చిత్ర సీమలో ఒక సెంటిమెంట్ ఉంది. పెద్ద పెద్ద కథానాయకులతో చిత్రాలు చేస్తే కలెక్షన్‌ల మోత మోగించవచ్చని.అయితే ఇప్పుడిప్పుడే మరో వాస్తవం తెరపైకి వచ్చింది. హీరోయిన్స్ సెంటిమెంట్ కూడా రికార్డు కలెక్షన్ సాధించవచ్చని. ఇదే విషయాన్ని బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ‘కరీనాకపూర్’ నిరూపించింది.2000వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన కరీనాకు మంచి కథానాయికగా గుర్తింపు సాధించడానికి చాలా అంతగా వేచి చూడాల్సిన అవసరం రాలేదు.అంచెలంచెలుగా ర్యాంక్‌లను కొల్లగొట్టి ప్రస్తుతం కరీనా బాలీవుడ్ టాప్ కథానాయికగా ఎదిగింది. ఇటీవలే ఆసియాలోనే శృంగార నాయికగా ఎంపికయ్యింది. బాలీవుడ్ టాప్‌ర్యాంకులో దూసుకెళ్తున్న కరీనాకపూర్ గురించి అనేక ఆసక్తి కరమైన విషయాలున్నాయి.
బాల్యం, విద్యాభ్యాసం...
రెఫ్యూజీ.. (2000)...
బాలీవుడ్‌లో కపూర్ కుటుంబానికి చిత్రసీమలో మంచి గుర్తింపు ఉంది. దీంతో చిన్ననాటినుంచే కరీనాకు చిత్రసీమ అంటే సహజమైన ఆసక్తి ఉండేది. మీడియా కళ్ళుకూడా ఆమెపైనే ఉండేవి.అయితే కరీనా మాత్రం 2000వ సంవత్సరం వరకు చిత్రసీమలో ప్రవేశించలేదు. 2000 సంవత్సరంలో వచ్చిన ‘హోనా ప్యార్‌ేహ’ చిత్రం అవకాశం వచ్చినా దాన్ని వదులు కుంది కరీనా. ఈ చిత్రంలో కథనాయకుడికి ఉన్న ప్రాధాన్యత హీరోయిన్‌కు లేదని భావించి ఈ చిత్రానికి ‘నో’ అని చెప్పింది. ఆమె తొలి చిత్రం ‘రెఫ్యూజీ’ (2000). ఈ చిత్రంతోనే బాలీవుడ్ షహంషా అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
ఈ చిత్రం 2000వ సంలోనే రికార్డు స్థాయిలో లెక్షన్ సాధించింది. కరీనా కపూర్‌కు ఫిలింఫేర్ బెస్ట్ ఫీమెల్ డెబ్యూ అవార్డు తెచ్చిపెట్టింది. తరువాత 2002లో తుషార్ కపూర్‌తో ‘ముజె కుచ్ కహనాహే చిత్రంలో నటించింది. ఇలా అవార్డు విన్నింగ్ చిత్రాలు చేసిన బెబో కెరీర్‌లో ‘జబ్ వి మెట’్ చిత్రాన్ని టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో కరీనా టాప్ స్థానానికి చేరుకొని నేటికీ కొనసాగుతుంది.ఈ చిత్రం బ్రహ్మాండంగా ఆడింది. అన్ని విధాలా సూపర్ సక్సెస్ సాధించి. మంచి నటిగా ఆమె స్థానం మాత్రం పదిలం చేసింది. బెబో తన పై వచ్చిన పుకార్లను అంతగా పట్టించుకోదు.పెద్దగా విచారించదు.
బాలీవుడ్‌లో ఎనిమిదేళ్ల అనుభవంతో ఆ(జబ్ వి మెట్) చిత్రంలో ఇంకా బాగా చేసుండాల్సిందని ప్రియాంకా చోప్రా కామెంట్ చేసిందని వార్తలు విన్నప్పుడు. కరీనా మట్లాడుతూ ‘ వాటిని, ఏమాత్రం నమ్మను. ఆమె అలా అనే మనిషి కాదు. పత్రికలు ఆమె అభిప్రాయాన్ని వేరే విధంగా చెప్పి ఉండవచ్చుగా?! నా తొలి చిత్రం రెఫ్యూజీ నుంచి తషన్ వరకూ ఏ మాత్రం తక్కువస్థాయిలో నటించలేదన్న నమ్మకం ఉంది’ అని తెలిపింది. ఒకరు విమర్శించారు అనగానే వెంటనే విమర్శించే వ్యక్తిత్వం బెబోది కాదు. ‘లవ్‌స్టోరీ 2050’ చిత్రం విషయానికి వస్తే ‘ఓంకార’ చిత్రం సమయంలోనే ఆ ఆఫర్ వచ్చింది. కేవలం డేట్స్ ప్రాబ్లమ్‌తోనే తిరస్కరించించింది.
కలెన్ క్వీన్...
చోటే నవాబ్ గురించి...
హిట్ చిత్రాలు.. చిత్రం సంవత్సరం రెఫ్యూజి 2000 ముజె కుచ్ కహనాేహ 2001 అశోకా 2001 కభీ కుషీ కభీ గమ్ 2001 చమేలి 2004 దేవ్ 2004 ఓం కార 2006 జబ్ వి మెట్ 2007 గోల్‌మాల్ 3 2010 బాడీగార్డ్ 2011 రా.వన్ 2011
వందకోట్ల కలెక్షన్ సాధించిన చిత్రాలు
- రా.వన్ (2011)
- బాడీగార్డ్ 2011
- గోల్‌మాల్ 3 2010
- ‘త్రీ ఇడియట్స్ 2009
ప్రస్తుతం...
- ఎక్ థా టైగర్
- ఎజెంట్ వినోద్
- తలాష్
- హీరోయిన్
ప్రొఫైల్
పుట్టిన తేదీ : సెప్టెంబర్ 21, 1980
నిక్‌నేవ్గు : బెబో
తల్లిదండ్రులు : రణధీర్ కపూర్, బబిత
చదువు : జమునాబాయ్ స్కూల్, ముంబై;
వెల్హావ్గు బోర్డింగ్ స్కూల్,
డెహ్రడూన్
ఎత్తు : 5.5
కళ్లు : నలుపు
రాశి : విర్గో
అభిమాన నటుడు : షారూఖ్ ఖాన్
తొలి చిత్రం : రెఫ్యూజీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి