18, నవంబర్ 2011, శుక్రవారం

నట గాయనీమణులు

1940 నాటీ రోజుల్లో కొత్త నటీమణి తెలుగు తెరమీద తళుక్కుమని మెరిసింది. ఆమె నటనలో తేలికపాటి తనంతో పాటు కొంత రెక్‌లెస్‌కూడా ఉండేది.దాంతో ఆమెకు వ్యాం ప్‌వేషాలే ఎక్కువగా వచ్చేవి. ఏ వేషం వేసినా ఆమెలొ పోనిది రెక్‌లెస్‌. అరుుతే తొలిరోజుల్లో వేషాల్లో ఒదిగిపోయేవారు నటీనటులు. అంతగా వారి హావభావాలు కన్పించేవి కావు. ‘అంతస్థులు’ చిత్రంలో భానుమతిని తీసుకున్నప్పుడు ధీటుగా ఉన్న నటీమణి ఎవరా అని ఆ రోజుల్లో టార్చ్‌లైట్‌ వేసి వెదికి జి.వరలక్ష్మిని తీసుకు వచ్చారు. ఆమె జమీందార్‌ భార్యగా ధన గర్వంతో పేదలను హీనంగా చూసే వేషంలో మెప్పించారు.

జి.వరలక్ష్మి singer21940 నాటీ రోజుల్లో కొత్త నటీమణి తెలుగు తెరమీద తళుక్కుమని మెరిసింది. ఆమె నటనలో తేలికపాటి తనంతో పాటు కొంత రెక్‌లెస్‌కూడా ఉండేది.దాంతో ఆమెకు వ్యాంప్‌ వేషాలే ఎక్కువగా వచ్చేవి. ఏ వేషం వేసినా ఆమెలొ పోనిది రెక్‌లెస్‌. అయితే తొలిరోజుల్లో వేషాల్లో ఒదిగిపోయేవారు నటీనటులు. అంతగా వారి హావభావాలు కన్పించేవి కావు. ‘అంతస్థులు’ చిత్రంలో భానుమతిని తీసుకున్నప్పుడు ధీటుగా ఉన్న నటీమణి ఎవరా అని ఆ రోజుల్లో టార్చ్‌లైట్‌ వేసి వెదికి జి.వరలక్ష్మిని తీసుకు వచ్చారు. ఆమె జమీందార్‌ భార్యగా ధన గర్వంతో పేదలను హీనంగా చూసే వేషంలో మెప్పించారు. దొమ్మరిపిల్లగా భానుమతి ఇంట్లో తీసుకొచ్చిపెడతాడు జమీందార్‌ కుమారుడు అక్కినేని.భరించలేకపోతుంది వరక్ష్మి. ఈ చిత్రం ఆ ఏడాది ఉత్తమ చిత్రం అయ్యింది.

కెరీర్‌...
singer3చిత్రసీమలో జి.వరక్ష్మి డేషింగ్‌పై అనేక కథలున్నాయి.ఆమె వరలక్ష్మికి నటనపై ఆసక్తి 11ఏటనే కలిగింది. దాంతో చిన్నప్పుడే ఒంగోలు నుంచి పారిపోయి విజయవాడలో ఉన్న నాటక కంపెనీకి వెళ్లారు. తుంగల చలపతి, దాసరి కోటిరత్నం ఆధ్వర్యంలో నడచే నాటక కంపెనీలో సతీసక్కుబాయ్‌, రంగూన్‌రౌడి నాటకాలలో నటించారు. 1940 నాటికి మద్రాసు చేరుకున్నారు. ఆమె మంచి గాయని కూడా.నౌషాద్‌ వద్ద ఒక పాట కోసం బొంబాయి వెళ్లాక కోరస్‌లో పాడాక గాయనిగా కంటే నటిగా రాణించాలని నిర్ణయించుకొని హేమ్‌రెడ్డి చిత్రాలలో నటించారు. చిత్రసీమలో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి 2003లో స్వర్గస్తులయ్యారు.
 ప్రొఫైల్‌... 
    పూర్తి పేరు : గరికపాటి వరలక్ష్మి
    పుట్టిన తేది  : సెప్టెంబర్‌ 13, 1926
    జన్మస్థలం : ఒంగోలు
    భర్త         : కె.యస్‌.ప్రకాశరావు
    వృత్తి         : నటి, గాయని,రచయిత, డైరక్టర్‌
    తొలిచిత్రం : బారిస్టర్‌ పార్వతీశం 1940

 చిత్రాలలో కొన్ని... 
 బారిస్టర్‌ పార్వతీశం 1940
 ద్రోహి 1948
 కీలు గుర్రం (1949)
 స్వప్నసుందరి (1950)
 నిర్దోషి (1951)
 పెళ్ళిచేసి చూడు (1952)
 కన్నతల్లి (1953)
 సుమంగళి (1965)
 అంతస్థులు (1965)
 సంసారం సాగరం (1973)

భానుమతి
తెలుగు వారికి భానుమతిగురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన నటన,గాత్రం, రచన, దర్శత్వం ఇలా చిత్రసీమలో వివిధ విభాగాలలో ఓ మెరుపు మెరిసిన అలనాటి తార ‘భానుమతి’. భానుమతి సెప్టెంబర్‌ 7, 1925న ఒంగోలులో జన్మించారు. తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య కు శా్రీస్తీయ సంగీతంలో ప్రవేశం ఉంది. భానుమతి తన తండ్రి వద్ద సంగీతంలో ప్రావీణ్యాన్ని సంపాదించింది.

సినీ ప్రస్థానం....
Bhanumathi1939లో ‘వరవిక్రయం’ అనే చిత్రంతో భానుమతి కెరీర్‌ ప్రారంభమైంది.1943లో తమిళ,తెలుగు దర్శకుడైన పి.ఎస్‌.రామకృష్ణ రావును వివాహ మాడారు.వీరి ఏకైక సంతానం ‘భరణి’.భరిణి పేరు మీదనే భరణి స్టూడియోస్‌ను ప్రారంభించారు. ఆమె ‘స్వర్గసీమ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత చక్రపాణి, లైలా మజ్నూ, విప్రనారాయణ, మల్లీశ్వరి, బాటసారి చిత్రాలను నేటికీ అభిమానులను అలరిస్తున్నాయి.దాదాపు ఆరు దశాబ్దాలు చిత్రసీమలో భానుమతి నటించిన చిత్రాలు 200కు పైమాటే.

గాయనిగా...
భానుమతి మంచి నటియే కాకుండా మంచి గాయని కూడా. తను నటించే చిత్రాలలో తన పాత్రకు తానే గాత్రాన్ని అందించేవారు. కర్టాటక సంగీతం, హిందుస్థానీ సంగీతంలో ఆమెకు ప్రవేశం ఉంది.నటులకు గాయకులు గాత్రం అందించడం మనందరికీ తెలిసిన విషయమే. కాని భానుమతి తన పాత్రలకు తానే గాత్రం అందించే వారు. అందులో ఎలాంటి కాంప్రమైజ్‌ కాకుండా చూసుకునే వారు. పలు చిత్రాలకు సంగీతదర్శకత్వం కూడా వహించారు.చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భానుమతి 2005లో స్వర్గస్తులయ్యారు.
 భానుమతి పాడిన పాటలలో కొన్ని... 
 పాట                                చిత్రం 
పిలిచిన బిగువతార          స్వర్గ సీమ (1945)
మనసున                   మల్లీశ్వరి (1951)
ప్రేమ నేరమౌనా           లైలా మజ్నూ (1949)
దివ్య ప్రేమకు              ప్రేమ (1952)
రారా నా                   విప్ర నారాయణ (1954)
కన్నులు నిండే             తెనాలి రామకృష్ణ (1956)
ఓ బాటసారి               బాటసారి ( 1961)
శరణం నీ దివ్య రూపం          మట్టిలో మాణిక్యం (1971)

 అవార్డులు... 
 పద్మశ్రీ (1966)
 పద్మభూషణ్‌ (2003)
 రాష్టప్రతి అవార్డు 
 కళాప్రపూర్ణ (1975)
 కళైమణి
 రఘుపతి వెంకయ్య అవార్డు (1986)
 వంటి అవార్డులు ఎన్నో..

 ప్రొఫైల్‌... 
    పూర్తి పేరు : పాలువాయి భానుమతి రామకృష్ణ
    పుట్టిన తేది  : సెప్టెంబర్‌ 7,1925
    జన్మస్థలం : దొడ్డవరం, ఆంధ్రప్రదేశ్‌
    భర్త         : పి.ఎస్‌.రామకృష్ణ రావు
    సంతానం : భరణి
    వృత్తి         : నటి, గాయని, రచయిత, నిర్మాత
    తొలిచిత్రం : వర విక్రయం (1939)
    నటించిన చిత్రాలు :200కు పైగా 
    అవార్డులు : పద్మశ్రీ (1966),
           పద్మభూషణ్‌ (2003) 
           వంటి అవార్డులు ఎన్నో..

కన్నాంబ
kannamba1940లో భవాని ఫిలింమ్స్‌ వారు ‘చండిక’ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ‘నేనే రాణినైతే.. యేలనే ఈ ధర ఏకధాటిగా’ అంటూ కన్నాంబ పాడితే..ఆమె అభినయానికి ప్రక్షకులు ఆమెశపూరితులయ్యారు. కేవలం ఈ పాటకోసం ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూసిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ చిత్రంలో గుర్రం స్వారీ అవసరం అంటే పట్టుదల వహించి కన్నాంబ నేర్చుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో చిరుత పులులకు ఆహారం తినిపించి, వాటిని మచ్చిక చేసుకుని నటించిన సాహసికురాలు. ఒక నటి క్రూర జంతువులతో నటించడం అదే తొలిసారి. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బళ్ళారి రాఘవాచారి కన్నాంబ నటనను అభినందిస్తు ‘హావభావాల అధినేత’ గా అభివర్ణించారు.
కన్నాంబ  పాడిన చిత్రాలలో కొన్ని... 
పాట  చిత్రం  సంవత్సరం 
జననం   హరిశ్చంద్ర  1935
ఆ వసంత  శోభ కనకతార   1937
బాధ సహనమే గృహలక్ష్మి   1938
ఆనందమాయే నహో చండిక    1940
జోజో నందబాల తొలిప్రేమ   1941
ఓ మాలతి  మాయ మశ్చింద్ర  1945
స్త్రీ భాగ్యవే  ముగ్గురు మిత్రులు 1946
తెరతీయగ రాదా పల్నాటి యుద్ధం 1947

కెరీర్‌...
Kannambaaaకన్నాంబ 1912 సెప్టెంబర్‌ 20న ఏలూరులో జన్మించారు. ఆమె తండ్రి నరసప్పనాయుడు ప్రభుత్వోద్యోగి. చిన్నప్పుడే కళల పట్ల ఆసక్తిని పెంచున్నారు.ఆయితే శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించిన కన్నాంబకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. నృత్యళాకారులను నీచమైన దృష్టితో చూసే ప్రేక్షకుల వైఖరిని నిరసిస్తూ ఇక జీవితంలో కాలికి గజ్జలు కట్టనని అమె శపథం చేశారు. సినీ రంగంలో ప్రవేశించిన తరువాత కూడా దానికే కట్టుబడి ఉన్నారు. కన్నాంబ నాటక రంగ ప్రవేశం ఏలూరులో జరిగింది. తన 13 ఏట ఏలూరులోని ‘నావెల్‌ నాటక సంఘం’ చేరి అనేక నాటకాలలో నటించారు. 1936లో తెరకెక్కిన ‘ద్రౌపది వస్త్రాపహరణం’ చిత్రంతో ప్రారంభమైన కన్నాంబ నటజీవితం అనార్కలి, వదిన, లవకుశ, రాజ ముకుటం వంటి అనేక హిట్‌ చిత్రాలతో సాగింది. అంతే కాకుండా కన్నాంబ మంచి గాయనిగా కూడా తన సత్తా చాటుకున్నారు.మంచి నటిగా, గాయనిగా ప్రేక్షకుల మదిలో చోటుసంపాదించిన కన్నాంబ 1964లో కన్నుమూశారు.
 ప్రొఫైల్‌... 
    పూర్తి పేరు : పసుపులేటి కన్నాంబ
    పుట్టిన తేది  : సెప్టెంబర్‌ 20, 1912
    జన్మస్థలం : ఏలూరు
    భర్త         : కదరు నాగభూషణం
    వృత్తి         : నటి, గాయని,రచయిత, డైరక్టర్‌
   తొలిచిత్రం : ద్రౌపది వస్త్రాపహరణం (1936)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి