18, నవంబర్ 2011, శుక్రవారం

నాటి బాలనటులు నేటి సూపర్‌ స్టార్లు

టాలీవుడ్గలోని నేటి హీరోలు కొందరు ఒకప్పుడు బాల నటులుగా చేసినవారు కావడం విశేషం. నేడు తెలుగు చిత్రసీమలో హీరోలుగా వెలుగొందుతున్న జూనియర్‌ ఎన్టీర్‌, మహేష్‌బాబు, వెంకటేష్‌, నాగార్జునలు నాడు బాల నటులుగా మెరిసిన వారే. చిన్నప్పుడే సినీ రంగంలోకి ప్రవేశించి వారు తమ టాలెంట్‌ను ప్రదర్శించారు. పెద్దరుున తర్వాత హీరోలుగా సినిమాలు చేస్తూ టాలీవుడ్గ ప్రేక్షకులను మురిపిస్తున్నారు. ఇక దక్షిణాదిన వివిధ భాషల చిత్రాతో పాటు బాలీవుడ్గలో సైతం నటించి అందాల తారగా పేరుతెచ్చుకున్న శ్రీదేవి కూడా బాలనటిగా చేసినవారు కావడం విశేషం. ప్రస్తుతం అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం జరుగుతున్న సందర్భంగా ఒకప్పుడు బాల నటులుగా చేసిన వారి గురించి తెలుసుకుందామా...

శ్రీదేవి బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి తమిళంలో కందన్‌ కరునరుు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో కుమారస్వామి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

శ్రీదేవి
srideviiiiఅందాల తార శ్రీదేవి దక్షిణాదిన వివిధ భాషల చిత్రాలతో పాటు బాలీ వుడ్‌లో సైతం హీరోయిన్‌గా చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు, తమిళం, మల యాళం, హిందీ సినిమాల్లో నటించి తన అందచందాలు, గ్లామర్‌తో మైమరపించారు. 1963 ఆగస్టు 13న శ్రీదేవి జన్మించారు. ఇక ఆమె బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి తమిళంలో కందన్‌ కరునయి అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో కుమారస్వామి పాత్రలో శ్రీదేవి నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 1976లో వచ్చిన కె.బాలచందర్‌ సినిమా మూంద్రు ముడిచులో హీరోలు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లతో కలిసి హీరోయిన్‌గా చేసి ప్రేక్షకులను అలరించారు. అప్పటినుంచి అందాల తారగా దక్షిణ భారతదేశంలోని వివిధ భాషల చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేసి సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆమె ఏర్పరచుకున్నారు.

మహేష్‌బాబు...
maheshటాలీవుడ్‌లోని టాప్‌ హీరోలలో ఒకరు మహేష్‌ బాబు. దూకుడు వంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి మహేష్‌బాబు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తెలుగు సినీ రంగంలో సూపర్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్న కృష్ణ తనయుడు మహేష్‌బాబు. 1975 సంవత్సరం ఆగస్టు 9న జన్మించిన మహేష్‌బాబు నాలుగు సంవత్సరాల వయసులో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేయడం విశేషం. తొలిసారిగా బాల నటునిగా నీడ సినిమాలో ఆయన నటించారు. ఆ తర్వాత పోరాటం, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, గూఢాచారి 117 సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక కథానాయకుడిగా మహేష్‌బాబు చేసిన తొలి చిత్రం రాజకుమారుడు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ బాల నటుడిగా సినీ రంగ ప్రవే శం చేశారు. 1996లో విడుదలైన రామాయణం సినిమా ద్వారా ఆయన చిత్రసీమలోకి అడుగిడారు. ఈ సినిమా సెక్సస్‌ సాధించి జూనియర్‌ ఎన్టీఆర్‌ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అరుుదు సంవత్సరాలకు నిన్ను చూడాలని (2001) సినిమాలో హీరోగా చేసి కథానాయకుడిగా తన సినీ ెకరీర్‌ను ప్రారంభించారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌
ntrటాలీవుడ్‌లోని యువ కథానాయకులలో ఒకరైన జూనియర్‌ ఎన్టీఆర్‌ పలు హిట్‌ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మైమరపించారు. నాటి ప్రముఖ థానాయకుడు, మాజీ సిఎం నందమూరి తారకరామారావు మనువడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ 1983 సంవత్సరం మే 20న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నందమూరి హరికృష్ణ, శాలిని. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1996లో విడుదలైన రామాయణం సినిమా ద్వారా ఆయన చిత్రసీమలోకి అడుగిడారు. ఈ సినిమా సక్సెస్‌ సాధించి జూనియర్‌ ఎన్టీఆర్‌ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అయిదు సంవత్సరాలకు నిన్ను చూడాలని (2001) సినిమాలో హీరోగా చేసి థానాయకుడిగా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు.

వెంకటేష్‌....
Venkateటాలీవుడ్‌ టాప్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు తనయుడు. 1960 సంవత్సరం డిసెంబర్‌ 13న చెనై్నలో ఆయన జన్మిం చారు. ఇక వెంకటేష్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తన సినీ కెరీర్‌ను ఆరంభించారు. తొలిసారిగా బాల నటునిగా ఆయన చేసిన చిత్రం ప్రేమ్‌నగర్‌. డి.రామానాయుడు స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో తన కుమారుడు వెంకటేష్‌ను బాల నటునిగా నటింపచేశారు. ఆ తర్వాత విద్యాభ్యాసా న్ని పూర్తి చేసుకొని 1986లో కథానాయకుడిగా వెంకటేష్‌ చేసిన తొలి చిత్రం కలియుగ పాండవులు.

నాగార్జున....
nagarjunటాలీవుడ్‌లోని అగ్ర హీరోలలో ఒకరు అక్కినేని నాగార్జున నాటి ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగేశ్వర్‌రావు నట వారసత్వాన్ని పుణికిపు చ్చుకొని నాగార్జున తెలుగు సినీ రంగంలో టాప్‌ హీరోగా పేరుతెచ్చుకున్నారు. 1959 సంవత్సరం ఆగ స్టు 29న చెనై్పలో నాగార్జున జన్మించారు. నాగార్జున సైతం బాలనటునిగా చేసి పేరుతెచ్చుకున్నవారే. ఆయ న చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసిన తొలి చిత్రం సుడిగుండాలు. 1967లో ఈ చిత్రం విడుదలైంది. ఇక హీరోగా నాగార్జున చేసిన తొలి చిత్రం విక్రం(1986).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి