కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్టు పైవన్నీ సత్యాలే. కానీ డిమాండ్ సప్లై సూత్రం రేట్లను నిర్ణయిస్తుందనేది ఆర్థిక సత్యం. అలా అని సినిమా భారీ సక్సెస్ కొట్టినప్పుడు పెంచుకోవడానికి భారీ ఫెయిల్యూర్ అయినపుడు తగ్గించుకోవడానికి వీలులేదిక్కడ. అందుకే బ్లాకు రాయుళ్లు సినిమాను అంటిపెట్టుకుని బతకగలుగుతున్నారు. అధిక ప్రింట్లు, అధిక రేట్ల వలన బ్లాక్‌మార్కెట్ చాలావరకు మూతపడిపోయింది. కానీ పైరసీ భూతం ఉద్భవించింది. సినిమాకు సమాంతరంగా పైరసీ క్యాసెట్ మార్కెట్‌లోకి వచ్చేస్తుంది. చేసేదేమి లేక చాలామంది నిర్మాతలు చిత్రం చూస్తుంటే బడానిర్మాతలు డబ్బులిచ్చి పైరసీ దారులను కంట్రోల్ చేస్తున్నారన్న గుసగుసలు పరిశ్రమలో వినపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత గట్టెక్కి పరిశ్రమని కాపాడాలంటే పెట్టుబడులను అధిక టికెట్ రేట్లతో లాగేయాలనేది ఉమ్మడిగా ఒప్పుకునే సత్యం. తీసుకునే నిర్ణయం.
ప్రభుత్వంపై పైరసీ భూతాన్ని అరికట్టమని అరచి గీపెడుతూనే మరోపక్క టికెట్ రేట్లు పెంపుకోసం వత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో పరిశ్రమ ఏకతాటిపై నడవడంలేదని వారి మీటింగ్‌లు చూస్తూనే అర్ధమవుతుంది. ఇది సక్సెస్ ప్రపంచం. క్రేజ్. సక్సెస్ అడుగంటిందా ఇట్టే పక్కన పెట్టేస్తారు. సినిమా సమాజాన్ని మేల్కొలిపే వినోదం ఒకప్పటిమాట. ప్రస్తుతం కళాత్మక భారీ వ్యాపారం. కోట్లు ఎంత స్పీడుగా వస్తాయో అంతే స్పీడుగా పోతాయి. ఈ విషయంలో సీనియర్ జూనియర్ అనే నిబంధనలు లేవు. అందుకే ఇక్కడ ఎవరి దారి వారిది. ఎవరి స్వార్ధం వారిది. సక్సెస్‌తోపాటు లాభాలు పండించుకోవాలి. అందువలనే ఎక్కువ శాతం మీటింగులలో ఏకాభిప్రాయం కుదరకుండా పోతుంది. మేమం టే ఒక్కటేననే భావన నీటిమూటని ఇండస్ట్రీలో విడిగా ఎవరిని కదిలించినా ఇట్టే చెబుతారు. సినిమా కనెక్షన్లను రాబట్టుకోవడంలో టికెట్ సీలింగ్, శ్లాబ్ సిస్టమ్ వంటి రెండు దశలు చూసింది. అమ్మిన టికెట్ల సంఖ్యకే టాక్స్ కట్టడం (టికెట్ సీలింగ్)లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అవకతవకలు చేయడంవలన అటు ప్రభుత్వానికి ఇటు నిర్మాతకు నష్టం వాటిల్లేది. శ్లాబ్ సిస్టమ్ వచ్చిన తరువాత థియేటర్ సీటింగ్ కెపాసిటీ మొత్తానికి (్ఫల్ అయినా కాకపోయినా) టాక్స్ కట్టడం జరుగుతుంది. దీనివలన ప్రభుత్వానికి నిర్మాతాకు భద్రత ఏర్పడింది. కానీ ఈ విధానంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. అదెలా అంటే చిన్న చిత్రాలకు (ప్రింట్లనుబట్టి) ఒక రకమైన పర్సంటేజ్‌లో టాక్స్‌ను భారీ చిత్రాలకు ఒక పర్సంటేజ్‌లో టాక్స్‌ను అనువాద చిత్రాలకు ఫుల్ టాక్స్‌ను కట్టాల్సి వుంది. ఈ విధానం పెద్ద చిత్రాలు ప్రదర్శిస్తున్నప్పుడు చిన్న చిత్రాలుగా చూపడం, అనువాద చిత్రాలు ప్రదర్శించేటప్పుడు మామూలు చిత్రాల పేర్లు థియేటర్ కలెక్షన్ రిపోర్టులో చూపడం జరుగుతుంది.
సినిమా పంపిణీ వ్యవస్థలో చాలా లోపాలు వుండడంవలన నిర్మాతలు ఈనాడు సినిమాను పూర్తిగా అమ్మివేయడానికే ఇష్టపడుతున్నారు. కానీ బడా నిర్మాతలకు కుదిరినట్టు చిన్న నిర్మాతలకు ఆఫర్లు రాకపోవడంతో సొంతగానో, పంపిణీదార్ల ఒప్పందాలకు లోబడో బిజినెస్‌కి సిద్ధపడాల్సి వస్తోంది. పైగా థియేటర్లు ఎక్కువ శాతం బడా నిర్మాతల చేతుల్లోనూ, డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనూ ఉండడం వలన చిన్న సినిమా నలిగిపోతుందనేది చిన్న చిత్రాల నిర్మాతల ఆవేదన. సినిమా నిర్మాణ దశలోనే ఒకప్పుడు బిజినెస్ జరుపుకునేది. ప్రస్తుతం ఇది అగ్రహీరోల చిత్రాలకే వర్తిస్తుంది. అగ్ర హీరోల చిత్రాలు గ్యాప్‌లతో నానాటికీ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి ఇండస్ట్రీకి తరలివచ్చే ఎంతోమంది నిర్మాతలు అవగాహనా రాహిత్యంతో అధిక శాతం నష్టాలను మూటగట్టుకుంటున్నారు. వీరిలో కొంతమంది భారీ సక్సెస్‌లు సాధించినా పంపిణీ వ్యవస్థపై పట్టు సాధించలేక చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు సక్సెస్ బోర్డుతో బయటపడుతున్నారు. థియేటర్ ప్రాంతాన్నిబట్టి, నిర్వహణా స్థాయినిబట్టి టికెట్ ధర పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం సహజం. కానీ ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాలు బయటపడాలంటే మొదటి రెండు వారాలపాటు అధిక ధరలు (స్థాయినిబట్టి) పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దాంతో గ్రాస్ కలెక్షన్లు షేర్ కలెక్షన్లు భారీగా కనిపించడం మొదలైంది. ఇవి మొత్తంగా పెద్ద చిత్రాలకే లాభం చూపెట్టడంతో చిన్న చిత్రాలు నష్టపోతున్నాయని గగ్గోలు చేయడంతో ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. అధికారికంగా ఈ విధానం రద్దయినా చాలా సెంటర్లలో అగ్ర హీరో చిత్రాలు విడుదలైనప్పుడు అధిక ధరలు గుట్టు చప్పుడు కాకుండా రన్ అయిపోతున్నాయి. అందుకే ‘గగనం’ వంటి చిత్రాన్ని ఇటీవల నిర్మించిన అగ్ర నిర్మాత మంచి సినిమాకు అధిక టికెట్ రేటు అడ్డంకే కాదని వాదిస్తాడు. సినిమా బాగోకపోతే టికెట్ ధర తగ్గించినా ఎవరూ రారనేది ఈయన వాదన. ఫ్లాపు సినిమాల విషయంలో ఈ అధిక ధరల వలన చాలావరకు గట్టెక్కేయవచ్చునన్నది ఈయన అభిప్రాయం. ఈయనకు జతగా గతంలో ‘జయం’ వంటి సక్సెస్‌లు అందించిన దర్శకుడు కూడా సినిమా బావుంటే ఎంత రేటైనా టూరింగ్ టాకీస్‌లోనైనా చూస్తారు, మల్టీ ఫ్లెక్స్‌లోనైనా చూస్తారని వాదిస్తాడు. దానిలో నిజం కూడా లేకపోలేదు. ఎగ్జిబిటర్ల విషయానికొస్తే సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో థియేటర్ రన్‌కోసం అగ్రహీరోల చిత్రాలకోసం పోటీపడుతున్నారు. నాన్ రికవరబుల్ అడ్వాన్సులు చెల్లించి మరీ సినిమాలు తమ థియేటర్లో వేస్తున్నారు. కొన్ని సినిమాలకు రేంజ్‌ని మించి మినిమమ్ గ్యారంటీలు మాగ్జిమమ్‌గా పెడుతున్నారు. మరి ఈ పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవాలంటే వీరికి అధిక రేట్లు కావాలి. అందుకే అనధికార రేట్లను అధికారుల కన్నుగప్పి అమ్మేస్తున్నారు. అధిక రేట్లతో ఎక్కువ షేర్లు చూపిస్తే ఎంతో కొంత థియేటర్ రెంట్ పెరుగుతుందనేది వారి ఆశ. ప్రస్తుతం ప్రతి టికెట్ అమ్మకంపై ప్రభుత్వం థియేటర్ మెయింటెనెన్స్ కోసం సర్‌చార్జి ఇస్తూనే ఉంది. అయినా సినిమాను బట్టి థియేటర్ లొకేషన్, స్థాయిలను బట్టి టికెట్ ధర పెంచుకునే (గరిష్ఠంగా) అవకాశం థియేటర్ యాజమాన్యానికి ఉండాలని కొంతమంది ఎగ్జిబిటర్స్ వాదిస్తున్నారు.
సినిమాకు వారిచ్చిన గ్యారంటీ అడ్వాన్సులను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ కార్మికుల పట్ల, థియేటర్ మెయింటినెన్స్‌పట్ల అశ్రద్ధ చూపడం పరిశ్రమలో ఎక్కువగా కనిపించే చిత్రం. మినిమమ్ మెయింటెనెన్స్ చేయని థియేటర్లు అనేకం ఉంటే ఘనంగా రన్ అవుతున్న మల్టీఫ్లెక్స్‌ల నిర్వహణ కూడా అంతంతమాత్రంగానే ఉండడంపై ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎగ్జిబిటర్లు ప్రేక్షకులనుండి ఎంత కొల్లగొట్టినా అధికశాతం ఆ మొత్తం డిస్ట్రిబ్యూటర్ల ఖాతాకే పోతుంది.
సినిమా వ్యాపారం చైన్‌లింక్ బిజినెస్‌గా మారింది. నిర్మాతనుండి అధికమొత్తం చెల్లించి ఏరియా బిజినెస్ దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్ తన సేఫ్‌కోసం ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తెస్తున్నాడు. పరోక్షంగా టికెట్ రేట్లు పెరగడానికి కారణమవుతున్నాడు. ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటర్లకు అగ్ర నిర్మాతలు తమ చిత్రాలను ఇస్తారనేది వాస్తవం. క్షణాల్లో పైరసీ ప్రింట్లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్న తరుణంలో సినిమాను జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలనేది డిస్ట్రిబ్యూటర్ల ప్లాన్.
అందుకే మాగ్జిమమ్ గ్యారంటీలు, నాన్ రికవరబుల్ అడ్వాన్సుల పేరుతో ఎగ్జిబిటర్లను బైండోవర్ చేసి వారిచేత అధిక రేట్లు అమ్మేలా చేస్తున్నారు. ఎగ్జిబిటర్ల మధ్య పోటీనిపెంచి అనుకున్నదానికంటే ఎక్కువ మొత్తాలను గుంజడానికే ప్రయత్నిస్తున్నారు. అగ్రహీరోల చిత్రాలు సక్సెస్ అయినా కాకపోయినా డిస్ట్రిబ్యూటర్‌గా సేఫ్ జోన్‌లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ఎగ్జిబిటర్స్ అధిక మొత్తాలను డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర బ్లాక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ఏ ఎగ్జిబిటర్‌ని అడిగినా ఇట్టే చెబుతారు. ఈ పరంపరలోనే చాలామంది ఈ వ్యాపారానికి స్వస్తిపలికి థియేటర్లను షాపింగ్ కాంప్లెక్స్‌ల్లా, కల్యాణ మండపాలుగా మార్చేసారు.
చిన్న నిర్మాతల ఆక్రోశం వెనక పెద్ద సినిమాయే ఉంది. అగ్ర హీరోల సినిమాలకు వచ్చినట్టు ఓపెనింగ్స్ రావు. కనీసం వచ్చే ఓపెనింగ్స్ కూడా అధిక రేట్ల వలన అటకెక్కుతాయి. అలా అని టికెట్ ధరలు తగ్గించడానికి క్రేజీ థియేటర్ యాజమాన్యాలు ఒప్పుకోవు. చిన్న సినిమాకు పెద్ద టికెట్ ధర చెల్లించాలంటే బావుందన్న వౌత్ టాక్ రావాలి. ఈ టాక్ వచ్చేలోపే సినిమా తీసేసే స్థితి. అందుకే టికెట్ ధరలు పెంచవద్దనేది వీరి వాదన. సాధారణంగా చిన్న సినిమాలు క్రేజీ థియేటర్ల స్క్రీనింగ్‌కి నోచుకోనే నోచుకోవు. అలా స్క్రీనింగ్ జరగాలంటే బడా నిర్మాతల నిబంధనలకు తలొగ్గి సినిమాను వారి డిస్ట్రిబ్యూషన్‌లో పెట్టాలి. ఇలా పెడితే దక్కే ఫలితం సక్సెస్ వచ్చినా సరిగా రాదనేది చిన్న నిర్మాతల అభిప్రాయం. పోనీ సొంతంగా బిజినెస్ చేద్దామంటే పంపిణీదారులు ఆసక్తి చూపని పరిస్థితి. ఇన్ని అడ్డంకుల మధ్య సినిమా రిలీజ్ చేయాలంటే టికెట్ ధరలు తక్కువగా ఉంటేనే చిన్న సినిమా బతుకుతుందనేది వీరి ఆవేదన. చిన్న సినిమాలు ఎక్కువగా వస్తేనే ఇండస్ట్రీలో పదిమందికి భోజనం దొరుకుతుందనే పెద్దల మాట నీటిమూటగానే మిగిలిపోతుంది. అయినా అష్టకష్టాలను భరించి ప్రతి ఏటా చిన్న సినిమాలే పరిశ్రమకు ఉత్సాహాన్నిచ్చే సక్సెస్‌లను చవి చూస్తున్నాయి. అంతే! ఈ చిత్రాల టెక్నీషియన్లు భారీ చిత్రాలు నిర్మించే వారి పంచన చేరిపోవడంతో చిన్న చిత్రాలు మళ్లీ కొత్తవారితోనే అదే కష్టాలను అనుభవిస్తూ మొదటికొస్తున్నాయి.
టికెట్స్ రేట్లు పెరగడంవలన గ్రాస్, షేర్ కలెక్షన్లు ఇట్టే కోట్లకు చేరుతున్నాయి. ప్రస్తుతం తెలుగు పరిశ్రమ రేంజ్ 80 కోట్లను కొల్లగొట్టే స్థాయికి పోతే అగ్రహీరో చిత్ర నిర్మాణ ఖర్చు దానిలో సగానికి చేరుకుంది. ఇదంతా ఎవరి ఘటనతో కాదు రేట్లు పెంచుకోవడం ద్వారానే సాధ్యమైంది. అమాంతంగా వచ్చిపడే కలెక్షన్ల పరంపర వలన పరిశ్రమలో డిమాండ్ సప్లై మాత్రం ఓ కుదుపు కుదిపేస్తుంది. ఎవరికి వారే ఇది మా ఘనతేననుకుని రాత్రికి రాత్రే రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శక నిర్మాత, కార్మిక సంఘ నాయకుడు కూడా ధృవీకరించారు.
ప్రతి ఒక్కరు ముందు సినిమా కలెక్షన్లను మించాలనే తాపత్రయంతో నిర్మాణంపై శ్రద్ధ కనబరచకుండా కలెక్షన్లు రాబట్టే మార్గాలు గురించి ఆలోచిస్తున్నారు. దానివలనే అగ్రహీరోల చిత్రాలు డిజాస్టర్‌లుగా మిగిలిపోయినా ఓపెనింగ్ కలెక్షన్లతో మూడొంతులు సేఫ్ అయిపోతున్నాయి. అందుకే భారీ డిజాస్టర్‌లు వచ్చినా అగ్రహీరోలకు, హీరోయిన్లకు డిమాండ్ తగ్గడంలేదు. అధిక టికెట్ ధరలను చూసుకునే క్రియేటిటివిటీ పేరుతో దర్శకులు ఎంతయినా ఖర్చు చేయించడానికి వెనుకాడడంలేదు. ఫలితాల్లోకి వచ్చేసరికి అలాంటి సినిమాలు భారీగా నిరాశను మిగులుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖర్చుపట్ల ఒకరినొకరు నిందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
బడ్జెట్ కంట్రోల్‌పై తలలు పట్టుకునే పరిశ్రమలో ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయంపై వారు సైతం నిలబడకపోవడమే కారణం. అందుకే పరిశ్రమలో ఎవరి స్టయిల్ వారిది. మనుగడకోసం పోరాడుతూ ఉంటారు. పోరాడలేకపోతే ఉన్నది పోగొట్టుకోవడం కంటే విశ్రమించడం మేలు. ఈ పంథాను ఎన్నో సంస్థలు అనుసరించాయి. మురారి, ఏడిద నాగేశ్వరరావు వంటివారు పరిశ్రమ జీవితంపట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారు.
సినిమా పరిశ్రమ కలెక్షన్ల పరంగా రేంజ్‌ని పెంచుకోవడం ఆర్థిక వ్యవస్థకు మంచిదే కానీ సక్సెస్‌ల శాతం తగ్గితే మనీ సర్క్యులేషన్ ఉంటుంది గాని మనుషుల సంఖ్య (నిర్మాతల) తగ్గిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వినోద పరిశ్రమ ద్వారా ఎంతో ఆదాయం లభించడంవల్లనే పరిశ్రమను ప్రోత్సహించడానికి అతిపెద్ద పరిశ్రమగా తీర్చిదిద్దడానికి సిద్ధపడుతుంది. అయినప్పటికీ పైరసీని అడ్డుకోవడంలో సరిగ్గా స్పందించడంలేదని విమర్శలు ఎదుర్కొంటున్నా టికెట్ల రేట్లు పెంపు విషయంలో మాత్రం సహకరిస్తుందనే చెప్పాలి.
కోట్లు కొల్లగొట్టే చిత్రపరిశ్రమలో ప్రధాన వాటాదారుడు ప్రేక్షకుడే. వినోదం, విశ్రాంతి..అభిమానం వంటి అంశాలతో ప్రేక్షకుడు సినిమాలు ఎంచుకుంటున్నాడు. టికెట్‌తో విశ్రాంతి సమయంలో ఖర్చుకు, పార్కింగ్ ట్రాన్స్‌పోర్టు వంటి ఖర్చులకు సిద్ధపడే థియేటర్లవైపు పరుగులు తీస్తూనే ఉన్నాడు. సినిమాయే ప్రధాన వినోదంగా ఉన్న తరుణంలో కుటుంబం, స్నేహితులతో సినిమాకు వెళ్లాలంటే ఖర్చును బేరీజు వేసుకునేవాడు. సినిమా టికెట్ ధర పెరిగిందన్న బోర్డు థియేటర్ వద్ద చూస్తే అనేకరకాలుగా కామెంట్ చేసేవాడు. కానీ ఈనాడు ఎంత ధర పెంచి కౌంటర్‌లో టికెట్ కొంటున్నా కామెంట్ చేయడంలేదు. దానికి ప్రధాన కారణం అతనితో కుటుంబం, స్నేహితులు, గతంలోలాగ వస్తామని మారాం చేయడంలేదు.
పిల్లలకు కంప్యూటర్ గేమ్స్, యువకులకు నెట్ ఛాటింగ్స్, మహిళలకు జీడిపాకంలాంటి సీరియల్స్ వచ్చాక సినిమా చిన్న బోయింది. అందుకే ఓపెనింగ్స్ కూడా డల్ అయిపోయాయి. అయినా కూడా షో కలెక్షన్లు ఘనంగా కనిపిస్తున్నాయి. కారణం అధిక టికెట్ ధరలే. 400మంది ఆడియన్స్ చూస్తే వచ్చే ఆదాయం 40మంది చూస్తే వచ్చేస్తుంది. రాశిపరంగా ప్రేక్షకుల సంఖ్య తగ్గినా వాసిపరంగా కలెక్షన్లు కోట్లు దాటుతున్నాయి. పండుగ పబ్బాల కలెక్షన్లు కూడా తక్కువ ప్రేక్షకులతోనే వచ్చేస్తున్నాయి. కుటుంబమంతా కలిసి స్నేహితులతో కలిసి సినిమాలు చూసే రోజులు అరుదైపోయాయి. అందుకే అధిక ధరలు ప్రేక్షకునికి ఎంతమాత్రం భారం కావడంలేదన్నది ప్రేక్షకుల భావన.
అధిక ధరల వలన ఎవరికి లాభం? అని ప్రశ్నించుకుంటే సక్సెస్ ఉన్న సినిమాలకేనని చెప్పాలి. సక్సెస్ లేకపోతే ప్రేక్షకుడు వేసుకునే సినిమాల లిస్టులో ఆ సినిమా ఉండదంతే! అగ్రహీరోలకు వేల రూపాయలు పెట్టి కొని చూసే అభిమానులు ఉండనే ఉన్నారు. ఇంటర్నెట్ బుకింగ్ సౌకర్యంతో టికెట్ ఇంటికేవస్తున్న తరుణంలో సినిమా రిజల్టుని బట్టే ప్రేక్షకుడు ఎంత ధరైనా చెల్లిస్తున్నాడు. టికెట్ ధరలు గురించి ఆలోచించే పరిశ్రమ ముందుగా క్వాలిటీ చిత్రాల నిర్మాణం కోసం కృషి చేస్తే మంచిది. *
మంచి సినిమాకు టికెట్స్ రేట్లు అడ్డు కానేకావు
టూరింగ్ టాకీస్..మల్టీఫ్లెక్స్ ఏదైనా ఒక్కటే
-ఓ ప్రముఖ నిర్మాత మాట
థియేటర్ల మెయింటెనెన్స్ కష్టమవుతుంది
టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం యాజమాన్యానికి ఉండాలి
-ఓ ఎగ్జిబిటర్ మాట
సినిమాకు మేమూ వస్తాం అని మారాం చేసే
కుటుంబ వ్యవస్థ లేదు. అందుకే రేట్లు పెద్దగా ఎఫెక్టు చూపవు
-ఓ ప్రేక్షకుడి అభిప్రాయం
పైరసీ భూతం ధాటికి తట్టుకోవాలంటే భారీ సినిమాలకు అధిక రేట్లు పెట్టక తప్పదు.
-ఓ డిస్ట్రిబ్యూటర్ వాదన
అధిక రేట్లవలన చిన్న సినిమా చూసేవారి సంఖ్య తగ్గిపోయి తీవ్ర నష్టాలు ఏర్పడుతున్నాయి
-చిన్న నిర్మాతల ఆవేదన
పెంచుతున్న రేట్లవలన కనెక్షన్లు రేంజ్ మించి వచ్చినట్టయితే పరిశ్రమలో ప్రతి ఒక్కరూ రెమ్యునరేషన్ పెంచమంటారు...పెంచేస్తారు
-ప్రముఖ దర్శకుడుగా నిర్మాతగా వేదన
-బాసు
March 24th, 2011, ఆంధ్రభూమి వెన్నెల

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి