6, డిసెంబర్ 2011, మంగళవారం

టాలీవుడ్‌ డైరెక్టర్స్ చూపు.. బాలీవుడ్‌ వైపు



Sekhar-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaప్రస్తుతం టాలీవుడ్ దర్శకులంతా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారు. దర్శకులకు ప్రమోషన్ ఏంటని ఆశ్చర్యపోకండి.. తెలుగులో ఒకటి రెండు సూపర్‌హిట్స్ సాధించిన సో కాల్డ్ అగ్ర దర్శకులంతా బాలీవుడ్‌లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. బాలీవుడ్‌లో ఒక్క హిట్ కొట్టితే జాతీయ స్థాయిలో మార్కెట్‌ను విస్తరించుకోవచ్చన్నది వారి ఆశ. అయితే సదరు దర్శకుల బాలీవుడ్ డ్రీమ్స్ అన్నీ ప్రకటనల వరకే పరిమితమైపోతున్నాయి. ఒక్క సూపర్‌హిట్‌తోనే తదుపరి మజిలీ బాలీవుడ్ అంటున్నారు. పూరి జగన్నాథ్ మినహా సమకాలీన దర్శకుల్లో బాలీవుడ్‌లో గుర్తింపుకు నోచుకున్న వారొక్కరూ లేకపోకడం గమనార్హం. తెలుగులో ఒక్క హిట్ కొట్టగానే సదరు సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తామని ఊదరగొట్టడం ఈ మధ్యన టాలీవుడ్ దర్శకులకు ఫ్యాషన్ అయిపోయింది. కార్యరూపం దాల్చకుండానే కలలుగానే మిగిలిపోతున్న తెలుగు దర్శకుల బాలీవుడ్ సినిమాల కథాకమామిషు ఏంటో ఓసారి చూద్దాం!


srini-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema‘100 పర్సెంట్ లవ్’ హిట్ అని తేలగానే సుకుమార్ ఆ చిత్ర హిందీ రీమేక్‌కు తనే దర్శకత్వం వహిస్తానని చెప్పాడు. అంతేకాదు హిందీ రీమేక్ పూర్తయ్యేవరకూ మరే ఇతర తెలుగు ప్రాజెక్ట్ చేసేదిలేదని కూడా తేల్చిచెప్పాడు. దాదాపు సంవత్సరం గడిచిపోయింది. అయినా సుకుమార్ హిందీ చిత్రం గురించి పెదవి విప్పలేదు. ప్రస్తుతం ఆయన మహేష్‌బాబు సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ రూపకల్పనలో బిజీగా వున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘రెడీ’ చిత్ర హిందీ రీమేక్‌లో సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. హిందీలో ఆ చిత్రం చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది.దక్షిణాది హిట్ చిత్రాల్ని హిందీలో రీమేక్ చేయడానికి ఉత్సాహం చూసే సల్మాన్ తాజాగా శ్రీనువైట్ల చిత్రం ‘దూకుడు’ రీమేక్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి. శ్రీనువైట్ల కూడా సల్మాన్‌ఖాన్‌తో దూకుడు చిత్రాన్ని హిందీలో చేస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటనపై సల్మాన్‌ఖాన్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో శ్రీనువైట్ల హిందీలో చేస్తామనుకున్న దూకుడుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో తీయబోయే సినిమా కథా చర్చల్లో వున్నారు.

sukumar-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema‘కిక్’ సినిమాని కూడా హిందీలో రీమేక్ చేయడానికి నిర్మాతలు ఆసక్తిగా వున్నారని ఈ చిత్రంతో బాలీవుడ్‌లో తన ఎంట్రీ ఖాయమని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రకటించాడు. ఈ చిత్రంలో కూడా సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తాడని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. నూతన తారలతో ‘హ్యాపీడేస్’ చిత్రాన్ని రూపొందించి స ంచలన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని భావించాడు. అయితే ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల అందరూ నూతన తారలతో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇలా టాలీవుడ్ అగ్ర దర్శకుల బాలీవుడ్ ప్రాజెక్ట్స్ అన్నీ ప్రకటనల వరకే పరిమితమైపోతున్నాయి. అయితే తెలుగు హిట్ చిత్రాల్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్న ఆక్కడి నిర్మాతలు, దర్శకుల విషయం వచ్చేసరికి మాత్రం హిందీ దర్శకుల వైపునకే మొగ్గుచూపుతున్నారు.

surendhar-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహిందీ దర్శకులకు నేటివిటీ గురించి బాగా తెలిసివుండటం వల్ల సినిమాకి వారే న్యాయం చేయగలరనే అభివూపాయంతో హిందీ నిర్మాతలు వున్నట్లు తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా మలయాళ దర్శకుడు సిద్ధిఖీ గురించి ప్రస్తావిస్తున్నారు. మలయాళంలో సిద్దిఖీ దర్శకత్వం వహించిన ‘బాడీగార్డ్’ చిత్రం తమిళ, హిందీ భాషల్లోకి రీమేక్ అయి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయినా సిద్దీఖీకి ఇంత వరకూ ఒక్క హిందీ సినిమా ఆఫర్ కూడా రాలేదు. పూరి జగన్నాథ్ మాత్రం ‘బుడ్డా హోగయా తేరే బాప్’ చిత్రంతో హిందీ పరిక్షిశమ దృష్టిని ఆకర్షించాడు. బాలీవుడ్ సినిమాలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటనలిస్తున్న తెలుగు దర్శకులందరూ ఆ ప్రాజెక్ట్స్ ఎందుకు కార్యరూపం దాల్చడం లేదో ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం వుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి