6, డిసెంబర్ 2011, మంగళవారం

స్క్రీన్‌ప్లే కన్సల్టెంట్‌లు కావాలి.. - సినీరచయిత K.L. ప్రసాద్‌

సినిమా అంటే మెగా ప్రాజెక్ట్‌. స్క్రిప్టు దశ నుంచే ఇక్కడ ఎంతో హార్డ్‌వర్క్‌ తప్పనిసరి. ఇంత చేసినా... ఏదో చిన్న పొరపాటు చేస్తే సినిమా ఫట్టే! అయితే స్క్రిప్టు, స్టోరీబోర్డింగ్‌ సరిగా ఉంటే సినిమా ఫలితం అనుకున్నట్టుగానే ఉంటుందని ఘంటాపథంగా చెబుతున్నారు సీనియర్‌ రచయిత కె.ఎల్‌.ప్రసాద్‌. రెండు దశాబ్దాలు పైగా ఈ రంగంలో కృషి చేసిన ఆయన స్క్రీన్‌ప్లే రచయితలకి సంబంధించిన గమ్మతె్తైన విషయాలు ఎన్నో చెప్పారు. అవేంటోచదవండి...

klprashad రచయితలు... దర్శకనిర్మాతలకి కథ ఎలా చెప్పాలి?
టాలీవుడ్‌లో రచయిత స్వయంగా కథ విని పించాలి. ఎవరైనా రచయిత 2 గంటల కథను వినిపించడానికి కనీసం మూడున్నర గంటల సమయం పడుతుంది. ప్రతిదీ విపులంగా చె ప్పాలంటే అంత సమయం వెచ్చించాల్సిందే. ఏదైనా పెద్ద విషయాన్ని చిన్నది చేసి చెప్పడం సులువు. బాగా చెప్పొచ్చు కూడా. కథను విస్తరించి చెప్పినప్పుడు అది మరీ అంత గొప్పగా అనిపించకపోవచ్చు.

విజయేంద్రప్రసాద్‌, రామ్‌గోపాల్‌వర్మ, గుణశేఖర్‌... ఇంకా మన పరిశ్రమలోని పెద్ద రచయితలంతా కథలను చెప్పడంలో ఘనాపాటీలే. అలాగే ఇప్పుడున్న ట్రెండ్‌లో 5 నిమిషాలు, 10 నిమిషాలు కథ చెబుతా మంటే కుదరదు. దర్శక నిర్మాతలు, హీరోలు పూర్తిగా వింటామంటున్నారు. అదే హాలీవుడ్‌లో అయితే ఏ రచయిత అయినా స్క్రిప్టు రాసి దర్శకనిర్మాతలకు ఇచ్చేస్తారు. విజువల్‌ సెన్స్‌తో ఆ స్క్రిప్టు మొత్తాన్ని చదివి ఓకే చేసేస్తారు. ఇక్కడ అది కుదరదు. అలాగే రచయితకు హాలీవుడ్‌లో ఉన్న ప్రాధాన్యత ఇతర పరిశ్రమల్లో లేదు.

రచయిత చెప్పిన కథ, స్క్రీన్‌ప్లే యథాతథంగా తెరకెక్కుతోందా?
రచయిత చెప్పిన కథను యథాతథంగా తెర కెక్కే పరిస్థితి మనకి లేదు. కథ వినిపించినప్పు డు ఉన్న ఎమోషన్స్‌ దృశ్యీకరించేప్పుడు రావ ట్లేదు. స్క్రీన్‌ప్లేని మలచడంలో దర్శకులు విఫలమవుతున్నారు. దానివల్లే ఎన్నో సినిమా లు నేడు ఫ్లాపవుతున్నాయి. జయాపజయా లకు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదు. కథనం చూపించడంలో ఫెయిలయితే అంతే సంగతులు.

సినిమా రచయిత ఏ విషయాలు పరిశీలించాలి?
కథ రాసేవాడు, చెప్పేవాడు ఆలోచించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. సినిమా ఏ ప్రేక్ష కుడి కోసం? బడ్జెట్‌ ఎంత? కథ ఎవరికి చె ప్పాలి? నటీనటుల ఇమేజ్‌లు ఏమిటి? ఇలా ఎన్నో కోణాల్లో ఆలోచించాలి. భాష, యాస, కులం, మతం, ప్రాంతం, సంస్కృతి... ఇలా ఎ న్నో విషయాలను పరిగణించాలి. మనకి నచ్చి న ‘శంకరాభరణం’, ‘గీతాంజలి’ హిందీలో ప్లాపవడానికి కారణాలు వెతకితే కొన్ని సంగతులు అర్థ మ వుతాయి. అలాగే రచయిత ప్రేక్ష కుడి సైకాలజీననుసరించి తన స్క్రిప్టును మలుచుకోవాలి.

ప్రస్తుతం ఏం జరుగుతోంది?
ఏదైనా సినిమాని నలుగురై దుగురు రచయిత లు కలిసి రాస్తారు. వాళ్ల పరిధిలోనే ఆ స్క్రిప్టుపై ఆలోచిస్తారు. అది ఎదుటివారికి తెలిసే అవకాశం లేదు. ముఖ్యం గా ఎవరు రాసింది వారికి గొప్ప. అందువల్ల కొన్ని లోపాలు బైటికి తెలియవు. అయితే ఏదై నా స్క్రిప్టును ఓ కన్సల్టెంట్‌ పరిశీలిస్తే... లోటు పాట్లు తెలుసుకునే అవకాశముంటుంది. కన్సల్టెంట్‌ ఫ్రెష్‌ బ్రెయిన్‌తో ఆలోచిస్తారు. దానివల్ల తప్పులు వెతకగలుగుతారు. అలాగే ప్రేక్షకులెప్పుడూ... సినిమాకి ఫ్రెష్‌ బ్రెయిన్‌తో వస్తారు. వారిని మెప్పించాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

జయం-అపజయం దోబూచులాట వెనుక?
ఒక సక్సెస్‌ ఇచ్చిన టీమ్‌ మరోసారి ఫెయిల్‌ అవుతోంది. ఎందుకు అని పరిశీలిస్తే... వారు మలిచిన స్క్రిప్టులో లోపాలను వెతిే కొత్త బ్రెయిను ఉండదు గనుక. పెద్ద దర్శకుడు, పెద్ద హీరో, పెద్ద... సంథింగ్‌ కలిసినా... అపజయమెదురయ్యేది కథ, కథనం లోపం వల్లే అనేది ఎవరైనా అంగీకరించి తీరాలి. అలాగే సినిమా అపజయానికి ఇంకా ఎన్నో కారణాలుంటాయి. అయితే అవన్నీ సెకండరీ.

ప్రస్తుత వ్యాపకాలు?
తెలుగు యూనివర్శిటీలో విజిటింగ్‌ ఫ్యాకల్టీ గా పనిచేస్తున్నా. నవతరం రచయితల కోసం... తరగతులు నిర్వహిస్తున్నాం. అక్కడ ప్రతి క్లాసు 3 గంల పాటు సుదీర్ఘంగా ఉం టుంది. అదేగాక రచయితల సంఘం తరపున అప్పుడప్పుడు స్క్రీన్‌ప్లే వర్క్‌షాప్‌లు నిర్వహిస్తు న్నాం. ప్రపంచ సినిమా విశ్లేషణ సహా హాలీ వుడ్‌ సినిమాపై ఎన్నో విశ్లేషణలు ఈ క్లాసుల్లో ఉంటాయి. స్క్రీన్‌ప్లే రాయాలనుకునే ఔత్సాహి కులకు, ప్రారంభీకులకు సూచనలు చెబు తాం. ఈ తరహా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం.

డా పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మేం ఇటీవల నిర్వహించిన స్క్రీన్‌ప్లే వర్క్‌షాప్‌ కు విశేష స్పందన వచ్చింది. 10 రోజులు, 3 రోజుల స్క్రీన్‌ప్లే వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తు న్నాం. ఈ తరగతుల వల్ల సినిమాని మననం చేసుకోవడం మాలో కొత్త ఎనర్జీని పుట్టిస్తుంది కూడా. ప్రఖ్యాత చిత్రాలు... అనార్కలి, మొ ఘల్‌-ఎ-అజమ్‌ క్లాసులు చెప్పడానికి ఏకం గా 5 క్లాసులు పైనే పడతాయి.

ప్రస్తుత ప్రాజెక్టులు?
ప్రస్తుతం ఓ 8 సినిమాల్లో సహాయనటుడిగా చేస్తున్నా. ఓ 2 సినిమాలకు రచయితగా పని చేస్తున్నా. ఇకముందు నటన సహా రచయిత గా నూ కొనసాగుతాను. అలాగే దర్శకత్వం ఆ లోచన కూడా ఉంది. నా సినిమాకి స్క్రిప్టే హీరో.

సినిమా రంగం వ్యవస్థీకృతం కాదెందుకు?
సినిమా రంగం సంస్థాగతం కాదు. ముఖ్యం గా ప్రొడక్షన్‌ విభాగం వ్యవస్థీకృతం కానేరదు. సృజనపై ఆధారపడిన ఈ రంగంలో ఉద్యోగం చేస్తామంటే కుదరదు. లక్షల జనాలు చూసే సినిమాని ఓ టీమ్‌ కలిసి రూపొందిస్తుంది. ఆ టీమ్‌ తర్వాత కలిసి పనిచేయొచ్చు. లేదా విడిపోనూ వచ్చు. ఒకేచోట ఉండే అవకాశా లు అరుదు. ఎవరి ప్రతిభని బట్టి వాళ్లకు అవకాశాలొస్తాయిక్కడ. సురేష్‌ ప్రొడక్షన్స్‌ లాంటి కొన్ని సంస్థలు ప్రతిభను ఓ బ్యాంకులా తయారు చేస్తుంటాయి. అలా అన్ని సంస్థలు చేయలేవు.

స్వ విషయం ?
పుట్టి పెరిగింది ఒరిస్సాలో. ఎలక్ట్రికల్‌ ఇంజి నీర్‌గా ప్రభుత్వోద్యోగం చేశాను. ఆ క్రమం లోనే సినిమా అంటే ఆసక్తి. అయితే అక్కడ సినిమా అందుబాటులో లేదు అప్పట్లో. దాం తో దేశంలో ఎక్కడ ఏ చలనచిత్రోత్సవాలు జరిగినా ఆసక్తిగా వెళ్లేవాడిని. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పాల్గొనేవాడిని. సొం తంగానే సినిమాపై అభ్యసించేవాడిని. ఆ వి జ్ఞానంతోనే 1987లో మద్రాసు వెళ్లాను. అ క్కడ దర్శకనిర్మాతల పరిచయాలతో రచయి తగా ప్రారంభమయ్యాను. ఎం.వి.రఘు ‘కళ్లు’ చిత్రానికి తొలిసారి రచనాసహకారం అని టైటిల్స్‌లో నా పేరు వేశారు. రాశేఖర్‌ ‘మగాడు’ చిత్రానికి సంభాషణల రచయిత గా గుర్తింపొచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రా లకు రచయితగా కొనసాగాను.

భవిష్యత్‌...స్క్రీన్‌ప్లే కన్సల్టెంట్‌దే!
సినిమా గెలుపోటములపై విశ్లేషించడం అనే ది గొప్ప ప్రక్రియ. దానికి రచయితకు ఎంతో అను భవం అవసరం. ఎన్నో సినిమాలకు పని చేస్తేనే కానీ అది సాధ్యపడదు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప త్రిలో బాడీ స్కాన్‌ చేసినట్లుగా స్క్రి ప్టుని స్కాన్‌ చే యగలగాలి. అప్పుడు దానిలో ని లోపాలు దొరు కుతాయి. అలా నేను విశ్లే షించిన ఓ 4 సినిమాల స్క్రిప్టులు తర్వాత కరె క్షన్‌కి వెళ్లి ఉత్తమ ఫలితాలు అందుకున్న సందర్భాలున్నాయి. ఆ కోణంలో ఆ లోచిస్తే ‘స్క్రీ న్‌ప్లే కన్సల్టెంట్‌’ అనే కార్డుతో పనిచే యాలనే కొత్త ఆలోచన వచ్చింది.

ఏదైనా సినిమాకి సంబంధించిన బౌండ్‌ స్క్రిప్టును దర్శకరచయితలు చెబితే దానికి కన్సల్టెంట్‌గా కొనసాగుతాను. గతం లో ఈ తరహాలో అవకావం వచ్చినా అప్పుడు నిరా కరించాను. తాజాగా ఆ ప్రయత్నాన్ని నేనే ఆరంభి స్తున్నా. దీనివల్ల సిని మాకి మేలు జరుగుతుందనే ది నా యోచన. అమీర్‌ఖాన్‌ ‘రంగ్‌ దే బ సంతి’ స్క్రిప్టును ప్రఖ్యాత హాలీవుడ్‌ స్క్రీన్‌ప్లే రచయిత సిడ్‌ ఫీల్‌‌డ్సకి చూపించి సరిచేయించారు. ఆ సినిమా ఫ లితమేమిటో అందరికీ తెలిసిందే.

ఈ సందర్భంగా ఓ విషయాన్ని చెప్పాలి. సినీకార్మికుల ‘చిత్రపురి కాలనీ’ని ప్రఖ్యాత ఐవిఆర్‌సిఎల్‌ కంపెనీ కాంట్రా క్టు కుదుర్చుకుంది. అయితే దానికోసం ఎంతో ఖ ర్చు చేసి కన్సల్టెంట్‌ను నియోగించుకున్నారు. ఎం దుకంటే గృహ నిర్మాణం అనేది ఓ పెద్ద ప్రాజెక్ట్‌. పొరపాటు జరగకుండా ముందే జాగ్రత్త పడాలి. నిర్మా ణంలో ఏ లోటు పాట్లు లేకుండా చూసుకో వాలి. అలాగే సినిమా కూడా ఓ ప్రాజెక్ట్‌. ఎవ రికీ నష్టాలు రాకూడదు. అయితే సినిమాని విశ్లేషించే కన్సల్టెంట్‌లకు అసాధారణ పరిజ్ఞానం ఉండాలి.
( సూర్య దినపత్రిక సౌజన్యంతో.....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి