ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. మూవీ మొఘల్‌గా ఈయన్ని అభివర్ణిస్తారు. 135కు పైగా చిత్రాలు నిర్మించారు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచారాయన. ఇరవై ఒక్క మంది కొత్త దర్శకుల్ని, వారి అబ్బాయి వెంకటేష్ సహా ఆరుగురు హీరోలను, 12 మంది హీరోయిన్లను, ఏడుగురు సంగీత దర్శకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్ సభ్యునిగానూ రాణించారు. 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. హైదరాబాద్, విశాఖపట్నంలలో అనితర సాధ్యమైన స్టూడియోలు నిర్మించి ఇప్పటికీ ఏడుపదుల వయసులోనూ ఎందరికో ఆదర్శప్రాయులవుతున్నారు. మూవీమొఘల్ రామానాయుడులో మరో కోణం...
అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్ సభ్యునిగానూ రాణించారు. 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. హైదరాబాద్, విశాఖపట్నంలలో అనితర సాధ్యమైన స్టూడియోలు నిర్మించి ఇప్పటికీ ఏడుపదుల వయసులోనూ ఎందరికో ఆదర్శప్రాయులవుతున్నారు. మూవీమొఘల్ రామానాయుడులో మరో కోణం...
వ్యక్తిగతం
తెలుగు సినిమా గర్వించదగ్గ నిర్మాతల్లో డాక్టర్ డి.రామానాయుడు ఒకరు అంటే అతిశయోక్తి కాదేమో? నిర్మాత కావాలనుకునే వారికి, విజయవంతమైన సినిమా తీయాలనే వారికి ఆయన ఒక నిఘంటువు. అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగానే కాకుండా అత్యధిక భాషల్లో సినిమాలు తీసిన వ్యక్తిగా కూడా ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. నిర్మాతగా ఆయన సాధించిన విజయాలు కోకొల్లలు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా, స్టూడియో అధినేతగా, అనితరసాధ్య విజయాలెన్నిటినో అలవోకగా సొంతం చేసుకున్న రామానాయుడు తన ఇద్దరు తనయుల్లో ఒకరిని టాప్ హీరోను చేస్తే, మరొకరిని టాప్ ప్రొడ్యూసర్‌గా మలిచారు. తన మనవళ్లలో రానా, నాగచైతన్య ఇద్దరు మనవళ్లు కూడా కథానాయకులు కావడంలో స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. నిర్మాతగా డాక్టరేట్‌ను అందుకోవడమే కాకుండా, భారతదేశపు సినిమా పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుని, తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయస్థాయిలో నిలబెట్టిన డాక్టర్ డి.రామానాయుడు దాదాపు భారతీయ భాషలన్నింటిలోనూ సినిమాలను తీశారు. ఒక వ్యక్తిగా ఆయన ఎప్పుడూ హార్డ్‌వర్క్, డిసిప్లిన్, డెడికేషన్‌ను నమ్ముతారు. నిజాయితీగా క్రమశిక్షణతో మనం పడాల్సిన కష్టమంతా పడటమే మనం చేయగలిగిందని భావిస్తారు.అలాగే సక్సెస్ వచ్చినపుడు పొంగిపోవడం, ఫెయిల్యూర్ వచ్చినపుడు కుంగిపోవడం అనేవి ఆయనకు తెలియదు. ‘ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మనం మరింత మనోనిబ్బరంతో ఉండాలి. సక్సెస్ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలని విశ్వసిస్తాను’ అంటుంటారు. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే నాగిరెడ్డివంటి మహానుభావులు చెప్పిన మాటలను రామానాయుడు అప్పట్నుంచి ఇప్పటిదాకా పాటిస్తూనే ఉన్నానంటారు.
సినిమా జీవితం
కారంచేడులో ‘నమ్మిన బంటు’ షూటింగ్‌లో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు, రామానాయుడు ఓ సీన్లో నటించారు. హుషారుగా అటు ఇటు తిరుగుతుండగా సినిమావాళ్ళ దృష్ట్టిని ఆకర్షించారు. తిరిగి వెళ్తునప్పుడు ‘మీరు సినిమాల్లోకి ఎందుకు నటించకూడదు?’ అని అక్కినేని అడికితే, వూరు, వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బదులిచ్చారు. ఇష్టం లేకున్నా రైసుమిల్లు వ్యాపారం మొదలుపెట్టారు. ఓ రోజు హఠాత్తుగా సేల్స్-టాక్స్‌వాళ్ళు వచ్చి, బిల్లులు రాయడం లేదంటు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మిద విరక్తి వచ్చేసింది, మిల్లు మూసేసి... వూరు విడిచి చెన్నపట్నం చేరుకున్నారు.
మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నారు. కాలక్షేపానికి రోజూ తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్‌కు వెళ్ళేవారు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి. ‘అనురాగం’ చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురుపెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి, దురలవాట్ల జోలికి వెళ్లనని మాటిచ్చారు. ఇక అక్కడినుంచి ‘రాముడు-భీముడు’ చిత్రం తర్వాత వెనక్కితిరిగి చూసుకోలేదు నాయుడుగారు
సూర్య దినపత్రిక సౌజన్యంతో....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి