సినిమారంగంలో హంగులు, ఆర్భాటాలతో పాటు ఎన్నో కొత్త కథలు వస్తున్నాయి. కాని తెలుగు హీరో గెటప్ మాత్రం రొటీన్. రొటీన్.. రొటీన్! టాలీవుడ్ హీరోలు కొన్నేళ్ల నుంచి అదే ‘గ్లామర్’తో కనిపిస్తున్నారు. డీ గ్లామర్‌గా కనిపిస్తే అభిమానులు డిజప్పాయింట్ అవుతారనేది వారి భయం కాబోలు..! అందుకే మన చిత్రాలు బార్డర్ దాటకపోగా, పరభాషా చిత్రాలు మన ప్రాంతానికి విశేషం అవుతున్నాయి. కారణం ఒక్కటే... మన వాళ్లపై ‘ఫస్ట్ ఇంప్రెషన్’ కలగకపోవడం. అంటే ఒక్క ‘వెరైటీ గెటప్’ కనిపించకపోవడం.
స్టిల్ ‘యంగ్ ’
ట్రెండ్ మారిన తరవాత ఎన్నో కొత్త కథలు, కథన పద్ధతులతో పాటు ఎంతో మంది కొత్త హీరోలూ పుట్టుకొచ్చారు. అయితే గెటప్ విషయానికొస్తే... ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఈ తరం యంగ్‌హీరోల గురించే. మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్‌కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ్, రామ్.. ఇలా ఎవరిని తీసుకున్నా అందరిలో కామన్‌గా కనిపించే అంశం ‘వావ్లూప్పుడైనా, ఎక్కడైనా ఒకేలా’ కనిపించడం. ఇప్పటిదాకా వాళ్లలో ఎవరూ కొత్త గెటప్‌లో కనిపించలేదనే చెప్పాలి. మహా అయితే జుట్టు పెంచుతారు. ఇంకా చెప్పాలంటే కండలు పెంచుతారు.
అంతే!! ఇవి తప్ప మన యంగ్ హీరోల్లో ఇంకో మార్పు చూపించగలమా? మహేష్‌బాబు గడ్డం, మీసాలతో నటిస్తే చూసేవాళ్లకు ఎంత వెరైటీ! వెంక మీసాల్లేకుండా కనిపిస్తే ఎంత కొత్తదనం! అందుకే వెరైటీ గెటప్ సినిమాకే కాదు నటుడిగానూ ఫ్రెష్‌నెస్ అందిస్తుంది. కాని మనోళ్లు ఇమేజ్ వీరులు. వాళ్ల గడ్డం మీసాల సంగతి కూడా ఫ్యాన్స్‌కు ముడిపెట్టగలరు. అంతేకాదు బురదలో దిగి విలన్‌ను కొట్టే సీన్‌లో కూడా మన హీరోలకు ఆ బురదలోని నీటిని మినరల్ వాటర్‌తో నింపాలని అంటారు. అందం విషయంలో హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోకుండా అంతగా పట్టించుకోరు మన హీరోలు. అందుకేనేమో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ ఆడియో ఫంక్షన్లో ప్రభాస్ ‘నా హెయిర్ స్టయిల్ బాగుందా?’ అని అభిమానులను అడిగాడు. కాస్తంత జుట్టు తగ్గించి గెటప్ కోసం ఆందోళన పడ్డాడంటే... విషయం క్లియర్‌గా అర్ధమవుతుంది. అంటే అందరి పరిస్థితీ ఇలాంటిదే అనుకోక తప్పదు మరి.
పొగడ్త కాదు పోలికే...
టాలీవుడ్‌తో ఎక్కువ అనుబంధం ఉన్న మరో చిత్ర పరిక్షిశమ కోలీవుడ్(తమిళ చిత్ర పరిక్షిశమ). అందుకే ఈ గెటప్ సంగతి కూడా దానితో పోల్చుకోక తప్పదు. తమిళ హీరోలను పొగడడం కాదు గాని, వాళ్లు సినిమాల విషయంలోనే కాదు గెటప్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. టాలీవుడ్‌కు కొన్ని తమిళ సినిమాలపై ‘ఫస్ట్ ఇంప్రెషన్... బెస్ట్ ఇంప్రెషన్’ అవడానికి అదే ఫస్ట్ రీజన్. కమల్‌హాసన్ నుంచి కార్తీ వరకు దాదాపు అందరూ కొత్త కొత్త గెటప్‌లలో కనిపించి తమిళ ప్రేక్షకులనే కాదు తెలుగు వాళ్లను సైతం అలరించారు. యంగ్ హీరోల్లో సూర్య, ఆర్య, విక్రమ్, విశాల్, కార్తీ, విజయ్, శింబు లాంటి వాళ్లు వెరైటీ గెటప్‌లో కనిపిస్తూ తమ సినిమాలపై ఆసక్తిని పెంచుతున్నారు.
ప్రస్తుతం ‘సె సెన్స్’లోని సూర్య గెటప్పే టాలీవుడ్ దృష్టిని మరోసారి అతనివైపు మళ్లేలా చేస్తోంది. ‘గజిని’ తర్వాత ‘సూర్యా సన్నాఫ్ కృష్ణన్’లో తొమ్మిది పాత్రల్లో కనిపించి అదరహో అనిపించుకున్నాడు సూర్య. ‘ఘటికుడు’లో పదేళ్ల బాలుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఆ బాలుడి పాత్రలో ఎవరైనా చైల్డ్ ఆర్టిస్టును చూపించవచ్చు కాని సూర్య అలా చేయలేదు.
నాలుగు కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీని వాడి తన ఫేసులో చైల్డ్ క్వాలిటీ తీసుకొచ్చాడు. అతని తమ్ముడు కార్తీ కూడా మొదటి చిత్రం ‘పరుత్తివీరన్’లో సాధారణ యువకుడిగానే కనిపించినా రెండో చిత్రం ‘యుగానికొక్కడు’లో బీభత్సమైన గెటప్‌లో దర్శనమిచ్చాడు. ఆర్య కూడా అంతే! నటుడిగా ఆయన సత్తా తెలిసిందే ఆయన వేసిన వెరైటీ గెటప్‌ల వల్లే. తొలిచిత్రం ‘గాయం’లో పట్టించుకోలేదు. కాని ఆ తర్వాత ‘నేను దేవుణ్ణి’ చిత్రంలో ‘అఘోరా’గా చూసి ‘ఎవడ్రా బాబూ భలే ఉన్నాడు’ అని స్పెషల్‌గా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది. ‘వాడు వీడు’లో కూడా వెరైటీ గెటప్పే. అదే సినిమాలో విశాల్ నవరసాలు ఒలికించే నటనతో అందరినీ మొప్పించినా ఎక్కువ క్రేజ్ దక్కింది మాత్రం అతను వేసిన లేడీ గెటప్‌కే. అది కదా అసలు వెరైటీ. ఇక విక్రమ్ సంగతి అంటారా? ‘అపరిచితుడు’ నుంచి ‘మల్లన్న’ దాకా ఆయనదంతా వెరైటీ పంథానే. మల్లన్నలో లేడీ గెటప్‌లో కూడా కనిపించాడు. యువ హీరో విజయ్ కూడా ఒక సినిమాలో స్త్రీ పాత్రలో నటించి తన అభిమానులకు కనువిందు చేస్తే, త్వరలో విడుదలకానున్న చిత్రంలో శింబు మరో కొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం లారెన్స్ కూడా హిజ్రా గెటప్‌తో ‘కాంచన’గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
మనోళ్ల సంగతి...
అప్పుడప్పుడూ సహజత్వం, నేటివిటీ, క్యారెక్టర్, ఫిజికల్ ఎఫెక్ట్ కోసం మారినట్టే, సినిమాకో గెటప్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. హెయిర్ స్టయిల్ నుంచి క్యాస్టూమ్స్ వరకు ఏదో ఒకటి మార్చేయవచ్చు. ‘డైలాగ్ డెలివరీ’ నుంచి ‘మేనరిజమ్’ వరకు ఏదో ఒక వెరైటీ చూపించవచ్చు. కాని మన యంగ్ హీరోలు చేసిన అలాంటి ప్రయత్నాలు అంతగా అతికినట్టు అనిపించవు. ‘అతిథి’లో మహేష్ జుట్టు పెంచితే పోకిరికి ఎక్స్‌టెన్షన్‌లా అనిపించింది కాని కొత్తదనం కొరవడింది.
పాత్ర కోసం విదేశాల్లో మార్షల్‌ఆర్ట్స్ నేర్చుకుని వచ్చిన అల్లు అర్జున్ కత్తి పట్టుకున్న ‘దేశముదురు’లాగే కనిపించాడు కాని కొత్తగా వచ్చిన ‘బవూదినాథ్’గా అనిపించలేదు. ‘శక్తి’లో విగ్గు మీద చూపించిన శ్రద్ధ జుట్టు పెంచుకునేందుకు చూపించనట్టుంది ఎన్టీఆర్. అందుకే ఆ పెట్టుడు గెటప్ పెద్దగా ఆకర్షించలేకపోయింది. అయినా ఉపేంద్ర జట్టు లేకుండా నటించడం కొత్త గెటప్‌గాని జుట్టును ముడేసి నటిస్తే కాదుకదా!
కొంచెం వెనక్కి...
25 సంవత్సరాల నట జీవితంలో వెంక ఒక్క సినిమాలోనైనా కొత్తగా కనిపించాడా? (‘నాగవల్లి’లో అఘోరాగా కనిపించినా పిచ్చివాడి గెటప్‌లా ఉందా వేషం. అందుకే దాన్ని వెంటనే మరిచిపోయారు అభిమానులు) ఒక రకంగా ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాలతో నాగార్జున నయం అనిపించుకున్నాడు. చిరంజీవి అయితే లేడీ గెటప్(చంటబ్బాయ్)లో కూడా కనిపించి ఎప్పుడో క్రెడిట్ కొట్టేశాడు. బాలకృష్ణ ‘భైరవద్వీపం’ చిత్రంలో పలు గెటప్‌లతో ఓకే అనిపించుకున్నాడు. రాజశేఖర్ ‘శేషు’గా గుండుతో కనిపించి ఆకర్షించాడు. ఇంకొంచెం ముందుకెళ్తే రాజేంవూదవూపసాద్, సీనియర్ నరేష్ వంటి వారు లేడీ గెటప్‌లు వేసి హాస్యం పండించారు. వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మానందం, ఆలీ వంటి వారు కామెడీ కోసమైనా లెక్కలేనన్ని వెరైటీ గెటప్స్‌లో కనిపించి తమ జన్మధన్యం చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తరం పురాణాల పుట్ట అయినా ‘బృహన్నల’ వంటి నపుంసక పాత్రల్లో కూడా కనిపించారు. కాబట్టి ఆ తరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు.
క్రేజీ క్యారెక్టర్స్
లేడీ గెటప్, గుండుతో నటించడం, మానసిక, శారీరక వికలాంగుడిగా కనిపించడం, ముసలి పాత్రల్లో... కోరమీసం, బట్టతల, ఎత్తుపళ్లు, మేకప్ లేకుండా, నపుంసక పాత్రలు ఇవన్నీ ఎంతోమంది హీరోల కెరీర్‌ను మలుపు తిప్పగలిగే క్రేజీ క్యారెక్టర్లు. అంత డీప్‌గా మనవాళ్లు ఎప్పుడు కనిపిస్తారో కాని రెగ్యులర్ అప్పీయన్స్‌కు పూర్తి భిన్నంగా కనిపిస్తే చాలు. ‘వెరైటీ గెటప్స్ అన్నీ కథలో భాగంగా రావాలిగాని మేమేం చేయగలం’ అనేది కొందరు హీరోల భావన. వాదన. కాని వాస్తవం ఆలోచించండి.
ఒక కాలేజ్‌లో ప్రొఫెసర్ పాత్రకు మీసాలు ఉన్నా లేకున్నా ప్రేక్షకులు ‘ఫీల్’ అయ్యే ప్రమాదమేమీ లేదు. కాని ఎప్పుడూ మీసాలతో కనిపించే తమ హీరో ఒక్కోసారి బాలీవుడ్ హీరోలా ఆ ప్రొఫెసర్ పాత్రలో మీసాల్లేకుండా కనిపిస్తే అభిమానులు ‘థ్రిల్’ ఫీలవ్వకుండా ఉంటారా? అయినా వెరైటీ అంటే పాత్ర కోసమే చేసేది కాదు... ఎప్పుడూ ఒకేలా కనిపించకపోవడం. థ్రిల్ చేయగలిగే ‘లుక్’తో ఉండడం. అది పాత్ర కోసం చేసినా, అభిమానుల కోసం చేసినా కొత్తదనాన్ని చూసేందుకు సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగానే ఉంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి