అటుతిరిగి ఇటు తిరిగి ఎక్కడెక్కడికో పయనించిన చిత్రపరిశ్రమ కథలు మీడియాని వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం మీడి యా కథలకి మంచి గిరాకీ ఉంది. చిత్రపరిశ్రమ కూడా వీటిపైనే గురిపెట్టింది. ఇటీవల వచ్చిన డబ్బింగ్ చిత్రం ‘రంగం’ హిట్ కావడం, వెనువెంటనే ఇదే నేపథ్యాన్ని దర్శకులు ఎంచుకుంటున్నారు.
ఒకప్పుడు మన హీరో రాయుడు, రౌడీ పోలీస్ ఆఫీసర్, ప్రేమికుడు, ఖైదీ, డాక్టర్. తాజాగా ఇప్పుడు వెండితెర హీరో జర్నలిస్టు. ‘రంగం’ సినిమాలో హీరో ఫోటో జర్నలిస్టు. ఈ సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రంలో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. గుప్పెడేసిగా కలుపుమొక్కల్లా పుట్టుకొస్తూ తెలుగు టీవీ సీరియల్స్ కంటే అత్యంత దారుణంగా బలహీన కథ, కథనాలతో విడుదలవుతున్న తెలుగు సినిమాలు ఎక్కడా కూడా నాలుగైదు రోజులపాటు ఆడడం లేదు. పాపం సినిమా హాల్స్ యాజమాన్యం తీవ్రంగా నిరాశపడుతున్నారు. వందల్లో వస్తున్న తెలుగు చిత్రాల్లో ఈ సినిమా సూపర్ అని గట్టిగా చెప్పడానికి లేదు. ఈ నేపథ్యంలో డబ్బింగ్ సినిమాలకి మన ప్రేక్షకులు నీరాజనాలు అర్పిస్తున్నారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. అలాంటిదే ‘రంగం’ సినిమా కూడా! ఈ సినిమా ఇతివృత్తం మీడియా కావడం విశేషం. అలాగే ‘180’ సినిమాలో నిత్యామీనన్ కూడా జర్నలిస్టే. ‘నగరం నిద్రపోతున్న వేళ’లో కూడా ఛార్మి జర్నలిస్టే. కథంతా ఛార్మి చుట్టూ తిరుగుతుంది. పరిశోధనాత్మక జర్నలిజాన్ని ఆధారం చేసుకుని అల్లిన కథ ఇది. తాజాగా విడుదలైన ‘విరోధి’ సినిమాలో హీరో శ్రీకాంత్ జర్నలిస్టు. జయదేవ్ పాత్రలో నటించాడు. ఇలాంటి కథలు ఎంచుకుంటే సరిపోదు ఆసక్తికరంగా నడిపించాలి. మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా ‘రంగం’ మాత్రం ఒకేఒక్కడు, అంతిమ తీర్పు తరహాలో హిట్టయింది. హీరోని జర్నలిస్టు పాత్రలో చూపించడం మన చిత్రపరిశ్రమకి కొత్తేమీ కాదు. అయితే ఏకకాలంలో ఇలాంటి సినిమాలు మార్కెట్‌లోకి రావడమే విశేషం.
ప్రఖ్యాత మలయాళ దర్శకుడు ‘జోషి’ కృష్ణంరాజు హీరోగా వచ్చిన ‘అంతిమ తీర్పు’ చాలా చక్కటి సినిమా. ఇప్పుడు కూడా చూడాలనిపిస్తుంది. ‘్ఢల్లీ డైరీ’ పత్రిక ఎడిటర్‌గా కృష్ణంరాజు చక్కటి నటన కనబరిచారు. పాటలు, ద్వంద్వార్ధాల మాటలు లేకుండా కథలోని సీరియస్‌నెస్‌ని మిస్ చేయకుండా దర్శకుడు బాగా తెరకెక్కించాడు. ‘అంతిమ తీర్పు’ సినిమాలో జర్నలిస్టుగా నటించిన సురేష్‌గోపీ ఆ తర్వాత వచ్చిన రిపోర్టర్, జర్నలిస్టు సినిమాల్లో హీరోగా నటించాడు. ‘వెలుగునాడు’ పత్రిక చీఫ్ ఎడిటర్ అరుణ్‌కుమార్‌గా గోపీ నటన సూపర్. పత్రికా వ్యవస్థలోని లోపాలను ఈ సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన దాదాపు ప్రతి సినిమాలో జర్నలిస్టుకి ప్రాధాన్యత ఉంటుంది. ‘ఆలయశిఖరం’ సినిమాలో ‘చాకిరేవు’ పత్రిక ఎడిటర్‌గా పి.ఎల్.నారాయణ పాత్రని చక్కగా మలిచారు. బహుశా ఇది ‘ఎన్‌కౌంటర్’ పత్రిక ఎడిటర్ పింగళి దశరధరామ్‌ని ఊహించుకుని ఈ పాత్ర రూపకల్పన చేసి ఉండవచ్చు. ‘అంకుశం’ చిత్రంలో కూడా జర్నలిస్టు పాత్ర కీలకమే! శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ మీడియా తలచుకుంటే సమాజానికి ఎంత మేలు జరుగుతుందో తెలియజేసింది. ఈ సినిమాలో హీరో అర్జున్ ఓ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటించాడు. శక్తివంతమైన పత్రికా వ్యవస్థని అంతకంటే శక్తివంతంగా సెల్యులాయిడ్‌పై చూపించడం కేవలం కొందరు దర్శకులకే సాధ్యపడింది. మణిరత్నం, శంకర్, జోషిలు విజయం సాధించారు. కళాతపస్వి కె.విశ్వనాధ్ సైతం ‘సాగరసంగమం’ సినిమా ప్రారంభంలో కమల్‌ని విలేఖరిగా చూపించారు. వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘రాము’ సినిమాలో ఫోర్త్ ఎస్టేట్ ప్రధాన భూమిక పోషించింది. పత్రిక ఎడిటర్ పాత్రలో శారద హుందాగా నటించారు. ‘షాక్’లో టాబు కూడా టీవీ చానల్ రిపోర్టర్‌గా సీరియస్‌గా కనిపించింది. ఒకటీ, అరా తప్ప దాదాపు అందరు హీరోలు మీడియా రిపోర్టర్ల పాత్రలో నటించారు. ‘పరశురాం’ సినిమాలో శ్రీహరి ‘టెర్రర్’ పత్రిక జర్నలిస్టుగా న్యాయం చేకూర్చాడు. ఈ చిత్రంలో డైలాగులు బాగుంటాయి. కేవలం కలం బలం మాత్రమే కాదు పత్రికా ప్రతినిధికి కండబలం కూడా ఉండాలని పరశురాం పాత్ర నిరూపించింది.
‘బంగారం’ చిత్రంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఓ టీవీ చానల్ రిపోర్టర్. అసలు కథ వదిలేసి హీరోని మరో కోణంలో చూపించడంవలన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తిరుపతిస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘గణేష్’లో ఓ సిన్సియర్ రిపోర్టర్‌గా వెంకటేష్ పాత్రంలో జీవించాడు. డైరక్టర్ తిరుపతిస్వామి స్వతహాగా జర్నలిస్టు కావడం విశేషం. ఆ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా ఒకటి ఉంది.
ఈ సినిమాను సుమారు ఎనిమిదిమంది ప్రొడ్యూసర్లు వద్దన్నారు. అబ్బే ఏమాత్రం ఆడదన్నారు. తీరా చిత్రం విడుదలై పలు అవార్డులు సాధించి ప్రేక్షకుల గుండెల్ని పిండేసింది. మనలో నిద్రాణంలో ఉన్న మానవత్వాన్ని తట్టిలేపింది. అబ్బే ఇదేం సినిమా అన్నవాళ్లే...అబ్బో అసలు సినిమా అంటే ఇదే అన్నారు. కథా రచయితగా మదన్‌కి, హీరోగా రాజేంద్రప్రసాద్‌కి, డైరక్టర్ చంద్రసిద్ధార్ధకి పేరు తెచ్చింది. ఈ సినిమా పేరు ‘ఆ నలుగురు’. పత్రికా ఎడిటర్‌ల గౌరవాన్ని ఒక్కసారిగా పెంచేసిన సినిమా ఇది. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు రావచ్చు రాకపోవచ్చు. కానీ వ్యవస్థకి అవసరం ఉంది. ‘జగపతిబాబు హీరోగా వచ్చిన ‘సామాన్యుడు’ ఫర్వాలేదు. అశ్లీలం తగ్గించి అసలు కథ మీద దృష్టిపెడితే బాగుండేది. మీడియా ఇతివృత్తంగా సినిమాలు ఎంపిక చేసుకోవడం మంచిదే కానీ మసాలాలు తగ్గించి కథనాన్ని ఆసక్తికరంగా నడిపిస్తే ప్రేక్షకులు చూస్తారు. లేకపోతే ఎంత గొప్పగా చెప్పుకున్నా ప్రయోజనం శూన్యం. ఇలాంటి కథల్లో ప్రతి సన్నివేశంపై కూడా దర్శకుడు పూర్తిగా అధ్యయనం చేయాలి.
-కోనె సతీష్‌కుమార్, July 21st, 2011
ఆంధ్రభూమి సౌజన్యంతో...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి