కాట్రాజు’...
ఛత్రపతి సినిమా చూసినవాళ్లెవరైనా ఈ పేరు వినగానే ఉలిక్కిపడతారు. క్రూరమైన చూపులతో, హావభావాలతో ప్రేక్షకులను భయపెట్టిన ఆ నటుడు... సుప్రీత్. రెడీ, కింగ్, ఢీ, మర్యాద రామన్న, రాజన్న తదితర చిత్రాలతో తనేంటో నిరూపించుకున్న సుప్రీత్, ప్రస్తుతం బాలీవుడ్‌లో తన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. ‘రౌడీ రాథోడ్’ షూటింగులో బిజీగా ఉన్న సుప్రీత్ ఫన్‌డేతో చెప్పిన ముచ్చట్లు...
ఇండస్ట్రీవైపు తొలి అడుగులు...?
మొదట్నుంచీ చదువంటే ఇంటరెస్ట్ లేదు. నటనమీదే మనసంతా. ఎప్పుడూ ఫిల్మ్‌నగర్‌లోనే చక్కర్లు కొట్టేవాడిని. షూటింగుల దగ్గరకు వెళ్లేవాడిని. చూసేవాడిని. కానీ అవకాశం ఇవ్వమని ఎవర్నీ అడిగేవాడిని కాదు. అలా పదకొండేళ్లు గడిపేశాను.
మరి ఎదురుచూపులు ఎప్పుడు ఫలించాయి?
‘జయం’ సెలెక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్తే, అంతా అయిపోయిందన్నారు. అప్పటికే రాత్రి ఎనిమిదవుతోంది. సరే వెళ్లిపోదామనుకుని బయలుదేరితే షూ లేస్ ఊడిపోయింది. నిలబడి కట్టుకుంటుంటే తేజగారు వచ్చి ఇక్కడేం చేస్తున్నావన్నారు. విషయం చెబితే ఆల్బమ్ ఉందా అని అడిగారు. నటుడు కావాలనుకునేవాడు ఓ ఆల్బమ్ మెయింటెయిన్ చేయాలని కూడా నాకు తెలీదు. లేదన్నాను. ఉన్న ఫొటోలేవో తీసుకుని పొద్దున రమ్మన్నారు. మర్నాడు వెళ్తే ఏదైనా నటించి చూపించమన్నారు. తర్వాత ఓకే చేశారు.
ఆ తర్వాత...?
‘జానీ’లో నటించాను. తర్వాత ‘సై’. ఆ సినిమా కోసం రెండు నెలలు రగ్బీ ట్రైనింగ్ తీసుకున్నాం. ప్రొఫెషనల్స్ కన్నా భయంకరంగా ప్రాక్టీస్ చేయించారు. ఆ దెబ్బలిప్పటికీ ఉన్నాయి. తర్వాత ‘ఛత్రపతి’లో కాట్రాజు పాత్రతో జీవితమే మారిపోయింది.
అసలు ‘కాట్రాజు’గా ఎలా మారారు?
ఛత్రపతి కోసం నన్ను ప్రభాస్ ఫ్రెండ్స్‌లో ఒకడిగా సెలెక్ట్ చేశారు. కాట్రాజు పాత్రకు కొత్త నటుడి కోసం చూస్తున్నారు కానీ దొరకలేదు. అప్పుడు రమా రాజమౌళి ‘సుప్రీత్‌ని పెడితే ఎలా ఉంటుంది’ అన్నారట! వెంటనే నన్ను పిలిచి కాట్రాజు గెటప్ వేస్తుంటే హీరో ఫ్రెండ్ ఇలా ఉంటాడేమో అనుకున్నాను. కానీ తర్వాత విషయం తెలిసింది అది విలన్ పాత్ర అని.
హ్యాపీగా ఫీలయ్యారా?
హ్యాపీనా... నా మూడ్ పాడైపోయింది. హీరో ఫ్రెండన్నారు, ఓ పాటుంటుందన్నారు, ఫైటన్నారు... ఇవేమీ లేని ఈ పాత్రేమిటనుకున్నాను. నేను ఇష్టపడకపోవడంతో ‘రిస్క్ చేయకపోతే ఏమీ ఉండదు, ట్రై చేయి’ అన్నారు రాజమౌళి. దాంతో కమిటయ్యాను. సినిమా రిలీజయ్యాక చూస్తే నావి రెండు, మూడు సీన్లే ఉన్నాయి. ఇంటర్వెల్ కంటే చాలాముందే చచ్చిపోతాను. దాంతో తెగ బాధపడ్డా. కానీ ఆ పాత్రకొచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. అప్పట్నుంచీ నా పేరు కాట్రాజుగా స్థిరపడిపోయింది.
విలనే ఎందుకయ్యారు? వేరే పాత్రలు చేయాలనిపించలేదా?
లేదు. నేను విలన్ పాత్రలకే సరిపోతానని అనిపించింది! అలాగని మెయిన్ విలన్ కావాలని ఆశపడలేదు. విలన్ వెనక ఉండే రౌడీగా చేసినా చాలనుకున్నాను.
బయటికి వెళ్లినప్పుడు జనం మిమ్మల్ని చూసి ఎలా రియాక్టవుతారు?
ముందు దూరం దూరంగా వెళ్లిపోతారు. ఎవరో ఒకరు ధైర్యం చేసి వచ్చాక, మిగిలినవాళ్లు కూడా వచ్చి ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు అంటారు. ఏం చేస్తాం, నేను కాట్రాజుగా ఫిక్సైపోయాను వాళ్ల మైండ్‌లో!
సినిమాలో మీరు అందర్నీ బాధపెడతారు. మరి మిమ్మల్ని బాధపెట్టిన అనుభవం...?
రౌడీ రాథోడ్ (విక్రమార్కుడు హిందీ రీమేక్) షూటింగ్... ఓ ఫైట్ సీన్‌లో నేను మోకాలిని హీరో అక్షయ్‌కుమార్ ముఖమ్మీద తగిలించినట్టు చేయాలి. కానీ టైమింగ్ మిస్సవడంతో గట్టిగా తగిలేసింది. అక్షయ్ కిందపడిపోయారు. చాలాసేపటి వరకూ లేవలేకపోయారు. నా బాధ అంతా ఇంతా కాదు.
తర్వాత సారీ చెప్తే, ఆయన నన్ను హగ్ చేసుకుని, ‘ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, దీనికింత బాధపడటం ఎందుకు’ అంటూ నవ్వేశారు. ఎంత గొప్పవాడో కదా అనిపించింది. ఆయన కనుక ‘ఇదేం పనయ్యా’ అని ఒక్క మాటన్నా సినిమాలు వదిలేసి వెళ్లిపోదామనుకున్నాను.
విలన్‌గా మీ రోల్‌మోడల్ ఎవరు?
మోహన్‌బాబుగారు. ఆయన ముందు మంచి విలన్. తర్వాతే హీరో. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను. కానీ మోహన్‌బాబు సినిమా అంటే వదలను. కోట శ్రీనివాసరావు నటన కూడా ఇష్టమే!
కొందరు విలన్లు హీరోలయ్యారు. మరి మీరు...?
ఆల్రెడీ అవకాశాలు వచ్చాయి కానీ నో అన్నాను. విలన్‌గా నా పాత్ర నేను చేసేస్తే సరిపోతుంది. కానీ హీరో అయితే సినిమా బాధ్యతను భుజాన మోయాల్సి వస్తుంది. అంత రిస్క్ తీసుకోదలచుకోలేదు.
మీ డ్రీమ్‌రోల్...?
కామెడీ విలన్‌గా చేయాలనుంది. సీరియస్‌గానే కాదు, కామెడీగానూ విలన్ పాత్రను పండించగలనన్న నమ్మకం నాకుంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
ఎంతోమంది దర్శకులతో పనిచేశాను. అందరూ నాకు మంచి అవకాశాలిచ్చారు. బాగా ప్రోత్సహించారు. కానీ అసలు నేనివ్వాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి... రాజమౌళి. సుప్రీత్ అనేవాడు లేకుండా కాట్రాజు ఉండేవాడేమో కానీ రాజమౌళిగారు లేకుండా సుప్రీత్ అనేవాడు లేడు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
Tags:supreeth, suprith, katraj, katrajh, chatrapathi, chatrapathi villon, villon suprith, సుప్రీత్, కాట్రాజ్, ఛత్రపతి విలన్

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి