గ్రేట్ ట్రైన్ రాబరీ’లో మూలకథకు కొంచెం కళాత్మకత తోడై నరేషన్ నేరుగా సాగుతుంది. అట్లాగే మనదేశంలో కూడా తొలి రోజుల్లో నిర్మించిన పౌరాణిక చిత్రాల్లో మూల రచనల్లో సాగిన రీతిలోనే నరేషన్ కనిపిస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ రచయితలు, దర్శకులు కొత్త ఆలోచనల్ని సంతరించుకుని సినిమా నరేషన్ విషయంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఫ్లాష్‌బ్యాక్, ఫిల్మ్ ఇన్ ఫిల్మ్ లాంటి వైవిధ్యభరితమైన నరేషన్ టెక్నిక్స్‌ని అమలులోకి తెచ్చారు. మరోపక్క సినిమా రంగంలో పెరుగుతూ వచ్చిన స్టార్ వాల్యూ, అధికపెట్టుబడులు తదితర కారణాల రీత్యా నరేషన్‌లో నవ్యత కంటే ఆడంబరం, అవాస్తవికత, టెక్నికల్ అంశాలపైన చలనచివూతకారుల దృష్టి మళ్లింది. ఫలితంగా తెలుగు సినిమాల్లో వైవిధ్యభరితమైన నరేషన్‌కి ఆశించినంత స్థానం లభించలేదనే చెప్పుకోవచ్చు.

డిజైసిస్
కాని ప్రపంచ సినిమాను ముఖ్యంగా యూరోప్ సినిమాను పరిశీలిస్తే సినిమా నరేషన్‌లో కథను నిర్మించడానికి అనేక సూత్రాలు, ఆనవాయితీలు పాటిస్తారు. ప్రాథమికంగా వాస్తవ ప్రపంచాన్ని తెరపై చిత్రించడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా ప్రేక్షకుడు సినిమాల్లో తనని తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. లేదా తెరపై సాగే కథనంలో తానూ భాగస్వామిగా ఫీలవవుతాడు. అలా దృశ్యంలో ప్రేక్షకుడు లీనమయ్యేందుకు కథనాత్మకత, చిత్రీకరణల్లో డిజైసిస్ ప్రధాన భూమికను పోషిస్తుంది. డిజైసిస్ కథనంలోని ఇతివృత్తం, కథలోని విషయ ప్రపంచం రెండూ కలగలసిన స్థితిని సూచిస్తుంది. అంటే తెరపై కనిపించే కథావాస్తవమూ కథా సమస్తమూ డిజైసిస్‌లో ఒక భాగమన్నమాట. ఇంకా చెప్పాలంటే పాత్రలు, వాటి సంభాషణలు, వేషభాషలు, అలవాటు,్ల నటన అన్నీ డిజైసిస్‌లో అంతర్భాగమే. సినిమాల్లో వినిపించే ధ్వని, కనిపించే సెట్లు, నృత్యాల్లో హీరోహీరోయిన్లు, చుట్టూ డ్యాన్స్ చేసే ఎక్స్‌ట్రా నటీనటులు అంతా డైజిసిస్‌లో భాగమై సినిమా నరేషన్ పై ప్రభావం చూపిస్తాయి.

అయితే సినిమాల్లో ‘నరేషన్’ వాస్తవికతను ఆధారం చేసుకుని సాగినపుడు వాటిల్లోని పాత్రలన్నీ ఏదో ఒక ప్రేరణతో ముందుకు సాగుతాయి. అనేకసార్లు పాత్రల స్వభావం, వాటి చలనం వల్లే సినిమాల్లో కథ ఆవిష్కృతం అవుతుంది. ముఖ్యంగా ప్రధాన స్రవంతి సినిమాల్లో ఈ ప్రేరణ పురుష పాత్రల ఆధారంగానే ముందుకు నడుస్తుంది. దాదాపు అన్ని భాషల్లోని వ్యాపార సినిమాల్లో కథాకథనాలు పురుషదృక్కోణం నుంచే సాగుతాయి. ఎక్కడైనా స్త్రీ ప్రధాన పాత్రగా కనిపించినప్పటికీ ఆ సినిమాను చివరికి పురుష అవగాహనతోనే ముగింపు పలుకుతారు.

పారలల్ నరేషన్
ఇలా వ్యాపార చిత్రాలు, కళాత్మక చిత్రాల్లో నరేషన్ రీతులు భిన్నంగా ఉంటున్నాయి. అయినా కొందరు కథకులు, నవలాకారులు, స్క్రీన్‌ప్లే రచయితలు ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ సినిమా కథనంలో విలక్షణ, వైవిధ్యాన్ని సాధించేందుకు కృషి చేస్త్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల ఫలితంగా ఆవిర్భవించిందే ‘పారలల్ నరేషన్’ లేదా మల్టిపుల్ నరేషన్. ఈ టెక్నిక్ మనకు నవలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నవలల్ని ఆధారం చేసుకుని నిర్మించిన సినిమాల్లో సైతం ఈ కథనశైలి కనిపిస్తుంది. మెమంటో, రన్ లోలారన్, షైన్, పల్ఫ్‌ఫిక్షన్, ది స్వీట్ హియర్ ఆఫ్టర్ లాంటి సినిమాలు వైవిధ్యమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.

విజయాలు...వైఫల్యాలు
rangulakala-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaనిజానికి ఈ నరేషన్‌కి సంబంధించి ప్రపంచ సినీ చరివూతలో చేసిన ప్రయోగాల్లో కొన్ని విజయవంతమయ్యాయి. మరికొన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ‘ షైన్’ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ చిత్రీకరణ గొప్ప విజయాన్ని సాధిస్తే ‘సాటర్ డే నైట్’లో వైఫల్యం చెందింది. ‘సిటిజన్ కేన్’లో ఫ్లాష్‌బ్యాక్‌లు అద్భుతమైన కథనరీతికి ఉదాహరణగా నిలిచాయి. ఆ తర్వాత అంత ప్రభావంతమైన ఫ్లాష్‌బ్యాక్‌ను నిర్వహించిన వారేలేరు. అట్లాగే ‘ది స్వీట్ హియర్ ఆఫ్టర్’ సినిమాల్లోని 11 కథల్లో 9కథలు వేర్వేరు కాలాలకి చెందినవి. అలాంటి కథన ప్రయత్నం మరొకరు చేయలేదు.
అయితే సినిమా నిర్మాణానికి సంబంధించినంత వరకు కథనరీతి శిలాశాసనం కాదు. అది నిరంతరం మార్పునకు లోనయ్యే ప్రక్రియే. అట్లాగే అన్ని రకాల కథలకి ఒకే రకమైన కథనం ఉండదు. భిన్నమైన కథలకు వైవిధ్యమైన కథనశైలి కనిపిస్తుంది. అదే పారలల్ నరేషన్ (సమాంతర కథనం). ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కథనశైలిగా చెప్పుకోవచ్చు. ఈ తరహా కథనంలో అర్థవంతమైన కథా వేగం, భిన్న కథనాల మధ్య సంబంధం, చివరగా ముగింపులు ప్రధానమైనవి. అనేక కథల్ని సమాంతరంగా నడిపిస్తూ వాటి మధ్య సమన్వయాన్ని సాధించడమే ఈ నరేషన్ ప్రధాన లక్షణం. పారలల్ నరేషన్‌లో కూడా రకాలున్నాయి

ఊహలకు సమాంతరంగా...
మొట్టమొదటిది ప్లాష్‌బ్యాక్ ట్రీట్‌మెంట్. ప్రేక్షకుల ఊహలకు రెక్కలు తొడిగి వాటికి సమాంతరంగానూ, భిన్నంగానూ కథనాన్ని కొనసాగించడం ఇందులో కనిపిస్తుంది. సస్పెన్స్, క్రైం, డిటెక్టీవ్ చిత్రాల్లో ఈ టెక్నిక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు మానసిక సంఘర్షణని సామాజిక సంఘర్షణని చూపించడానికి కూడా ఫ్లాష్‌బ్యాక్ ఉపయుక్తమవుతుంది.

మల్టిపుల్...
రెండవది ‘మల్టిపుల్ ప్రొటగనిస్టు’ శైలి. ఇందులో ముఖ్యాభినేత ఒక్కడే కాకుండా బహుపావూతలు ప్రధానమై ఒక్కొక్కటి ఒక్కో కథని ఆవిష్కరిస్తాయి. అన్నింటి మధ్యా అంతర్‌లయగా మౌళికాంశం కొనసాగుతూనే ఉంటుంది. ఈ తరహా కథనాలు ఆర్మీ, లక్ష్యం కోసం పనిచేసే దళాల కథల్లో కనిపిస్తాయి.

సీక్వెన్షియల్.. టాండెమ్

మూడవది సీక్వెన్షియల్ నరేషన్. ఇందులో భిన్నమైన కథల్ని వరుసక్షికమంలో చెప్పుకుంటూ పోతారు. ముగింపులో ఏదో ఒక అంశం ప్రాతిపదికన వాటిని కలిపేస్తారు. నాలుగవది ‘టాండెమ్ నరేషన్’. ఇందులో సమాన స్థాయిగల కథల్ని అంతే సమానంగా ఆవిష్కరిస్తారు. ఇలాంటి కథనాలు పౌరాణిక చిత్రాలకు ఉపయోగపడతాయి. ఈ పారలల్ నరేటివ్స్‌కి మరో రకమైన విభజన కూడా ఉంది. వాటిని ‘క్యారెక్టర్ బేస్’్డ పారలల్ నరేటివ్, ‘లొకేషన్ బేస్డ్’ పారలల్ నరేటివ్‌గా చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ బేస్డ్ పారలల్ నరేషన్‌లో ప్రేక్షకుడు సినిమా కథని సమక్షిగంగా అర్థం చేసుకోవడానికి విభిన్న పాత్రల దృష్టికోణాలు దోహదం చేస్తాయి. లొకేషన్ బేస్డ్ పారలల్ నరేటివ్‌లో ఒక ప్రత్యేకమైన లొకేషన్‌లో జరిగే పలుసంఘటనల్ని ప్రేక్షకుడు వీక్షించే స్థితి ఉంటుంది. ఇలా పలురకాలుగా ఉన్న సమాంతర కథనాల ద్వారా భిన్న అంశాలు చర్చిండానికి, వైవిధ్యమైన నేపథ్యాల్ని సృజించడానికి ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇవ్వాళ్టి వేగంలో ప్రేక్షకలోకానికి అనువైన కథనశైలి ఈ పారలల్ నరేషన్. అయితే దీన్ని నిర్వహించడంలో దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. ఎలాంటి సందిగ్ధతలకు తావులేకుండా భిన్న కథనాల్ని మౌళిక కథాంశాన్ని ఇరుసుగా చేసుకుని నిర్వహించినపుడే అది విజయవంతమవుతుంది. ప్రతికళ మారుతున్న కాలానికి అనుగుణంగా స్పందించాల్సిందే. ఆ మార్పుల్ని తనలో ఇముడ్చుకోవలిసిందే. ఏ కళ అయినా, సినిమా అయినా సరిహద్దుల్ని చెరిపేసేదిగా ఉండాలి. అప్పటిదాకా స్థిరపడ్డ అన్ని లక్షణాల్ని ఛేదించుకుని నవ్యరీతులకు దారులు తీయాలి.
(11-11-2011 నమస్తే తెలంగాణ సౌజన్యంతో..)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి