సినిమాలు రెండు రకాలు కొన్ని వినోదాన్ని పంచుతాయి.. మరికొన్ని మనలో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి ప్రేక్షకుల మనోఫలకాలపై చెరగని ముద్రను వేస్తాయి వినోదమే సినిమాకి ప్రధానమని చాలా మంది దర్శకులు నమ్ముతారు వాస్తవ జీవన చిత్రణే సినిమా పరమార్థమని విశ్వసించేది ఏ ఒక్కరో ఆ ఒక్కరే మధుర్ భండార్కర్ అందుకే బాలీవుడ్‌లో ఈ దర్శకుడి పేరు రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్ ‘చాందిని బార్, సత్తా, పేజ్3, కార్పొరేట్, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్... ఇలా ఏ సినిమాకైనా ఆయన ఎంచుకున్న కథాంశాలు సమాజపు వాస్తవిక కోణాలే. సత్తా ఉన్న ఆ డైరెక్టర్ గురించే ఈ వారం రంగులకల...
సమాజం తాలూకు కఠోర వాస్తవాల్ని, భిన్న పార్శ్వాల్ని తెరకెక్కించడానికి గొప్ప సాహసం కావాలి. నిశితంగా పరిశీలించగల దార్శనికత కావాలి. మొదటి నుంచి అలాంటి ప్రయత్నాలే చేస్తూ సమాజపు మరో ముఖ చిత్రాన్ని ప్రతిబింబించే సినిమాల్ని రూపొందిస్తూ విమర్శకుల ప్రశంసలు పొందుతున్నాడు మధుర్ భండార్కర్. కనిపించే అందమైన లోకపు చీకటి తెరల మాటున దాగివున్న జీవిత నగ్నసత్యాల్ని తన సినిమాల ద్వారా దృశ్యమానం చేస్తూ సృజనశీలిగా పేరుతెచ్చుకున్నారాయన. రియలిజం ప్రాదిపదికనే బాలీవుడ్‌లో విశిష్ట దర్శకుడిగా పేరుపొందాడు.
సంఘర్షణల నడుమ గడిచిన బాల్యం...
మధుర్ భండార్కర్ బాల్యంలో ఎదుర్కొన్న జీవితానుభవాలే ఆయన రియలిస్టిక్ సినిమా దర్శకుడిగా మారడానికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. చదువు సరిగా అబ్బకపోవడంతో స్కూల్ నుంచి తొలగించారు. మధుర్ మొదట్లో జీవనాధారం కోసం ముంబయ్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూయింగ్ గమ్ అమ్మేవాడు. ఆ తర్వాత ముంబయ్ సబర్బన్ కార్‌లో వీడియో లైబ్రరీలో సేల్స్‌బాయ్‌గా పనికి కుదిరాడు. అక్కడే మధుర్‌కు సినిమాలతో పరిచయమయింది. కస్టమర్లకు సినిమా తాలూకు వివరాలు చెప్పాల్సిరావడంతో ప్రతి సినిమాని వదలకుండా చూసేవాడు. అలా భారతీయ సినిమాతో పాటు ప్రపంచ సినిమాపై మధుర్ విశేషమైన పరిజ్ఞానం సంపాదించగలిగాడు.
డ్యాన్స్‌బార్లకు, భిన్న జీవితాల్లోని వ్యక్తులకు వీడియో క్యాసెట్స్ అందిస్తూ ముంబయ్ జీవితాన్ని నిశితంగా పరిశీలించే అవకాశం కలిగింది. ఆ అనుభవాలే దర్శకుడవ్వడానికి అతనిలో జీజం వేశాయి. మొదట టీవీ సీరియల్స్‌కు అసిస్టెంట్ దర్శకుడిగా నెలకు 1000 రూపాయల జీతంతో పనిచేసిన మధుర్ ఒకానొక దశలో బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిపోయాడు. అక్కడ ఎన్నో హార్డ్ జాబ్స్ చేసిన ఆయన తిరిగి ముంబయ్ రావడం అతని జీవితంలో కీలక మలుపు. టీవీ సీరియల్స్‌కు పనిచేసిన అనుభవంతో రామ్‌గోపాల్‌వర్మ దగ్గర సహాయ దర్శకుడిగా అవకాశం సంపాదించగలిగాడు. ఆయన దగ్గరే ‘రాత్’ సినిమాకి పనిచేశాడు. అక్కడి నుంచి ‘రంగీలా’వరకు వర్మతో అతని ప్రయాణం సాగింది. రామ్‌గోపాల్‌వర్మతో సాన్నిహిత్యం వల్ల సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకోగలిగాడు. అలా ‘త్రిశక్తి’ సినిమాతో మధుర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా విడుదల కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. నూతన తారాగణంతో అండర్‌వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం పరాజయం పాలై నిరాశను మిగిల్చింది. బాలీవుడ్ విమర్శకులు కూడా ఆ సినిమాపై పెదవి విరిచారు. టబు ప్రధాన పాత్రలో 2001లో విడుదలైన ‘చాందిని బార్’ విమర్శకులు ప్రశంసలు పొందటంతో పాటు మధుర్‌భండార్కర్‌ను తిరుగులేని దర్శకుడిగా నిలబెట్టింది. ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అక్కడ నుంచి దర్శకుడిగా ఆయన తిరుగులేని ప్రస్థానం ప్రారంభమయింది.
బార్‌గర్ల్స్ జీవిత దర్పణం...‘చాందినీబార్’
బార్‌గర్ల్స్ జీవితం తాలూకు దయనీయమైన కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘చాందిని బార్’. బిడియస్థురాలైన ఓ మధ్య తరగతి అమ్మాయి ముంతాజ్ (టబు) అయిష్టంగానే బార్‌గర్ల్‌గా ఎలా మారింది? అమె జీవితం అనూహ్యమైన మలుపులు ఎలా తిరిగిందనే విషయాల్ని హృద్యంగా ఆవిష్కరించిందీ చిత్రం. ‘చాందినీ’ బార్ డ్యాన్సర్‌ల జీవితంలోని విభ్రాంతికర వాస్తవాల్ని ప్రేక్షకుల ముందుంచింది. అంతకుముందు డ్యాన్సర్ల జీవితాన్ని వినోదం కోణంలోనే చూసిన సగటు బాలీవుడ్ ప్రేక్షకులకు ‘చాందినీబార్’ కొత్త సత్యాల్ని తెలియజెప్పింది.
సెలవూబిటీ ప్రపంచం ‘పేజ్ 3’
సంపన్న వర్గాల పార్టీ కల్చర్‌లోని చేదు నిజాల్ని బయటపెట్టిందీ చిత్రం. వారి జీవితాల్లోని ద్వంద్వ విలువల్ని , విలాసం చాటున విలాపాన్ని అర్ధవంతంగా ఆవిష్కరించింది. తళుకులీనే పార్టీ కల్చర్‌లో స్నేహమంటే ఓ అవసరమని, సౌకర్యాన్ని బట్టి మారే మానవ సంబంధాలను ఎండగట్టిందీ చిత్రం. సంపన్న వర్గాల కుటుంబాల్లోని నైతిక పతనాన్ని, విశృంఖలత్వాన్ని , అందంగా కనిపించే వారి జీవితాల్లోని చీకటి పార్శాన్ని మన కళ్లముందుంచింది.
‘ఫ్యాషన్’ విష వలయం...
తళుకుబెళుకుల ఫ్యాషన్ ప్రపంచంలో వాస్తవ పరిస్థితుల్ని అద్దం పట్టిన చిత్రం ‘ఫ్యాషన్’. రంగుల ప్రపంచంలో అవకాశాల కోసం, అందలాలు అందుకోవడానికి ఎలాంటి అడ్డదారులు తొక్కుతారో ఈ చిత్రంలో మధుర్‌భండార్కర్ ఆవిష్కరించారు. తారాలోకంలో వెలిగిపోవాలనుకునే నవతరం యువతుల కలల ప్రపంచం చుట్టూ ఎంతటి విషవలయం వుందో ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా ప్రియాంకా చోప్రాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టింది.
ఇక మధుర్ భండార్కర్‌కు ‘చాందినీ బార్’ తర్వాత రెండోసారి జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన చిత్రం ‘ట్రాఫిక్ సిగ్నల్’. గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకుల మధ్య వున్న సంబంధాన్ని, ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ మాటున సాగే కోట్ల అక్రమ వ్యాపారాన్ని, సాదాసీదాగా కనిపించే మనుషుల వెనుక వుండే భయంకర మనస్తత్వాల్ని అత్యంత వాస్తవిక కోణంలో ఆవిష్కరించిందీ చిత్రం.
డబ్బు, కీర్తి, అధికారమే పరమావధిగా కార్పొరేట్ ప్రపంచంలో జరిగే కుతంవూతాలను కళ్లకు కట్టినట్లుగా చూపించింది ‘కార్పొరేట్’ చిత్రం. ఇలా మధుర్‌భండార్కర్ స్పృశించిన ప్రతి చిత్రం వాస్తవిక ప్రాదిపదికన సమాజంలోని మరో కోణాన్ని మనకు పరిచయం చేసింది.
మధూర్ బండార్కర్ అంతరంగం
రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్‌గా పేరున్న మధుర్ భండార్కర్ దేవుణ్ణి బలంగా విశ్వసిస్తాడు. ప్రతి మంగళవారం ముంబయ్‌లోని ప్రఖ్యాత సిద్ధివినాయక టెంపుల్‌ను ఆయన తప్పకుండా సందర్శిస్తాడు . ‘పధ్నాలుగు సంవత్సరాలుగా నేను ఈ గుడికి వస్తున్నాను. దైవం ముందు నేను ఎలాంటి కోరికల్ని నివేదించను. దేవాలయానికి రావడమనేది పవివూతమైన అనుభూతినిస్తుంది. నన్ను ఆ దైవమే సంరక్షిస్తాడనే భరోసానిస్తుంది. ముఖ్యంగా వేలాది మంది ప్రజలు ఒకే భావంతో సందర్శించే పవివూతమైన ప్రదేశం గుడి’ అంటారాయన.
నేను ఏ సినిమా తీసినా ప్రయోగాత్మక కథాంశమని భావించి చేయలేదు. సినిమా చూసిన ప్రేక్షకులు, విమర్శకులు మాత్రమే ప్రయోగాత్మక చిత్రాలనే ముద్రవేశారు. హాలీవుడ్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకునో లేదా హిట్ సినిమాలని నేటి ట్రెండ్‌కు అనుగుణంగా రాసుకునో సినిమాలు తీయడం నాకిష్టముండదు. ఊహాలోకంలో వుండటం కంటే వాస్తవ ప్రపంచంలో జీవించడానికే నేనిష్టపడతాను. అందుకే నా నుంచి సోకాల్డ్ రియలిస్టిక్ సినిమాలు వచ్చాయి. నా సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాల్ని సాధించాయి. అవార్డులు కూడా వరించాయి. కాబట్టి నా తరహా చిత్రాలకు కమర్షియల్ వయబిలిటీ లేదనడం అర్ధం లేనిది.
సినీరంగంలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టనష్టాల్ని ఎదుర్కొన్నాను. అయితే హార్డ్‌వర్క్‌తో పాటు అదృష్ణం కలసి రావాలని నేను విశ్వసిస్తాను. మన ప్రయత్నాలు మనం చేయాలి. పరిణామాలు మన చేతిలో వుండవని నా అభివూపాయం. ధైర్యంగా వున్న వాడినే అదృష్టం వరిస్తుంది. రైట్ టైమ్‌లో రైట్ ప్లేస్‌లో వుండటం సినిమా పరిక్షిశమలో చాలా ముఖ్యం.
‘చాందినీ బార్’ నుంచి ‘హీరోయిన్’ వరకు నా సినిమా ప్రయాణం సంతృప్తికరంగా సాగిపోతుంది. ముంబయ్ వీధుల్లో నిరాశగా తిరిగిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ‘ఇది మధుర్‌భండార్కర్’ చిత్రమని ప్రేక్షకులు ప్రత్యేకంగా ఫీలవడం దర్శకుడిగా నేను సాధించిన విజయమని భావిస్తాను. వాస్తవ జీవిత కథాంశాల నుంచి నేనెప్పుడూ దూరంగా వెళ్లను. నా చుట్టు వున్న సమాజమే నాకు సినిమా రూపకల్పనలో ప్రేరణనిస్తోంది.
సమాజమంటే వివిధ జీవన స్రవంతుల సమాహారం. అందులో బయటికి కనిపించే జీవితం కంటే మనల్ని విస్మయపరిచే వాస్తవాలు ఎన్నో వుంటాయి. వాటి తాలూకు డార్క్ సైడ్ (చీకటి పార్శ్వం) గురించే నాకు ఆసక్తి ఎక్కువ. అందుకే అవి నా సినిమాలకు కథా వస్తువులు అయ్యాయి. నా సినిమాలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. అంతేకాని వాటిలో ఎలాంటి సందేశాలు, పరిష్కారాలను నేను సూచించను.
‘చాందినీ బార్’ చిత్రానికి ప్రెసిడెంట్ కలామ్ నుంచి ఉత్తమ దర్శకుడి అవార్డ్ అందుకోవడం జీవితంలో మధురస్మృతి. ఆ సమయంలో ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ముంబయ్ వీధుల్లో చూయింగ్‌గమ్ అమ్మిన రోజులు కళ్లముందు కదలాడాయి.
‘హీరోయిన్’ కష్టాలు....
మధుర్ కలల ప్రాజెక్ట్ ‘హీరోయిన్’ అర్థాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఐశ్వర్యారాయ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇంకా 65 రోజుల షూటింగ్ మిగిలివుండగానే ఆగిపోయింది. ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెంట్ అన్న విషయం బచ్చన్ కుటుంబ సభ్యులకు అమితానందాన్ని కలిగిస్తే మధుర్ బండార్కర్‌కు మాత్రం అశనిపాతంలా తాకింది. ఈ విషయమై ఆయన తన బ్లాగులో స్పందిస్తూ ‘రెండేళ్లుగా ఎంతో శ్రమించి స్క్రిప్ట్ తయారుచేసుకున్నాను. దాదాపు సగం షూటింగ్ పూర్తయ్యాక హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తెలిస్తే దర్శకుని మానసిక స్థితి ఎలా వుంటుందో చెప్పండి? నాకు స్త్రీ అంటే గొప్ప గౌరవం. మాతృత్వ భావన అనేది ఎవరికైనా వరం లాంటింది. స్త్రీల పట్ల నాకు చాలా సానుభూతి వుంది. సినీరంగంలో స్త్రీలు రాణించడం అన్నింటికంటే గొప్ప విషయమని నేను నమ్ముతాను. అయితే ఐశ్వర్య విషయంలో ఆమె నిజాన్ని దాచిపెట్టినందుకు బాధపడ్డాను.తను తల్లికాబోతుందన్న విషయం ముందే తెలిస్తే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించేవాణ్ణి కాదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఈ సినిమాలో ఐశ్వర్య స్థానంలో కరీనాకపూర్ నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది.
మహిళా ప్రధాన కథలు...
మధుర్‌భండార్కర్ సినిమాల్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...ఆయన సినిమాలో కథానాయకుపూవరూ వుండరు. ఎలాంటి కథాంశాన్ని ఎంచుకున్నా స్త్రీ దృష్టికోణం నుంచే కథని నడిపిస్తాడు. వారి జీవితం చుట్టూనే సబ్జెక్ట్‌ను తయారుచేసుకుంటాడు. చాందినీ బార్ (టబు), సత్తా (రవీనాటాండన్), పేజ్ 3 (కొంకణా సేన్ శర్మ), కార్పొరేట్ (బిపాషాబసు), ఫ్యాషన్ పియాంక చోప్రా), హీరోయిన్ (ఐశ్వర్యారాయ్) చిత్రాలు అన్నీ మహిళా ప్రధాన ఇతివృత్తా కావడం విశేషం.

-కళాధర్ రావు
(26-08-2011 నమస్తే తెలంగాణ నుంచి....)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి