దేశానికి గర్వకారణమైన అంశాల్లో ఏమేం ఉంటాయి? సినిమాలు కూడా ఉంటాయా? ఉంటాయి, కానీ తెలుగు సినిమాలు కాదు. తెలుగు సినిమాలు తెలుగుస్టార్స్‌కే గర్వకారణం. దేశానికి కాదు. దేశానికి గర్వకారణమైన అంశాల్లో తమిళ సినిమాలు కూడా ఉన్నాయని సాక్షాత్తు ప్రధాని మన్మోహన్‌సింగే వెల్లడించాక తెలుగు ప్రజలు తెల్లమొహం వేయాల్సిందే. గత జనవరిలో జరిగిన ఎన్నారైల సదస్సులో ‘తమిళ సినిమాల క్రియేటివిటీ, బెంగుళూరులో నాలెడ్జి విస్ఫోటనం, గుజరాత్‌లో పారిశ్రామికాభివృద్ధి చూశాక ప్రతి వొక్కరూ తాము భారతీయులమైనందుకు గర్వపడతారు’ అని చెబుతూ ఇంకోమాటన్నారు ప్రధాని-తమిళ సినిమాల క్రియేటివిటీ ఉన్నత శిఖరాలనందుకుందని!
అంటే తెలుగు సినిమాలు నేటివిటీ అంటూ నేలమీదే ప్రాకులాడుతున్నాయని వేరే చెప్పనవసరం లేదు. మరీ యంగ్‌స్టార్, ‘రంగం’తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన జీవా, ఇకపైన తాను మూకుడులో మూసకావల కొత్త క్రియేటివిటీతో కథలు చెబితేనే వింటానని భీష్మించుకున్నాడు. తెలుగులో మూసలో మూసుకుపోయి మిగతా ప్రపంచాన్ని చూడమంటున్నారు. ప్రధాని దృష్టిలో పడేంతగా తమిళ సినిమాల క్రియేటివిటీ ఎలా పెరిగిందని? ఈక్రియేటివిటీ బాలచందర్, భారతీరాజాల కాలం నాటిదేనా? కాదు, ఈ క్రియేటివిటీకి టెక్నాలజీ తోడైంది. అది మణిరత్నం నుంచీ ప్రారంభమైంది. మణిరత్నంని దాటుకుని పోతోంది. సృజనాత్మకత సాంకేతికత ఈ రెండింటి విచ్ఛిత్తే ప్రధాని అభిభాషించిన ఉన్నత శిఖరాలనందుకుంది. ఆ సినిమాలు హిట్ కావచ్చు. ఫ్లాప్ కావచ్చు. కానీ 180, నాన్న, రంగం, గగనం, వాడు-వీడు, ఏమాయ చేశావె, రోబో లాంటి ఇటీవలి కొన్ని తమిళ సినిమాలు చాలు. పైన చెప్పిన విచ్ఛిత్తిని అర్ధంచేసుకోవడానికి. వాళ్లు బాలచందర్, భారతీరాజా తదితర కళాత్మకదర్శకుల క్రియేటివిటీని వదలేదు. దాన్ని నిలబెట్టుకుంటూ అందివస్తున్న ఆధునిక టెక్నాలజీని జోడించుకుపోతున్నారు.
కానీ తెలుగులో బాపు, విశ్వనాధ్‌ల లాంటి క్రియేటివ్ జీనియస్‌లని అక్కడే వదిలేశారు. కనీసం వంశీని కూడా అందిపుచ్చుకోలేదు. క్రియేటివిటీని ఆనాటి వైభవం దగ్గరే మూసేసి, టెక్నాలజీ తలుపులు తెరుచుకుని ఒంటికాలితో పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ఒక ‘శక్తి’ , ఇంకో ‘అనగనగా ఓ ధీరుడు’, మరో ‘బద్రినాధ్’ లాంటి నాన్ క్రియేటివ్ టెక్నికల్ బ్లండర్స్‌తో బొక్కబోర్లా పడుతున్నారు. హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ మాటేమోగానీ, మెగా సెట్స్ జోరుగా లేపుతున్నారు. వాటిలో చూపించే కథల్లో సృజనాత్మకత బదులు సాంకేతిక ఆర్భాటంతో హడావుడి చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాలు క్రియేటివ్ దివాలాకోరుతనంతో ఫ్లాపవుతున్నా సరే, చిన్న సినిమాలు వీటినే అనుకరిస్తుంటాయి. కానీ చిన్న సినిమాలకి వాటికంటూ వేరే ఫోటోఫ్రేం కథలూ, నటనలూ, మేకింగ్ వుంటాయని తెలుసుకోరు. నేటివిటీ పేరుతో పెద్ద సినిమాలు స్థాపించిన మూస ఫార్ములానే అనుసరిస్తుంటాయి. మూస ఫార్ములా క్రియేటివిటీని ఒప్పుకోదు. అది లేనిపోని టెక్నాలజీతో కాలుష్యాన్ని సృష్టించడానికైనా సిద్ధపడుతుంది. టెక్నాలజీ గురించి క్రియేటివ్ పరిభాషలో మాట్లాడడం దానికి తెలీదు. చెన్నైలో ‘180’ దర్శకుడు జయేంద్ర ‘మొత్తం సినిమాని లో-కీయాంబీన్స్‌లో, సీక్రేట్ మ్యానర్‌లో చిత్రీకరించాం. ఎందుకంటే ప్రోమోస్ విడుదల చేసినపుడు మా సినిమాలో ఫీల్‌కి ఎంత ప్రాధాన్యముందో ప్రేక్షకులకి ముందుగా తెలియాలి’ అన్నాడంటే ఇందులో ఒక్క ముక్కా మనకి అర్ధంగాదు సరే, ఇదే సినిమాలో మొదటి పాటని డిజిటల్ కెమెరాతో సెకనుకి 110 ఫ్రేముల స్పీడుతో చిత్రీకరిస్తే స్లోమోషన్‌లో అది హెచ్‌డి ఎఫెక్టుతో సమున్నతంగా కన్పిస్తుందన్న సాధారణ టెక్నికల్ నాలెడ్జిని కూడా అర్ధం చేసుకోలేరు. ఇందులో మొదటిది క్రియేటివ్ సెన్స్‌లేక, రెండోది పూర్తి టెక్నికల్ నాలెడ్జి లేక ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
క్రియేటివిటీని పక్కనపెడితే తమిళ సినిమాల్లో టెక్నికల్ హంగుల గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. క్రియేటివిటీని వదులుకుని టెక్నాలజీనే నమ్ముకున్న తెలుగు సినిమాల టెక్నికల్ హంగామా గురించి ఎవరూ మాట్లాడుకోరు. గుణాత్మకంగా మాట్లాడుకోవడానికి ఏమీఉండదు గనుక.
దర్శకుడు జయేంద్ర స్టేట్‌మెంట్లో మొదటి భాగంలో కన్పిస్తున్న సృజనాత్మక సాంకేతిక విచ్ఛిత్తి గురించి అర్ధం కావాలంటే సినిమాల్లో ఆయా సన్నివేశాల ఫీల్ తెలియాలి. అది క్రియేటివ్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. దీపామెహతా ‘ఫైర్’, ‘జోయా అఖ్తర్’, ‘జిందగీ నా మిలేగీ దుబారా’, జయేంద్ర ‘180’లలో ఒకటే సామాన్యాంశం- అది అతి తక్కువ లైటింగ్ అనే లో-కీ యాంబీన్స్ సృష్టి. అది ఒక విధంగా సహజ లైటింగ్ కూడా. కానీ మన సినిమాల్లో ఫుల్ లైటింగ్ ఉండాలి. హీరో ముఖం వెలిగిపోతూ ఉండాలి. వెలుగు నీడలనే ద్వంద్వాల వూసే ఉండకూడదు. ఇంతేకాదు గ్రేడింగ్ విషయంలోనూ ఇదే బండ ఫ్లాట్ పద్ధతి. అది అమెరికా అయినా, అమలాపురం అయినా దేనికా ఫీల్ లేకుండా ఒకే గ్రేడింగ్. ఈ గ్రేడింగ్‌నే డిఐ (డిజిటల్ ఇంటర్మీడియెట్ అని కూడా అంటారు). దీన్నొకసారి ‘ఏమాయ చేశావె’లో చూడండి, లేదా ‘180’లో చూడండి. స్థల మార్పులు వాతావరణ పరిస్థితుల్ని ప్రస్ఫుటిస్తూ ఎలాంటి ఫీల్ కలిగిస్తాయి? మొదటిదాన్లో హైదరాబాద్-కేరళ-అమెరికాలకి వాటి ప్రాంతీయత అనుభవంలోకి వచ్చేట్టు కలర్, లైటింగ్ కరెక్షన్స్‌తో డిఐ చేస్తే, రెండోదాంట్లో హైదరాబాద్-అమెరికాల దృశ్యాలకి డిఐతో అదే వైవిధ్యాన్ని కనబర్చారు. డిఐ అనేది ఇందుకే ఉంది, అంతేగానీ మన సినిమాల్లో లాగా హైదరాబాద్‌కీ, వారణాసికీ బండగా అవే రంగులు పులమడానికి కాదు. ‘తీన్‌మార్’లో వారణాసినీ, హైదరాబాద్‌నీ వేర్వేరు రంగుల్లో చూపించారు కదా అనొచ్చు. ఆ వారణాసి దృశ్యాలు ఫ్లాష్‌బ్యాక్‌లోనివి. ఫ్లాష్ బ్యాకుల్నే వేరే రంగుల్లో చూపిస్తారు మన సినిమాల్లో. అంతవరకే క్రియేటివిటీ. నేటివిటీ పేరుతో క్రియేటివిటీని హరించేశాక అది టెక్నాలజీ అన్పించుకోదు. రేపు హైటెక్ ప్రధానిగా రాహుల్‌గాంధీ వచ్చినా తెలుగు సినిమాల్ని ప్రపంచానికి పరిచయం చెయ్యడు.
సాంకేతిక హంగులు సర్వ మంగళం! -సికిందర్, July 28th, 2011
ఆంధ్రభూమి సౌజన్యంతో....

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి