6, డిసెంబర్ 2011, మంగళవారం

జర్నలిస్టు భామలు



‘డాక్టర్ కాబోయి యాక్టర్‌నయ్యాన’నే మాటను చిత్ర పరిక్షిశమలో తరచూ వింటుంటాం. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోతోంది. కలం పట్టి కదం తొక్కాలనుకున్న కొందరు అమ్మాయిలు రూటు మార్చి వెండితెరపై మెరిసిపోతున్నారు. వర్థమాన నాయికలు నిత్యామీనన్, శ్రద్ధాదాస్, ప్రియా ఆనంద్‌లు జర్నలిజం నేపథ్యం నుంచి... సినిమా రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాస్ మీడియా నుంచి వచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాలో సందడి చేస్తోన్న ఈ తారలు చెప్పిన కొన్ని విశేషాలు.

జర్నలిజం సరిపడదు....
‘అలా మొదలైంది’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న కేరళ సుందరి నిత్యామీనన్ సినిమాల్లోని రాక ముందు జర్నలిజంలో డిప్లొమా చేసింది. యాదృచ్ఛికంగా ఇటీవల విడుదలైన ‘180’ చిత్రంలో ఫోటో జర్నలిస్టు పాత్రను చేసింది. అయితే జర్నలిజాన్ని తన వృత్తిగా ఎప్పుడూ భావించలేదంటోంది నిత్యా. మరి జర్నలిజాన్ని వదలి సినిమాల్లోకి ఎందుకొచ్చావని ప్రశ్నిస్తే తనదైన సై్టల్ల్లో గడసుగా సమాధానమిస్తోంది..‘జర్నలిజం అనేది నా దృష్టిలో పవివూతమైన వృత్తి. అయితే అందరూ ఆ వృత్తికి న్యాయం చేయలేరు.

అక్కడ ఎంతో సంయమనంతో పనిచేయాల్సివుంటుంది. జర్నలిజంలో కొన్నిసార్లు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని పనిచేయాల్సివుంటుంది. నా మనస్తత్వానికి ఆ రంగం సరిపడదనిపించింది’ అని చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి కూడా అనుకోకుండా వచ్చానని, సినిమాని ఎప్పుడూ తన కెరీర్‌గా ఎంచుకోలేదని అంటోంది ఈ భామ. ‘పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఫొటోక్షిగఫీ కోర్సు చేద్దామనుకున్నాను. నందిని రెడ్డి (అలా మొదలైంది దర్శకురాలు) ప్రోద్భలంతోనే ‘అలా మొదలైంది’ సినిమాలో నటించాను. జర్నలిజం, సినిమాగాక నా జీవిత ప్రాధమ్యాలు వేరుగా వున్నాయి’ అని వ్యాఖ్యానించింది.

ఇప్పటికీ మక్కువే...
ఇక ‘లీడర్’తో పరిచయమైన తెలుగమ్మాయి ప్రియా ఆనంద్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెలో కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. జర్నలిజం, సినిమా వేరు కాదంటోంది ప్రియా ఆనంద్. ‘నా దృష్టిలో జర్నలిజం, సినిమా రెండు మీడియాలోని భాగాలే. అయితే నాకు మొదట్నుంచి నటి కావాలనే వుండేది. జర్నలిజం ద్వారా మీడియాకి సంబంధించిన అనేక విషయాల్ని మనం తెలుసుకోగలుతాం. అందుకే జర్నలిజం కోర్సు చేశాను. ఓ టీవీ ఛానెల్‌లో కొన్నాళ్ల పాటు సహాయదర్శకురాలిగా కూడా పనిచేశాను. ఇప్పుడు సినిమాల్లో బిజీగా వున్నా జర్నలిజం అంటే నాకు ఇప్పటికీ మక్కువే’ అని అంటోంది. ‘లీడర్’ చిత్రంలో ప్రియా ఆనంద్ కూడా జర్నలిస్టు పాత్రలో కనిపించడం విశేషం.

సినిమా తర్వాత జర్నలిస్టుగానే...
‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో పరిచయమైన శ్రద్దాదాస్ వీరిద్దరికీ భిన్నంగా జర్నలిజమే నా కేరీర్ అంటోంది. సినిమాల్లో పోటీ ఎక్కువని, ఈ పరిక్షిశమలో కొంతకాలమే కొనసాగగలమని, అందుకే ప్రత్యామ్నాయంగా జర్నలిజం కోర్సు అభ్యసించానని చెబుతోంది. సినిమా రంగం నుంచి తప్పుకుంటే టీవీ జర్నలిస్టుగా స్థిరపడే ఆలోచనలో వున్నానంటోంది ఈ బెంగాలీ భామ.
(నమస్తే తెలంగాణ నుంచి..)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి