కారాలు -మిరియాలు (ఫర్వాలేదు)
ప్రయత్నం మంచిదే కానీ...!
తారాగణం:
నవకేశ్, మధుశాలిని
తదితరులు.
సంగీతం: ప్రవీణ్ కృష్ణమూర్తి విద్యాధరణి
నిర్మాణం: బ్లూరే ప్రొడక్షన్స్
నిర్మాత, దర్శకత్వం:
పసుపులేటి వెంకటరామారావు
ఉద్దేశ్యం మంచిదైతే సరిపోదు. చెప్పే విధానం కూడా బాగుండాలి. అదే విధంగా మంచి సబ్జెక్ట్‌ను తీసుకుని, తెరకెక్కించినంత మాత్రాన సరిపోదు. స్క్రిప్ట్ క్రిస్ప్‌గా, షార్ప్‌గా వుండాలి. సినిమాకు డ్రామాకు తేడా స్పష్టంగా వుండాలి. అప్పుడే సినిమా జనరంజకమవుతుంది. కారాలు మిరియాలు పేరిట వచ్చిన సినిమాలో విషయం మంచిదే. ఎటువంటి అసభ్యతకు, అక్కరలేని ‘ఎ’క్లాస్ సన్నివేశాలకు తావివ్వకుండా, చెప్పాలనుకున్నదంతా సూటిగా చెప్పడం వరకు ఓకె. కానీ జనం దాన్ని ఏ మేరకు ఆస్వాదిస్తారన్నది మాత్రం ఆలోచించలేదు. చేదుమాత్రకు సుగర్ కోటింగ్ తప్పని సరి కదా?
కేవలం నాలుగు ముఖ్యపాత్రల చుట్టే నడిచిన కథ కారాలు-మిరియాలు. సమకాలీన సమాజంలో, యువతరంలో పెరుగుతున్న విడాకుల సంఖ్యను, విడిపోతున్న జంటలను దృష్టిలో వుంచుకుని అల్లిన కథ. ముఖ్యంగా ప్రతి అమ్మాయి పెళ్లయ్యేదాకా తన తండ్రి ఎలా రక్షణగా, ఆలన పాలనతో తనను చూసాడో, భర్త కూడా అలాగే చూడాలని కోరుకుంటుంది. ఇది లభించకే అసంతృప్తి మొదలవుతుందనే కొత్త సైకాలజీ పాయింట్ ఇందులో ప్రధాన విషయం. ప్రేమించి పెళ్లి చేసుకున్న లండన్‌లోని భారతీయ జంట అరవింద్ (నవకేష్), శ్రేయ (మధుశాలిని). పెళ్లికి ముందు..‘నువ్వు దేవతవి..నీ కోసం ఏమైనా చేస్తా, ఎంతకైనా రెడీ’ అంటూ ఆమె ముందు మోకరిల్లినవాడు, పెళ్లయ్యాక వివిధ కారణాల వల్ల ఇగో పెంచుకుంటూ గొడవలు పడుతుంటాడు. భర్త ఉద్యోగ బాధ్యతలను, ఆలోచనలను విస్మరించి, గతకాలపు ప్రేమ పోయిందని ఫీలయ్యే శ్రేయ, తను గర్భవతి కాగానే ఇండియాలో వున్న బామ్మను (రత్నసాగర్) లండన్‌కు రమ్మని కోరుతుంది. ఆమె వచ్చిన దగ్గర నుంచీ అరవింద్-శ్రేయల నడుమ గొడవలు మరింత పెరుగుతాయి. చివరకు ఈ జంట వ్యవహారం ఏ తీరానికి చేరిందన్నది కథ.
యువతరం ఆలోచనలు, ఆలుమగల నడుమ పెరుగుతున్న అంతరాలు అన్నింటినీ స్పృశిస్తూ కథ తయారుచేసుకోవడం వరకు బాగానే వుంది. యువత మనోభావాలకు అనుగుణంగా డైలాగుల శైలి కూడా ఓకె. కానీ సన్నివేశాల నిడివి, డైలాగుల నిడివి కూడా కాస్త చూసుకోవాల్సింది. పైగా భార్యాభర్తల నడుమ సిల్లీ గొడవల గురించే సినిమా నడిపితే బాగుండేది. అలా కాకుండా మళ్లీ సంప్రదాయాలు, తలంట్లు, సున్నుండలు..ఇవన్నీ చొప్పించడంతో కొన్ని సన్నివేశాలు, ఉపదేశాలు, ఉపన్యాసాల కోసం తయారుచేసినట్లయింది. సినిమా వేగాన్ని కూడా ఇవి కొంతవరకు దెబ్బతీసాయి. నిజానికి యువ జంట నడుమ కుర్రాళ్లను ఆకట్టుకోవడం కోసం కాస్త మసాలా సన్నివేశాలు చొప్పించే అవకాశం వున్నా, అలాంటి కక్కుర్తికి దూరంగా వున్నందుకు దర్శకుడిని అభినందించాలి. పైగా చిన్న సినిమా కానె్సప్ట్ ప్రకారం కేవలం నలుగురి చుట్టూ నడిచేలా కథను తయారుచేసుకున్నందుకు, విశ్రాంతి వరకు కాస్త సస్పెన్స్ నడిపేందుకు ప్రయత్నించినందుకు కూడా. కానీ ముగింపు మామూలు తెలుగుసినిమాల్లా ఉద్యోగం పోవడం, భార్య డబ్బులు కట్టడంతో భర్త మారిపోవడం లాంటి రొటీన్ ఫార్ములా టైపు కాకుండా వుంటే బాగుండేది. అదీగాక ఇంత ప్లెయిన్ స్టోరీ టెల్లింగ్ ప్రక్రియ ఈ కాలం కుర్రకారుకు ఎంతవరకు నచ్చుతుందన్నది అనుమానమే. పైగా పాటల విషయంలో సినిమా కాస్త వెనుకబడింది. పైగా పాటలను మన తెలుగుసినీ జనాలకు అలవాటైన విదేశీ వీధుల్లోనూ, దుకాణాల ముందు కాకుండా మంచి లొకేషన్లలో తీసి వుంటే కాస్త డిఫరెంట్‌గా వుండి వుండేది. నేపథ్యసంగీతం వరకు ఫరవాలేదు. లండన్ తదితర ప్రాంతాలను కళ్ల ముందుంచిన ఫొటోగ్రఫీ చక్కగా వుంది.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. తెలుగు తెరపై చాన్నాళ్లుగా కనిపించని మధుశాలిని ఈ చిత్రంలో హీరోయిన్‌గా మంచి మార్కులే సంపాదించుకుంది. సరైన హావభావాలు పలికించగలిగిన మధుశాలిని మరి తెలుగునాట అవకాశాలు లేవేలనో? అరవింద్‌గా నటించిన నవకేశ్ ఫరవాలేదు. హీరో స్నేహితుడిగా నటించిన లండన్ సునీల్ నటనలో కాస్త ఈజ్ వుంది. దర్శకుడు పసుపులేటి రామారావు కాస్త కొత్త విషయం చెప్పడానికి ప్రయత్నించిన ఈ సినిమాను కమర్షియల్ హంగులు ఆశించి వెళ్తేమాత్రం భంగపడతారు. కాస్త నీట్‌గా వుండే సినిమాను ఆస్వాదించదలిస్తే వెళ్లచ్చు.
-వి.ఎస్.ఎన్ March 24th, 2011, ఆంధ్రభూమి, వెన్నెల

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి