అందాల భామ ఛార్మి వైభవం రోజురోజుకూ మసకబారుతూ వస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మంత్ర’ (2007) తర్వాత ఛార్మి హీరోయిన్‌గా నటించిన ఏ తెలుగు సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. ఈ మధ్యలో ఆమె బాపు దర్శకత్వంలో ‘సుందరకాండ’, వి.ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ‘మనోరమ’, రమణ దర్శకత్వంలో ‘సై ఆట’, ‘మంత్ర’ఫేం తులసీరామ్ దర్శకత్వంలో ‘మంగళ’, ప్రేమ్‌రాజ్ దర్శకత్వం వహించిన ‘నగరం నిద్రపోతున్న వేళ’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. కానీ ఈ చిత్రాల్లో ఏ ఒక్కటీ ఆమెకి కమర్షియల్ విజయాన్ని అందించలేదు. కొద్దిరోజుల తేడాతో ఇటీవల వచ్చిన ‘నగరం నిద్రపోతున్న వేళ’, ‘మాయగాడు’ సినిమాలకు కనీసపు స్పందన కరువవడంతో డిజాస్టర్ అయ్యాయి. గుడ్డిలో మెల్ల ఏమంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అమితాబ్‌తో కలిసి నటించిన బాలీవుడ్ మూవీ ‘బుడ్డా..హోగా తేరా బాప్’ ఆమెకి బాలీవుడ్‌లో కాస్త గుర్తింపును తెచ్చింది. ప్రస్తుతం ఛార్మి చేతిలో ఒకే ఒక్క చిత్రం ‘సేవకుడు’ వుంది. అందులో శ్రీకాంత్‌కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఆడకపోతే ఛార్మిని పట్టించుకునే నాథుడే వుండడు. అదీ సంగతి!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి