6, డిసెంబర్ 2011, మంగళవారం

కెప్టెన్ ఆఫ్ ది షిప్...

‘డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అనేది సినీ నానుడి. అయితే ఎంతమంది కెప్టెన్లు షిప్‌ను సజావుగా నడుపుతున్నారు. డైరెక్టర్ పనిలో ప్రతీ ఒక్కరూ వేలు పెట్టేవారే. ఐటెమ్‌సాంగ్ లేకుంటే బాగుండదంటాడు నిర్మాత... క్లయిమాక్స్ మార్చకుంటే డేట్స్ ఇవ్వనంటాడు హీరో... ఎన్ని డ్రెస్సులు, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో హీరోయినే డిసైడ్ చేస్తుంది. ఇక కెమెరామ్యాన్‌ల ముందు చాలామంది దర్శకులు డమ్మీలే అనేది యూనిట్‌కు తెలిసిన ఓపెన్ సీక్రేట్. కథమీద, క్యారెక్టర్ మీద, కెమెరా మీద, తీయబోయే సీన్ మీద కమాండ్ ఉండి... ‘నేను మోనార్క్’ని అనే సినీ ‘సీతయ్య’ల (ఎవరి మాటా వినరు) గురించే ఈ స్టోరీ...


Directors-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

సినిమాని కళ కోసంఅని భావించిన కాలం నుంచి.... కాసుల కోసమే సినిమా అనే కాలం వరకు.... ఓ దశ దర్శకుల హవా కొనసాగితే... మరో దశ కథానాయకుల హవా కొనసాగింది. ఇక స్టార్స్ శకం మొదలైనప్పటి నుంచి దర్శకుడి అభివూపాయానికి విలువ బాగా తగ్గిపోయింది. ఈ రెండు దశల్లోనూ తాము నమ్మిన కథనీ, క్యారెక్టర్‌నీ తప్ప దేనికీ ప్రలోభపడకుండా...స్టార్స్‌తో సంబంధం లేకుండా ఆకాలం నుంచి ఈ కాలం వరకు పయనిస్తూ విజయాలు సాధిస్తున్నవారూ లేకపోలేదు. హిట్, ఫ్లాప్, స్టార్లను నమ్ముకోకుండా కేవలం తమ క్రియేటివిటీని పెట్టుబడిగా పెడుతున్న వారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చేమో...

కెప్టెన్ ఆఫ్ ది షిప్...
తెలుగు దర్శకుల గురించి మాట్లాడటం మొదలు పెడితే ఆ వరుసలో ముందు మాట్లాడు కోవాల్సింది డా.దాసరినారాయణరావు గురించి. ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు కథానాయకులుగా క్షణం తీరిక లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ మంచి డిమాండ్‌మీదున్న సమయం అది. ఇదే సమయంలో రైటర్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసిన దాసరినారాయణరావు తక్కువటైమ్‌లోనే తన షార్ప్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకోగలిగాడు. కమెడియన్ రాజబాబును హీరోగా పెట్టి దాసరి ‘తాతా మనవడు’ వంటి లోబడ్జెట్ చిత్రాన్ని రూపొందించి హిట్ కొట్టడంతో దర్శకుడిగా ఆయన సత్తా అర్థమైంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా దాదాపు పద్నాలుగు హిట్‌లు అందించిన దాసరి ఎప్పుడూ తను నమ్మిందే చేస్తూ వచ్చాడు కానీ ఆయన మరొకరి ముందు తలవంచిన దాఖలాలు కనిపించవు.

తెలుగు సినిమాకు కొత్త పోకడని నేర్పి...
మూస ధోరనిలో సాగిపోతున్న తెలుగు సినిమాని చూస్తూ సగటు ప్రేక్షకుడు భారంగా కాలం వెళ్ళదీస్తున్న రోజులవి... 80,90 దశకాల్లో వస్తున్న రొటీన్ సినిమాలు చూసీ చూసి ప్రేక్షకులు ఒక విధంగా విసుగెత్తిపోతున్న సమయమది. ఈ టైమ్‌లోనే నూతనోత్తేజంతో సరికొత్త తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేసి తెలుగు సినిమా ఒరవడినే మార్చిన దర్శకుడు వంశీ. 1982లో చిరంజీవి నటించిన ‘మంచుపల్లకి’తో దర్శకుడిగా మారిన వంశీ షాట్ డివిజన్ పరంగా నేటితరం దర్శకులకు తన మార్గదర్శకుడిగా నిలిచాడని చెప్పొచ్చు. ఒక సినిమాకు కథ దగ్గరి నుంచి సంగీతం వరకు తను చెప్పిందే జరగాలి, ఆయన రూపొందించిన ప్రతి చిత్రానికి ఇదే సూత్రాన్ని వంశీ అనుసరించి ఎవరికీ లొంగక,ఎవరి మాట వినక తను అనుకున్నది అనుకున్నట్టు అక్షరాలా పాటిస్తూ తిరుగు లేని కమాండింగ్‌తో దర్శకుడిగా మోనార్క్ అనిపించుకున్నాడు.

కథ, కాంబినేషన్ జాంతానై...
దర్శకుల్లో కొంత మంది విజయాలతో పాపులర్ అయితే వివాదాలతో పాపులర్ అయిన దర్శకులు మాత్రం రామ్‌గోపాల్‌వర్మ, తేజలే. ఈ ఇద్దరిదీ భిన్నమైన మనస్థత్వమే. ఒకరు ‘హిచ్ కాక్’ సినిమాలు చూసి దర్శకుడిగా మారితే ...అసిస్టెట్ కెమెరామెన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా మారిన నేపధ్యం మరొకరిది. ఇందులో రామ్‌గోపాల్ వర్మ కథలేకుండా కేవలం వివాదాలనే కథావస్తువుగా చేసుకుని గ్యాంగ్‌స్టర్, దెయ్యాల కథలతో సినిమాలు చేస్తూ తద్వారా వచ్చే క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటుంటే అందుకు కొంత భిన్నంగా ప్రేమకథలపై పడి మరో విధంగా వివాదాలతో దర్శకుడిగా పాపులర్ అయిన నేపథ్యం తేజది. ఇక వర్మ తన పంథా తనదేనంటూ స్టార్స్‌గీర్స్ జాంతానై నేనే ఓ స్టార్ అన్నచందంగా సినిమాలు చేస్తూనే నేను ఎవరి కోసం సినిమాలు చేయను నాకోసమే చేసుకుంటా అంటూ వితండవాదం చేస్తూ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.

‘గులాబీ’ నుంచి అదే తీరు...
దర్శకులలో కృష్ణవంశీది ప్రత్యేకమైనశైలి. కెమెరా అసిస్టెంట్‌గా...ఆ తర్వాత అసిస్టెంట్ ఎడిటర్‌గా ...ఆతర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆయన సినీ ప్రస్థానం సాగింది. వర్మ దగ్గర శిష్యరికం చేసినా ప్రతివిషయాన్ని పూర్తి పెర్‌ఫెక్షన్‌తో శోధించి సినిమాలు రూపొందించే దర్శకుడిగా కృష్ణవంశీకి మంచి పేరుంది. కెరీర్‌వూపారంభంలో వర్మ తనని దర్శకుడిని చేస్తానని మాటిచ్చి తప్పినా ఆతర్వాత క్రమక్షికమంగా దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్నాడు కృష్ణవంశీ. తనదైన కథని,క్యారెక్టర్‌ని నమ్మి సినిమా చేస్తాడని ‘గులాబి’ చిత్రంతో నిరూపించుకున్నాడు. ఒక సారి కథ ఓకే అయితే వంశీ ఎవరు చెప్పినా వినడని ,వంశీ పనిరాక్షసుడని అంటారంతా. దీనివల్ల కెరీర్ పరంగా చాలా నష్టపోయినా తను నమ్మిన సిద్ధాంతానికే కట్టిబడి ఉన్నాడు. ఇప్పటికీ వంశీ కథకు ప్రాముఖ్యతనిస్తాడేతప్ప స్టార్స్‌ని నమ్మి సినిమాలు చేయడన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక రామ్‌గోపాల్‌వర్మ బ్యాచ్‌లోని అసిస్టెంట్ డైరెక్టర్లలో 15వ నెంబర్ వాణ్ణినేనే అని చెప్పుకునే పూరీజగన్నాధ్ కూడా ముందు కథే ఆతర్వాతే ఎవరైనా ...ఏదైనా అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తాడు.రవితేజను హీరోని చేసి దర్శకుడు తలచుకుంటే ఎవరినైనా స్టార్‌ని చేయగలడని నిరూపించి పూరీ తను మోనార్క్‌ని అనిపించుకున్నాడు.

సీరియల్ టూ సినిమా...
కె.రాఘవేంవూదరావు రూపొందించిన ‘శాంతినివాసం’ సీరియల్‌తో దర్శకత్వ శాఖలో ప్రవేశించి... ఆతర్వాత స్టూడెంట్ నె.1తో దర్శకుడిగా తెరంగేట్రం చేశాడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆసినిమా తర్వాత తనలో టాలెంట్ వుందని అందరికీ తెలియజెప్పడం కోసం రాజమౌళి కసితో చేసిన చిత్రం ‘సింహాద్రి’. ఈ సినిమాతో దర్శకుడిగా తన సత్తాని చాటుకున్న ఆయన కథనే హీరోగా భావించి చేసిన చిత్రం ‘మగధీర’. రాజమౌళి సినిమా తీస్తే హీరోకన్నా ఆయనకే ఎక్కువగా పేరొస్తుందనేది ఓపెన్ సీక్రేట్. తొలి సినిమా నుంచి ప్రస్తుతం రూపొందిస్తున్న ‘ఈగ’ దాకా రాజమౌళి మాటకే పవక్కువ.

నొప్పించక తానొవ్వక...
సినిమాలు చూసిన అనుభవం తప్ప... ప్రాక్టికల్‌గా ఏమాత్రం అనుభవం లేని శేఖర్‌కమ్ముల కూడా ఎవరి ఒత్తిడులకు లొంగడనే పేరు తెచ్చుకున్నాడు. తొలిచిత్రం ‘డాలర్‌వూడీమ్స్’ నుంచి ‘లీడర్’ దాకా ఆయనను సెల్ఫ్‌మేడ్ డైరెక్టర్‌గా రుజువుచేశాయి. శేఖర్ చేసిన సినిమాలన్నీ స్టార్స్‌ని కాకుండా కేవలం కథని నమ్మితీసినవే కావడం గమనార్హం. ఇక యంగ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఇండవూస్టీలోని అన్ని శాఖలపై గ్రిప్‌తో తను అనుకున్నది తెరమీద వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కథని క్యారెక్టర్నీ నమ్ముకొని సినిమాలు చేస్తూ... హిట్, ఫ్లాప్‌లకు వెరవకుండా... స్టార్స్‌కి ఏమాత్రం బెండ్ కాకుండా కమాండింగ్‌తో చిత్రాలు చేస్తూ స్టార్స్‌కు ధీటుగా స్టార్‌డమ్‌ని సంపాదించుకుంటున్న ఇలాంటి దర్శకులే చిత్రసీమలో ఎక్కువ కాలం మనగలుగుతారని వేరే చెప్పాలా!
- రవి గోరంట్ల
(నమస్తే తెలంగాణ సౌజన్యంతో..)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి