5, ఫిబ్రవరి 2011, శనివారం

నందినీ రెడ్డి... ఎ క్రేజీ స్క్రీన్ ప్లే


అమ్మాయి, అబ్బాయి కలుసుకున్నారు. అతను ప్రేమలో పడ్డాడు. ఆమెకు అప్పటికే వేరొకరితో వివాహం నిశ్చయమైపోయింది- ఇలా కథను చెబితే కాసేపయ్యాక వింటున్నవారే క్లైమాక్స్ చెప్పేస్తారు. ఎలా? అని ప్రశ్నిస్తే ఎన్ని సినిమాలు, ఎన్ని సీరియల్స్ చూడటం లేదూ? అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. ఇలాంటి కథనే చక్కని సన్నివేశాల స్క్రీన్‌ప్లేతో చెబితే అది అలామొదలైంది సినిమా అవుతుంది. ఈ సినిమాకు క్యాప్షన్ ఎ క్రేజీ లవ్ స్టోరీ. కాని సినిమా చూసిన ఎవరైనా ఎ క్రేజీ స్క్రీన్‌ప్లే అనే అంటారు.
ఎలా మొదలైందంటే.. - డైరెక్టర్ నందినీరెడ్డి

నాని -షారూఖ్ ఖాన్ నిత్య -అమీర్ ఖాన్ నేనెప్పుడూ వీళ్లని డైరెక్ట్ చేయలేదు. కేవలం సూచనలు చేశాను. నా దారి ఇదనిచూపించాను. వాళ్లు ఆ దారిలో వెళ్లిపోయారు. మొదట వాళ్లు కలుసుకున్న సీన్ దగ్గర నుంచి చివరిదాకా వాళ్ల నటనఎక్కడా మొనాటనీ అనిపించదు. అన్ని షేడ్సూ వుంటాయి. అందుకే నాని షారూఖ్ ఖాన్ అయితే, నిత్య అమీర్ఖాన్అయింది. నా పని సులభంగా జరగటం కోసం అలాంటి నటీనటులను ఎంచుకున్నాను. సినిమా ఇప్పటి తరం పల్స్పట్టుకోవాలని ముందు నుంచీ అనుకున్నాను. దానికి తగ్గట్టే కథ రాసుకున్నాను. తల్లిదండ్రులతో పిల్లల అనుబంధం, అమ్మాయి, అబ్బాయిల మధ్య సున్నితమైన ప్రేమ. ఇదే నా కాన్సెప్ట్. ఇందులో పాత్రలే సినిమాను నడిపిస్తాయి. వాటిచుట్టూ సీన్ క్రియేట్ చేయడమే నేను చేసింది. ఒక్కో ఆలోచనకు మళ్లీ సినిమా అంత కథ వుంది.

ఫొటో ఆలోచన అలా వచ్చింది...
టైటిల్స్ పడేటపుడు చిన్ననాటి ఫోటోలు పెట్టాలన్న ఆలోచన ముందునుంచీ వున్నదేమీ కాదు. హీరోయిన్ నిత్యతోమాట్లాడుతున్నప్పుడు తట్టిన ఆలోచన అది. ఎక్కడ పుట్టింది, తను పదేళ్ల వయసులో ఏం చేసేది.. ఇలా చెబుతూపోయేది. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. సినిమాకు ముందు మాలో ఒకరికి మరొకరితో పరిచయం లేదు. ఎవరెవరో ఎక్కడెక్కడోపుట్టారు. కానీ పుట్టిన ఇన్నేళ్ల తరువాత అందరం కలిసి ఒక దగ్గర పనిచేస్తున్నాము.

చిన్నప్పుడు ఎలా వుండే వాళ్లం? ఇలా ఆలోచిస్తూ పేర్లు వచ్చేటప్పుడు చిన్ననాటి ఫోటోలు పెడితే ఎలా వుంటుందిఅనుకున్నాను. ఇదే విషయం కొందరితో చెప్పాను. బావుందన్నారు. తరువాత ఫోటోల కోసం వేట. దీనికోసంనలుగురైదుగురిని కేటాయించాము. పాపం వాళ్లు ఎన్ని వందల నెంబర్లకు ఫోన్ చేశారో వారికే తెలుసు. చాలామందిఫోటోలు దొరికాయి, ఒక్క మార్తాండ్ కె. వెంకటేష్ ఫోటో తప్ప. బుజ్జి మార్తాండ్ ఫోటో సేకరించడానికి వెతకని చోటంటూలేదు. చివరకు వారి ఊళ్లో నుంచి ఆ ఫోటో దొరికింది. ఆ కాన్సెప్ట్ను చాలామంది ఫ్రెష్గా ఫీలవుతున్నారు. మా టీమ్కుకూడా ఈ టైటిల్స్ థ్రిల్ కలిగించాయి.

జాన్ అబ్రహాం (ఆశిష్ విద్యార్థి)మొదట్లో లేడు...
సినిమా మొత్తం పూర్తయ్యింది. కానీ సినిమా ఓపెనింగ్ సీన్ ఏదీ అనుకోలేదు. అసలు జాన్ క్యారెక్టర్(ఆశిష్ విద్యార్థి) మాఆలోచనల్లో లేదు. ఎడిటింగ్ రూమ్లో సినిమా చూస్తే ఏదో లింక్ మిస్సయ్యిందనిపించింది. ఏం చేయాలి? ఏ క్యారెక్టర్తోహీరోను పరిచయం చేయాలి? అసలు సినిమాలో ఓపెనింగ్ సీన్ ఎలా వుండాలి? ఇవన్నీ నా బుర్రలో తిరిగాయి. అప్పటికేఏవేవో తీసినా అవి సంతృప్తిగా లేవు. అలాంటి సమయంలో నేను చూసిన జర్మన్ మూవీ 'ఇన్ జూలై' గుర్తొచ్చింది. అందులో హీరో లిఫ్ట్ కోసం ఒక వాహనాన్ని ఆపుతాడు. ఆ ట్రక్లో శవం వుంటుంది. లిఫ్ట్ ఇచ్చిన వాడి డ్రెస్, అతని ప్రవర్తనహీరోకు కొత్త అనుభవం.

ప్రేక్షకులకు అదొక సస్పెన్స్. ఆ ప్రయాణంలో వాడు హీరోకు తన స్టోరీ చెబుతుంటాడు. ఇంతకు ముందు చాలామందిదర్శకులు ఆ సినిమా చూశారు. దాన్ని కొంతమంది తీయాలనుకున్నారు కూడా. ఎందుకో రాలేదు. కానీ నేనుఓపెనింగ్లో అలాంటిదే ఒక సస్పెన్స్ను క్రియేట్చేస్తే బావుంటుందనుకున్నాను. అలా హీరో కిడ్నాప్తో సినిమామొదలయ్యింది. ఆ తరువాత జాన్కు హీరో తన కథ చెప్పుకుంటూ పోతుంటాడు. ఇంటర్వెల్ వస్తుంది. క్లైమాక్స్ కూడాదగ్గరవుతుంది. అయినా జాన్ క్యారెక్టర్ ఓపెన్ కాదు. ఇంకో వైపు కథలో సస్పెన్స్. ఇలాంటి సీన్ సినిమాకు మరింతసపోర్ట్ ఇస్తుంది అనిపించింది. షూటింగ్ జరిగిపోయింది. సినిమాను అలాగే ఓపెన్ చేశాము. ఇప్పుడు తెరపై జాన్ క్యారెక్టర్వస్తే చాలు ప్రేక్షకులు సస్పెన్స్తో పాటు వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.

తాగుబోతు గౌతమ్ కూడా మధ్యలోనే వచ్చాడు...
సినిమాలో క్లైమాక్స్ కామెడీగా వుండాలని చర్చల్లో నిర్ణయించుకున్నాము. చివరిలో హీరోయిన్ పెళ్లి సీన్. ఆమెను హీరోవెతుక్కుంటూ వస్తుంటాడు. అప్పటికే అతని స్నేహితులు పెళ్లి మండపానికి వచ్చేస్తారు. హీరో మాత్రం ఇంకా రాలేదు. అసలు వస్తాడో రాడో తెలియదు. వీళ్లందరికీ ఏం చేయాలో తోచదు. అలాంటి పరిస్థితిలో సీన్ ఇన్నర్థాట్ చెడిపోకుండాకామెడీ కావాలి. షూటింగ్ జరుగుతోంది. ఆ కామెడీ కోసం ఏం చేయాలో తెలియలేదు.

అలాంటపుడు డైలాగ్రైటర్ లక్ష్మీ భూపాల్వీరందరి మధ్యలో ఒక తాగుబోతును పెడదాం అన్నాడు. ఆలోచన బావుంది. కానీ ఆ క్యారెక్టర్తో కామెడీ ఎలా పండించాలన్నదే పెద్ద ప్రశ్న. ఆ పాత్ర అంతకుముందు సినిమాలో ఎక్కడాకనిపించకూడదు. ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటే 'ఐస్ఏజ్' సినిమాలో సీన్ జ్ఞాపకం వచ్చింది. అందులో స్కాట్క్యారెక్టర్ ఏదో ఒక నట్ కోసం తవ్వుకుంటుంది. నిజానికి ఆ పాత్రకు సినిమాకు ఎటువంటి సంబంధం వుండదు. కానీ దానిచేష్టలతో వీళ్లందరికీ ఇబ్బందులెదురవుతుంటాయి.

అలా తాగుబోతు పాత్రను డిజైన్ చేసుకున్నాము. అతనికి కూడా హీరో పేరే(గౌతమ్) పెట్టాము. సినిమాలో క్యారెక్టర్ కోసంమళ్లీ ఆడిషన్స్ మొదలు పెట్టాము. మహాత్మ, భీమిలి సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన రమేష్కు కబురుపెట్టాం. అతనుఒక సీన్ చేసి చూపిస్తానన్నాడు. నిర్మాత, నేను చూశాము. ఇప్పుడా పాత్ర చేసే సందడిని ఎవరూమరచిపోలేకపోతున్నారు.

ఆత్మబంధువు కోసం మేక్ ఎ విష్ కాన్సెప్ట్...
ప్రతీ ఒక్కరికీ జీవితంలో ఎవరో ఒకరు ఆత్మబంధువు ఉంటారు. అది అమ్మ కావచ్చు, నాన్న అవ్వచ్చు, భార్య కావచ్చు, ప్రేయసి కావచ్చు. వారిని మన హృదయం గుర్తిస్తుంది. ఈ సినిమాలో హీరో తల్లిలో ఎదుటివారిని అర్థం చేసుకునేలక్షణంతోపాటు సామాజిక బాధ్యత కూడా వుంటుంది. ఆమె చైల్డ్లేబర్ను వ్యతిరేకించడం అందులో భాగమే. హీరోకుఅప్పటి వరకు నిత్య ప్రవర్తన పెద్ద కన్ఫ్యూజన్. ఏదో భరిస్తుంటాడు.

నెలరోజుల్లో చనిపోయే ఒక బాలుని కోరిక తీర్చడానికి హీరోయిన్ చూపిన శ్రద్ధలో అతను తన అమ్మను చూసుకుంటాడు. కాబోయే భార్యలో తన అమ్మ లక్షణాలు వెతుక్కోవడం అబ్బాయిలకు అలవాటైతే, కాబోయే భర్తలో తన నాన్న లక్షణాలువుండాలని కోరుకోవడం అమ్మాయిలకు అలవాటు. ఎప్పుడైతే హీరో తన అమ్మలోని ఒక మంచిలక్షణం హీరోయిన్లోవుందని కనుక్కోగలుగుతాడో అప్పట్నించి హీరోయిన్పై అతనికి ఆసక్తి పెరుగుతుంది. మిగతా సినిమాల్లా ఇది రొటీన్గాతీసిన దృశ్యం కాదు. హీరోయిన్ తన ఆత్మబంధువు అని హీరో అర్థం చేసుకుంటాడు.

ఆమె కోసం అన్వేషిస్తూ బయలు దేరతాడు. ఈ లింక్ పెట్టడానికే మేక్ ఎ విష్ కాన్సెప్ట్ ఉపయోగించుకున్నాను. ఫౌండేషన్నిర్వాహకుల్ని కలిసి అలాంటి వారి వివరాలు తెలుసుకున్నప్పుడు వాళ్లు చెప్పిన ఓ సంఘటన నన్ను కదిలించింది. మీడియాలో జరిగిన ప్రచారం ద్వారా తాను నెలరోజులే బతుకుతానని తెలుసుకున్న ఒక బాలుడు ఎంత బాధపడ్డాడోవివరించారు. అందుకే మీడియాలో జరిగే ఈ తప్పు గురించే హీరోయిన్తో చెప్పించాము.

'గే'తో హీరో షూటింగ్ మొదలైంది....
ఆడా, మగా కాని(గే)క్యారెక్టర్ ఒకటి వుందని చెప్పినపుడు నాని ఆశ్చర్యపడ్డాడు. తనకు హీరోయిన్ దక్కడానికి ఆ పాత్రఎలా ఉపయోగపడుతుందో వివరించినపుడు నాని ఎంజాయ్ చేశాడు. హీరోతో తొలిషూట్ 'గే' పాత్రతోనే మొదలైంది. ఆ సీన్వచ్చినపుడు థియేటర్లో ఒకటే నవ్వులు. నాని కుక్కతో మాట్లాడే సీన్.. నిజానికి అది నా అలవాటు. మా ఇంట్లోకుక్కలతో నేను అలాగే మాట్లాడుతుంటాను. ఈ సీన్లో హీరో అంటాడు -'కళ్లు బాగున్నాయని, బొచ్చు బాగుందనిఎదురింటి స్నూపీని చూసి తోక ఆడించకు. ఏదో ఒక రోజు నీ బుజ్జి కుక్క కనబడితే నీ తోక దానంతటదే ఊగుతుంది' అని. ఈ జనరేషన్కు ఎలా చెబితే అర్థమౌతుందో అలాగే చెప్పిన డైలాగు ఇది.

6nav1.jpg యాంటీ క్లైమాక్స్ కానీ హ్యాపీ ఎండ్... - నిర్మాత దామోదర్ ప్రసాద్
నా సినిమా ద్వారా మహిళకు దర్శకురాలిగా అవకాశం ఇస్తున్నాననినేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా ప్యాడింగ్( ప్రముఖ హీరో, హీరోయిన్, దర్శకుడు, ఇతర ప్రముఖ నటులకాంబినేషన్)తో చేస్తున్నది కాదు. చిన్న సినిమా. అందరూ ఫ్రెష్. ఒకవేళ తేడా వస్తే సినిమా పరిశ్రమను నమ్ముకున్న వీళ్లంతా దాదాపుమూడు, నాలుగేళ్లు కోలుకోలేరు. అందుచేత అవకాశం ఇవ్వడంకాదు, తేడా జరిగితే వాళ్ల జీవితం నాశనం చేసినట్టు అవుతుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని సినిమా పూర్తి చేయాలనుకున్నాను. నందిని కథ చెప్పడానికి వచ్చినపుడు ఆమె ఎన్ని సంవత్సరాలుగాపరిశ్రమలో వున్నారో తెలుసుకున్నాను.

హీరో ఎంపిక సులభమే. నాని సంగతి ముందే తెలుసు. హీరోయిన్ సెలక్షన్కే చాలా సమయం పట్టింది.. వందల ఫోటోలుచూశాము. ఎవరూ నచ్చలేదు. ఒక రోజు కెమెరామ్యాన్ ఓంప్రకాష్ చెబితే నందిని రెయిన్ డాన్స్ చేసిన అమ్మాయి సి.డినిపంపించారు. సి.డిలో క్లారిటీ లేదు. దాంతో అమ్మాయికి కబురుపెట్టాము. అప్పటికే నిత్య మలయాళంలో ఒక సినిమా చేసివున్నారు. ఆమె వచ్చాక ఫొటో షూట్ చేశాము. నాని, నిత్య ఫొటోలు పక్క పక్కనే పెట్టినప్పుడు చాలా ఫ్రెష్ పెయిర్అనిపించింది.

అలా నిత్య ఎంపికయ్యింది. హీరోకు ఈ మధ్య ఐదుగురు స్నేహితులను పెడుతున్నారని నందినితో చెప్పాను. తను ఇద్దరుచాలంది. నేను మరొకరు పెడితే బావుంటుందన్నాను. ఆ మూడో ఫ్రెండ్ అమ్మాయి అయితే బావుంటుందనుకున్నాము. ఆ పాత్ర అబ్బాయిలను డామినేట్ చేసేలా వుండాలనుకున్నాము. దాని కోసం పాడుతాతీయగా పోటీలో ఒకసారి నేనుచూసిన స్నిగ్థ సరిపోవచ్చని నందినితో చెప్పాను. అలా పింకిగా స్నిగ్థ ఎంపికయ్యింది.

ఇవన్నీ సినిమా కష్టాలు...
అంతా బాగున్నట్టు కనిపించింది కానీ ఆదిలోనే ప్రాజెక్టుకు ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు డెభ్బైశాతం సినిమా ఫైనాన్స్సహకారంతో పూర్తి కావాల్సి వుంది. సినిమా మొదలై పది రోజులు గడిచాక ఫైనాన్స్ ఇస్తామన్నవారు ముఖం చాటేశారు. ఎవరి కారణాలు వారికుంటాయి. మనమేమీ చేయలేం. మొత్తానికి సినిమా ఆగిపోయింది. అనుకున్నంతా జరిగింది. ఎలాగైనా సరే సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను. కాని మూడు నెలల్లో పూర్తవ్వాల్సిన సినిమాకుతొమ్మిదినెలలు పట్టింది. సినిమాలను రిలీజ్ చేయకముందు డిస్ట్రిబ్యూటర్లకు చూపించడం ఆనవాయితీ. మధ్యలో ఆపద్ధతి పోయింది.

కానీ ఈ సినిమాతో మళ్లీ ఆ సంస్కృతికి శ్రీకారం చుట్టాము. అందర్నీ పిలిచి సినిమా చూపించాము. కానీ ఒక్కరూ సినిమాతీసుకోలేదు. విడుదల చేయడానికి థియేటర్లు దొరకలేదు. ఇంత కష్టపడి సినిమా తీశాక వదులుకోలేము కదా! ఇంకోకోటి రూపాయలు ఖర్చుపెట్టి ప్రింట్లు వేసి సినిమా విడుదల చేశాము. హైదరాబాద్ క్రాస్రోడ్లో థియేటర్ దొరకడం ఇంకాకష్టమయ్యింది. ఎదురుడబ్బులు అడిగారు. చివరకు ఉషామయూరిని ఎంచుకున్నాను. సినిమా విడుదలైన రోజుఉదయం కొన్ని థియేటర్లు తిరిగాము.

'ఎ' సెంటర్ సినిమా అవుతుంది అనుకున్నాము. ఆ రోజు రాత్రి భ్రమరాంబలో ప్రేక్షకుల ఆనందాన్ని చూశాక అన్ని సెంటర్లసినిమా అనే ధీమా కలిగింది. మా నమ్మకం నిజమయ్యింది. కొన్ని రోజులకే హిట్ టాక్ వచ్చింది. రెండో వారానికిథియేటర్లు పెరిగాయి. వద్దన్న వారే వచ్చారు. ఇదంతా అక్కసు వెళ్లగక్కుకోవడానికి చెప్పడం లేదు. చిన్న సినిమాపరిస్థితి ఇలా వుంటోంది. ఈ సినిమా హిట్ అయ్యాక చాలామంది చిన్న నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లుచిన్న సినిమా నిర్మాతలను కలిసి మీ సినిమాను మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నారట. ఇదంతా తెలిసి చాలాఆనందం కలిగింది. ఈ పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలి. సినిమాలో హంగూ ఆర్భాటం లేదు. అశ్లీలత లేదు. ప్యాడింగ్సినిమా కాదు. అయినా ఆదరణ పెరుగుతూనే వుంది.

- ఇంటర్వ్యూ: బల్లెడ నారాయణ మూర్తి

. ఫిబ్రవరి 06, 2011 నవ్య, ఆంధ్రజ్యోతి నుండి..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి