18, నవంబర్ 2011, శుక్రవారం

జాకీచాన్‌

జాకీచాన్‌@ 100
Jackie-Chaజాకీచాన్‌ అభిమానులకు శుభవార్త. జాకీ చాన్‌ 100వ సినిమా 1911 భారత్‌ లోనూ విడుదలకు సిద్ధంగా ఉంది. చైనాలో ఈ సినిమా సెప్టెంబర్‌ 23న విడుదలైంది. మనదేశంలో నవంబర్‌ 18న వెండి తెరపై ఇది దర్శనమివ్వనుంది. రాజు పై తిరుగుబాటు ఈ చిత్ర ప్రధాన కథాంశం. స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆయన ఓ ప్రధాన పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేయ నున్నారు. ది 1911 రివ ల్యూషన్‌ అని కూడా ఈ చిత్రాన్ని వ్యవహరిస్తున్నా రు. 2010 సెప్టెంబర్‌ 29న చిత్ర నిర్మాణం ఆరంభమైంది. 2011 మార్చి 20న ముగిసింది. ఎన్నో కష్టనష్టాలతో సినీ ప్రస్థానం ఆరంభించిన జాకీచాన్‌ ఆ తరువాత అంతర్జాతీయ స్థారుుకి ఎదిగాడు.

ఆక్రోబాటిక్‌ ఫైటింగ్‌ స్టయిల్‌, సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కు, వినూత్న స్టంట్స్‌కు మారుపేరు జాకీచాన్‌. ఆయన పేరు చెబితే చాలు మార్షల్‌ ఆర్ట్‌‌స అభిమానులు పులకరించిపోతారు. 1960 నుంచి నటనారంగంలో ఉన్న జాకీచాన్‌ ఇటీవలే తన 100వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. గాయకుడు కూడా అయిన జాకీచాన్‌ ఎన్నో ఆల్బమ్స్‌ కూడా విడుదల చేశారు. తాను నటించిన చిత్రాల్లోనూ ఎన్నో థీమ్‌ సాంగ్స్‌ పాడారు.

బాల్యం...
Jackie-Chanచిన్నప్పుడే శక్తివంతుడైన బాలుడిగా పేరొందాడు. జాకీ చాన్‌ శక్తిసామర్థ్యాలకు ముగ్ధులైన వారంతా ఆ బాలుడిని ముద్దుగా ‘పావోపావో’ (ఫిరంగి గుండు) పిలిచేవారు. ఆయన తల్లిదండ్రులు హాంకాంగ్‌లోని ఫ్రెంచ్‌ దౌత్యకార్యాలయంలో పని చేసేవారు. ఒకటో తరగతిలో చదువులో అంతగా రాణించకపోవడంతో తల్లిదండ్రులు బడి మాన్పించేశారు. 1960లో తండ్రి ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు వలస వెళ్ళాడు. అక్కడ ఆయన అమెరికన్‌ ఎంబసీలో హెడ్‌కుక్‌గా చేరారు. అక్కడ జాకీచాన్‌ను చైనా డ్రామా అకాడమీలో చేర్చారు. అక్కడే ఆయన ఓ పదేళ్ళపాటు మార్షల్‌ ఆర్ట్‌‌సలో, ఆక్రోబాటిక్స్‌లో కఠోర శిక్షణ పొందాడు. ఆ సమయంలోనే ఆయన సామో హంగ్‌, యెన్‌ బియావోలతో స్నేహం ఏర్పడింది. వీరి ముగ్గురినీ త్రీ బ్రదర్స్‌ అని, త్రీ డ్రాగన్స్‌ అనీ పిలిచేవారు.

ఎనిమిదేళ్ళ వయస్సులోనే జాకీచాన్‌ బిగ్‌ అండ్‌ లిటిల్‌ వాంగ్‌ టిన్‌ బార్‌ (1962)లో నటిం చాడు. అలా ఆయన సినిమా కెరీర్‌ ప్రారంభమైంది. 17 ఏళ్ళ వయస్సులో బ్రూస్‌లీ సినిమాల్లో స్టంట్‌మాన్‌ గా నటించాడు. ఆ తరువాత లిటిల్‌ టైగర్‌ కాంటన్‌లో ప్రముఖ పాత్ర లభించింది. 1973లో అది హాంకాంగ్‌ ప్రాంతంలో మాత్రమే విడుదలైంది. మొదట్లో నటించిన సినిమాలు ఫెయిల్‌ కావడం, స్టంట్‌ పనులు దొరకడం కష్టం కావడంతో 1975లో జాకీచాన్‌ పెద్దలకు మాత్రమే అనదగ్గ ఆల్‌ ఇన్‌ ది ఫ్యామిలీ సినిమాలో నటిం చాడు. జాకీ చాన్‌ నటించిన వాటిల్లో ఒక్క ఫైట్‌ లేదా స్టంట్‌ సీన్‌ లేని చిత్రం అదొక్కటే కావడం విశేషం.
1976లో జాకీచాన్‌ కాన్‌బెర్రాలో తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. అక్కడ భవన నిర్మాణ కూలీగా కూడా పని చేశాడు. అక్కడ తోటి వారు ఆయనను లిటిల్‌ జాక్‌గా పిలిచేవారు. అదే క్రమంగా జాకీగా మారి ఆయన పేరు జాకీ చాన్‌గా మారిపోయింది. 1990 ప్రాంతంలో జాకీ చాన్‌ తన తండ్రి ఇంటిపేరు మీదుగా తన చైనీస్‌ పేరును ఫాంగ్‌ సి లుంగ్‌ గా మార్చుకున్నాడు.

పేరు తెచ్చిన స్నేక్‌ ఇన్‌ ది ఈగిల్స్‌ షాడో...
1978లో జాకీచాన్‌ నటించి స్నేక్‌ ఇన్‌ ది ఈగిల్స్‌ షాడో సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో కామెడీ అందరికీ నచ్చింది. ఆ తరువాత వచ్చిన డ్రంకెన్‌ మాస్టర్‌తో సినిమాల్లో తన స్థానాన్ని జాకీచాన్‌ మరింత సుస్థిరం చేసుకోగలిగాడు. హాఫ్‌ ఎ లోఫ్‌ ఆఫ్‌ కుంగ్‌ ఫు, స్పిరిట్యువల్‌ కుంగ్‌ ఫు మంచి పేరు తెచ్చాయి. దర్శకుడు లో వీ ఇచ్చిన స్వేచ్ఛను ఆయన సద్వినియోగం చేసుకోగలిగాడు. దీంతో ఫియర్‌లెస్‌ హైనా సినిమా సహదర్శకత్వం వహించే అవకాశం కూడా లభించింది. ఆ దర్శకుడితో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించిన జాకీచాన్‌ గోల్డెన్‌ హార్వెస్ట్‌లో చేరాడు. దాంతో ఇద్దరి మధ్యా వివాదం తలెత్తింది. సహనటుడు, దర్శకుడు జిమ్మీ వాంగ్‌ యు జోక్యంతో వివాదం సద్దుమణిగింది. జాకీ చాన్‌ గోల్డెన్‌ హార్వెస్ట్‌ కంపెనీతో అనుబంధాన్ని కొనసాగించాడు.

హాంకాంగ్‌ సినిమా రంగంలో...
j87eయంగ్‌ మాస్టర్‌ (1980), డ్రాగన్‌ లార్డ్‌ (1982) సినిమాలు జాకీచాన్‌కు మంచిపేరు తెచ్చాయి. యంగ్‌మాస్టర్‌ అప్పట్లో బ్రూస్‌లీ నెలకొల్పిన బాక్స్‌ఆఫీస్‌ రికార్డులు బద్దలుగొట్టింది. హాంకాంగ్‌ సినిమా రంగంలో జాకీ చాన్‌ను టాప్‌ స్టార్‌గా నిలబెట్టింది. డ్రాగన్‌లార్డ్‌ సినిమాతో ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు జాకీచాన్‌. అందులో పిరమిడ్‌ ఫైట్‌ సీన్‌ సింగిల్‌ షాట్‌కు 2900 టేక్‌లు తీసుకోవాల్సి వచ్చింది. తన చిన్ననాటి స్నేహితులు సమో హంగ్‌, యెన్‌ బియావోలతో కలసి జాకీ చాన్‌ ఎన్నో యాక్షన్‌ కామెడీ సినిమాలు చేశాడు. ఈ ముగ్గురూ కలసి తొలిసారిగా 1983లో ప్రాజెక్ట్‌ ఎ అనే సినిమాలో నటించారు. ప్రమాదభరిత స్టంట్స్‌ ఎన్నో ఇందులో ఉన్నాయి.

ఈ సినిమాకు పలు అవార్డులు కూడా లభించాయి. ఆ తరువాత వీరు ముగ్గురూ కలసి వీల్స్‌ ఆన్‌ మీల్స్‌, ది ఒరిజినల్‌ లక్కీ స్టార్స్‌ సినిమాల్లో నటించారు. 1988లో వీరంతా కలసి డ్రాగన్స్‌ ఫరెవర్‌ సినిమాలో నటించారు. అదే వారంతా కలసి నటించిన చివరి సినిమా. 1985లో జాకీచాన్‌ పోలీస్‌ స్టోరీ సినిమా తీశారు. ఈ యాక్షన్‌ కామెడీ సినిమాలో ఆయన పలు ప్రమాదకర స్టంట్స్‌ చేయడం విశేషం. దానికి సీక్వెల్స్‌ కూడా వచ్చాయి. ఆర్మూర్‌ ఆఫ్‌ గాడ్‌ సినిమా హాంకాంగ్‌లో బాగా హిట్‌ అయ్యింది. 1990లలో జాకీ చాన్‌ మరో విడత హాలీవుడ్‌ ప్రవేశం కోసం చూసినా, వచ్చిన విలన్‌ పాత్రల అవకాశాలను తోసిపుచ్చారు. సిల్విస్టర్‌ స్టాలోన్‌ తన డిమాలిషన్‌ మ్యాన్‌ సినిమాలో ఈ విలన్‌ అవకాశాన్ని ఆఫర్‌ చేశారు.

హాలీవుడ్‌ సినిమాల్లో...
1911_filmposterక్రమంగా జాకీచాన్‌ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. జాకీ స్నేహితుడు చాన్‌ ఆయనకు పర్సనల్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తూ అంతర్జాతీయ అవకాశాలు లభించేలా చేశారు. సుమారు 30 ఏళ్ళ పాటు ఆయన జాకీ చాన్‌కు పర్సనల్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. జాకీచాన్‌ తొలిసారిగా 1980లో హాలీవుడ్‌ సినిమా బాటిల్‌ క్రీక్‌ బ్రాల్‌లో నటించాడు. 1981లో కెనాన్‌బాల్‌ రన్‌లో కూడా చిన్న పాత్ర పోషించాడు. ఆ రెండూ ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆ తరువాత 1985లో వచ్చిన ది ప్రొటెక్టర్‌ అంతగా విజయం సాధించకపోవడంతో జాకీచాన్‌ తిరిగి హాంకాంగ్‌ సినిమా రంగంపై దృష్టి సారించాడు.

సినిమా కెరీర్‌...
జాకీచాన్‌ 1972లో బ్రూస్‌ లీ ఫిల్మ్‌‌స ‘ఫస్ట్‌ ఆఫ్‌ ఫురే’లో స్టంట్‌మాన్‌గా నటించాడు. ఆ తరువాత 1973లో ఎంటర్‌ ది డ్రాగన్‌లో నటించాడు. జాకీ స్టంట్స్‌కు ముగ్దుడైన విలె చాన్‌ అనే సినీ నిర్మాత 1976లో తన సినిమాలో ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకు లో వి దర్శకత్వం వహించారు. చాన్‌ నటన మెచ్చిన ఆ దర్శకుడు న్యూ ఫిస్ట్‌ ఆఫ్‌ ఫురే (1976)లో అవకాశం ఇచ్చారు. తెరపై ఆయన పేరు సింగ్‌ లంగ్‌గా మారిపోయింది. బికమ్‌ ద డ్రాగన్‌ అని ఆ పేరుకు అర్థం. జాకీ చాన్‌ ఆకృతిలో, పేరులోనూ బ్రూస్‌ లీ ( లీ సిలంగ్‌- లిటిల్‌ డ్రాగన్‌ ) పోలికలు ఉండడం విశేషం. బ్రూస్‌ లీ మార్షల్‌ ఆర్ట్‌ స్టయిల్‌ను అనుకరించలేకపోవడంతో ఆ సినిమా అంతగా విజయవంతం కాలేకపోయింది. ఆ సినిమా ఫెయిల్‌ అయినప్పటికీ, లీ వీ అదే తరహా థీమ్‌లతో జాకీచాన్‌తో సినిమాలు తీయడం ఆరంభించారు. క్రమంగా ఆ సినిమాలు బాక్సాఫీస్‌ హిట్‌ అయ్యాయి.

మరోసారి హాలీవుడ్‌లో...
j31995లో జాకీచాన్‌ మరోసారి హాలీవుడ్‌ చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని విజయం సాధించాడు. రంబెల్‌ ఇన్‌ ది బ్రోంక్స్‌ సినిమా ఘనవిజయం పొం దింది. హాంకాంగ్‌ తారలెవరకూ అప్పటి వరకూ అలాంటి ఘనవిజయాన్ని హాలీవుడ్‌లో పొందలేక పోయారు. ఆ తరువాత ఆ స్ఫూర్తితో పోలీస్‌ స్టోరీ-3, సూపర్‌ కాప్‌ రూపుదిద్దుకున్నాయి. ఆ తరువాత వచ్చిన రష్‌ అవర్‌ యాక్షన్‌ కామెడీ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. 1998లో ఆయన గోల్డెన్‌ హార్వెస్ట్‌ సంస్థకు చివరిసారిగా హు యామ్‌ ఐ సినిమాలో నటించాడు.

ఆ తరువాత కూడా పలు హాలీవుడ్‌ చిత్రాల్లో ఆయన నటించాడు. అవేవీ ఆయనకు అంత సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. తన పాత్ర చిన్నది కావడం, తన ప్రమేయం అంతగా లేకపోవడం ఆయనను బాధించాయి. 2003లో ఆయనే సొంతంగా సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పారు. దాని నుంచి తీసిన న్యూ పోలీస్‌ స్టోరీ (2204), ది మిత్‌ (2005), రాబ్‌ బి హుడ్‌ (2006) ఘన విజయం సాధించాయి. ఆయన చిత్రాల విజయ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆ చిత్రాలు అభిమానులను అపారంగా ఆకట్టుకుంటూనే ఉన్నాయి.
 ప్రొఫైల్‌
అసలు పేరు         : చాన్‌ కాంగ్‌ సాంగ్‌
వయస్సు  :  57
పుట్టుక  : హాంకాంగ్‌ (వికో్టరియా పీక్‌)
పుట్టిన తేది  : 7 ఏప్రిల్‌ 1954
తల్లిదండ్రులు         : చార్లెస్‌, లీ-లీ చాన్‌
వృత్తి  : నటుడు, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌రైటర్‌, 
    యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌, గాయకుడు, 
    స్టంట్‌ డైరెక్టర్‌ 
భార్య  : లిన్‌ ఫెంగ్‌ జియో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి