సినిమా తయారీకి ముఖ్య కారకులైన రచయిత, దర్శకుడు, నటుడులాంటి కొంతమంది తాము తాముగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నక తేలిగ్గా జవాబు దొరకవచ్చు. కానీ ఆ జవాబుకు కారణమైన వర్గాన్ని తక్కువ చూపు చూడడం జరుగుతుంది ప్రస్తుతం. అంతేకాదు హీరో, డైరక్టర్ తమ ప్రాధాన్యతను నిలుపుకునే ఫ్రయత్నంలో ఈ వర్గాన్ని విస్మరించడం కూడా జరుగుతోంది ఒక్కోసారి. ఇంతకీ ఎవరికోసం అయితే సినిమా తీయాలని సినీ కర్తలచేత చిన్న చూపు చూడబడుతోందో ఆ వర్గమే ప్రేక్షక సమూహం. అవును సినిమా తీయాల్సింది ఖచ్చితంగా ప్రేక్షకుల కోసమే. ఇంకా చెప్పాలంటే సినిమా తీసేముందు అందులో భాగం పంచుకునే దర్శకుడు, నిర్మాత, రచయిత లాంటి వారంతా తమ డిస్కషన్స్‌లో అన్ని విషయాల గురించి చర్చించుకునేటప్పుడు ఈ ప్రేక్షకుడిని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల తన సినిమాల ద్వారా తన ప్రవర్తన ద్వారా తన ప్రకటనల ద్వారా సెనే్సషన్ క్రియేట్ చేస్తున్న దర్శకులు రాంగోపాల్‌వర్మ కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఇంటర్వ్యూలలో మీరు సినిమాలు ఎవరికోసం తీస్తారు అనే ప్రశ్నకు చాలా ఓపెన్‌గా నాకోసం తీసుకుంటాను అని జవాబు చెప్పారు. మరి ప్రేక్షకుల గురించి అని అడిగితే వారికి నచ్చితే చూస్తారు లేకుంటే తిరస్కరిస్తారు అనే సమాధానం చెప్పాడు. ఇంత నిజాయితీగా సమాధానమిచ్చిన రాంగోపాల్‌వర్మను మొదట అభినందించాలి అనిపించొచ్చు. కానీ ఇంకో కోణంలో ఆలోచిస్తే ప్రేక్షకులంటే అసలు లెక్కలేదా అనే బాధ కలిపిస్తుంది.
ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా సినిమా తీయాల్సింది ప్రేక్షకుడికోసం. సినిమాయే కాదు, అసలు ఏ కళారూపమైనా ప్రజలకోసమే నిర్దేశింపబడింది కళ కళకోసం కాదు. కాసుల కోసమని ఆలోచించే వ్యాపారవేత్తలు కూడా ప్రేక్షకులకోసమే కళ అనే విశ్వాసాన్ని నమ్మినవారే. కారణం ఆ ప్రేక్షకులు చూస్తేనే కాసులు వస్తాయి కాబట్టి. ఇక నిజమైన కళాకారులు ప్రజలంతా చూసి తమలోని కళను అభినందిస్తేనే తమ కళ సార్ధకమైనట్టు భావిస్తారు. కాబట్టి ఏవిధంగా చూసినా అనేక కళల సమాహారమైన సినిమా ప్రేక్షకులకోసమేనని చెప్పక తప్పదు. అయితే చిత్రంగా ఇప్పుడు సినిమావాళ్లు ప్రేక్షకుల్ని చిన్నచూపు చూస్తున్నారు, సినిమా ప్రెస్‌మీట్లలో మాట్లాడేటప్పుడు ప్రేక్షక దేవుళ్లు సంబోధించడం తప్ప, మిగతా సమయాల్లో ప్రేక్షకుల్ని గుర్తుంచుకోవడంలేదు సినిమా నిర్మాణకర్తలు. సినిమా తీయాలనుకునే ముందు జరిగే చర్చల్లో దర్శకుడు, నిర్మాత, రచయిత చర్చించుకునేది హీరో గురించి, పాటలు ఏ ఇతర దేశాల్లో తీయాలి, ఫైట్స్ ఎంత రిచ్‌గా తీయాలి. ఎంత భారీ సెట్స్ వేయాలి అనేగానీ మనం తీసే సినిమా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు వారి అభిరుచులు ఎలా మారుతున్నాయి అనే విషయాల గురించి కాదు. కథ అంతా సిద్ధమైన తర్వాత కూడా హీరో స్థాయినిబట్టి అవసరం లేకపోయినా వారిచ్చే సలహాపై అనేక మార్పులు చేయడం జరుగుతుంది. హీరో కూడా తన క్రేజ్‌ను గురించే ఆలోచిస్తాడు కానీ ప్రేక్షకుల గురించి కాదు. అందుకే సినిమాలు ఇలా అపజయం పొందుతున్నాయి. ఇకనుంచైనా ఈ పరిస్థితులు మారాలి. సినిమా వ్యాపారానికి ముఖ్యమైన ప్రేక్షకుడ్ని గురించి ఆలోచించాలి. వారి అభిరుచుల్ని, కాలానుగుణమైన మార్పుల్ని ప్రతిబింబిస్తూ సినిమాలు నిర్మించాలి. అపుడే ప్రేక్షకుడు ఇతర వినోద ప్రక్రియల్ని పక్కనపెట్టి థియేటర్‌కు వస్తాడు. సినిమాల్ని విజయవంతం చేస్తాడు. లేకుంటే తాము తీసిన సినిమాలు తమ హోంథియేటర్‌కు పరిమితమవుతాయి.
-పి.ఎం.సుందరరావు
March 31st, 2011, ఆంధ్రభూమి, వెన్నెల

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి